తెలంగాణ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెస్తాం - టెక్కి అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు
-తెలంగాణలో ఉత్పత్తి నైపుణ్యానికి కొదవ లేదు
- పరిశ్రమలను పథకం ప్రకారం అణిచేశారు
- ప్రత్యేక రాష్ట్రంలోనే మన మనుగడ
- రాష్ట్రం ఏర్పడితే ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
- స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి
- తెలంగాణ పెట్టుబడిదారులకు సలహాలు
‘‘సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ పారిక్షిశామిక రంగాన్ని ఛిద్రం చేశారు. నిజాంల కాలంలో నిత్యం కళకళలాడిన పరిక్షిశమలు నేడు కనుమరుగయ్యాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని టెక్కి అధ్యక్షులు వెంక చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన సీమాంధ్ర పారిక్షిశామికవేత్తల కుట్రలు, కుతంవూతాలను ఎదిరించి ఈ రంగంలో నిలబడ్డారు. పారిక్షిశామిక అభివృద్ధి కోసం ఏర్పడిన ఫ్యాప్సీ ఒక ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పారిక్షిశామిక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ వాణిజ్య పారిక్షిశామిక మండలి(టెక్కి)ని ఏర్పాటు చేశామని అన్నారు. వెంక టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..
(, హైదరాబాద్)ఒక సంస్థ ఉండగా మరొక సంస్థ ఏర్పాటు జరుతున్నదంటే, అక్కడ స్థానికుల ప్రమేయం సరిగ్గా లేకపోవడమే కారణంగా భావించాల్సింది ఉంటుందని టెక్కి అధ్యక్షులు ఎం వెంక చెప్పారు. ఫ్యాప్సీలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం రక్షించుకునేందుకే టెక్కిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో పరిక్షిశమల పాత్ర ఏంటి?
నిజాం సంస్థానాధీశులు పరిక్షిశమల ద్వారా ఖజానాకు భారీ ఆదాయం వచ్చేలా చేశారు. వ్యవసాయం అభివృద్ధికి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాజులు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ పరిక్షిశమలను తెచ్చారు. స్పిన్నింగ్ మిల్స్, దాల్, రైస్, షుగర్స్ మిల్స్‌లు ఈ కోవలోనివే. సహజ వనరులు కూడా అధికంగా ఉండడంతో వీటిని ఉపయోగించుకోవడానికి స్టీల్, ఇంజనీరింగ్ పరిక్షిశమలను పెట్టారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను కల్పించారు.
సమైక్య రాష్ర్టంలో పారిక్షిశామిక అభివృద్ధి ఎలా జరిగింది? తెలంగాణ పాత్ర ఎంత?
సమైక్య రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృద్ధి ఒకవైపే ఎక్కువ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నది సీమాంవూధలే. దీంతో వారికే ప్రోత్సాహకాలు ఎక్కువగా లభించేవి. అనుకున్న స్థాయిలో తెలంగాణ వారికి పోత్సాహకాలు దొరకడం లేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ పారిక్షిశామిక రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగాయా?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిక్షిశమల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. సింగరేణి గనుల్లో అధికార వర్గం అంతా సీమాంవూధలే. దీంతో వారు తమ ప్రాంతానికి చెందిన వారినే కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. స్థానికులకు కాంట్రాక్టర్లుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారు. ఆఫీసు స్టాఫ్ ఉద్యోగాల్లోనూ వారే చేరారు. గనిలో పని చేసే కార్మికులు మాత్రమే తెలంగాణ బిడ్డలు. బీహెచ్‌ఈఎల్ తదితర కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. సీమాంవూధులు హైదరాబాద్‌లోనే పరిక్షిశమలు ఏర్పాటు చేసినా, వాటిల్లో స్థానిక తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు
నిజాం కాలంలో వెలిగిన పరిక్షిశమలు నేడు మూతపడటానికి కారణాలేంటి?
సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ పరిక్షిశమలు మూతపడ్డాయి. దీనికి ఆంధ్రా అధికారులు ఊతమిచ్చేలా కావాలనే నిర్లక్ష్యం చేశారు. అవి మూతపడేలా చేశారని పరిక్షిశమలు మూతపడిన తీరు చూస్తే అర్థమవుతుంది.
ప్రైవేట్ రంగంలో తెలంగాణ పెట్టుబడిదారుల పాత్ర ఏంటి?
ప్రైవేట్‌రంగంలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలు ఎదిగే అవకాశాలు లేకుండా దొడ్డిదారిన అడ్డుకున్నారు. వర్గంలోనూ వారిదే పైచేయి కావడంతో చివరకు రుణ సౌకర్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిక్షిశమలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం సరైన పద్ధతిలో అందకపోవడంతో పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా వెనక్కు తగ్గారు.
తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు వ్యాపారం చేయడం రాదనే విమర్శలున్నాయి కదా?
ఈ ప్రచారం పథకం ప్రకారం సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రనే. తెలంగాణ పారిక్షిశామికవేత్తలు మొదటి నుంచి ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి సారించారు. కాకపోతే తెలంగాణ వారికి కుట్రలు, కుతంవూతాలు తెలియవంతే. కానీ.. 80 శాతం సీమాంవూధుల పరిక్షిశమలు వచ్చాయి. అధికార వర్గంలో కూడా వారే ఉండడంతో పరిక్షిశమల లైసెన్స్‌లు, సబ్సిడీలు వారికే ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ వాళ్లు ఒ ప్రాజెక్టు తీసుకొని వెళితే.. అనుమతులు ఇవ్వకుండా వేధిస్తారు. విసిగించి ప్రాజెక్టులను కాజేస్తారు. చివరకు తెలంగాణ మున్సిపాలిటీల్లో వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్టు మొత్తం సీమాంవూధకు చెందిన రాంకీకే ఇవ్వాలని సెక్ర స్థాయి అధికారులు ఓరల్‌గా చెప్పి ఇతరులకు అవకాశాలు లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. .
తెలంగాణ కార్మికులు పని చేయరు కాబట్టే.. ఉద్యోగాలు రావట్లేదన్న ప్రచారం ఉంది..
పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంలో ఇదీ ఒక భాగమే. కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చికుక్క అని ప్రచారం చేయాలన్న తీరుగా, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకూదన్న ఉద్దేశంతో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సీమాంధ్ర పరిక్షిశమల్లో పనిచేసే కొద్ది మంది తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు చాలా పోటీతత్వంతో పని చేస్తున్నారు. నిజాం హయాంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఉన్నారు. వరంగల్‌లో తయారు చేసిన కత్తులు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవంటే ఇక్కడి కార్మిక శక్తి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి.
తెలంగాణ పారిక్షిశామిక రంగం కోసం టెక్కి ఏం చేయాలనుకుంటోంది?
తెలంగాణ పారిక్షిశామిక రంగానికి జరిగిన అన్యాయంపై శ్వేత పత్రం తయారు చేస్తాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇస్తాం. సర్కారు స్పందించకపోతే ముఖ్యమంవూతిని కలుస్తాం. అక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేం తయారు చేసే రిపోర్టు ప్రభుత్వానికి నచ్చే పద్ధతిలో ఉంటుంది. పారిక్షిశామికరంగంలోకి కొత్త వచ్చే ఔత్సాహికులను మేం ప్రోత్సహిస్తాం. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని వస్తే దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలా సలహాలిస్తాం. మా అనుభవాన్ని వారికి ఉపయోగపడేలా సహకారం అందిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా కొత్త పరిక్షిశమలు వచ్చేలా ప్రయత్నిస్తాం.
ఈ మేరకు టెక్కి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తుంది. ఈ కమిటీల ద్వారా నిత్యం సమాచారాన్ని సేకరించి, సమీక్షించి పారిక్షిశామికాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇదే సమయంలో కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ఇకపై వచ్చే పరిక్షిశమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తాం. ఈ మేరకు ప్రతివిషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తాం. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విదేశీ పెట్టుబడుల సహకారాలతో ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పునరుద్ధరించేందుకు టెక్కి పూనుకుంటుంది. ఈ మేరకు పేపర్ వర్క్ చేస్తున్నాం
Telangana History
Read Part - 1 click this link
http://voice2telangana.blogspot.com/2011/12/nizam-in-telangana.html
Read Part - 2 click this link
http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html
Read Part - 3 click this link
http://voice2telangana.blogspot.com/2011/12/telangana-history-part-3-and-hyderbad.html
Take By: T News .
0 comments:
Post a Comment