తెలంగాణ కోసం ఎప్పుడో తీర్మానం చేశాం: పవార్
సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు చేరుకున్న టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తెలంగాణకు ప్రభుత్వ, మిత్రపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణకు మద్దతివ్వాలని కేసీఆర్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ తమకు తో డ్పాటునివ్వాలని కోరా రు. దానికి సానుకూలం గా స్పందించిన పవార్ తెలంగాణకు అనుకూలంగా తన వైఖరిని ఏనాడో స్పష్టం చేశానన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.
తెలంగాణ ఇవ్వాలని సోనియాకు పవార్ గతంలోనే స్పష్టం చేశారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీలు ఇద్దరు ముగ్గురు సభ్యులున్న చిన్న పార్టీల నాయకులతో చర్చించారు. తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రక్రియలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో సెంట్రల్ హాల్‌కు చేరుకున్న టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ నిరసన కార్యక్షికమాలను సమీక్షించుకున్నారు. తాము రెండు రోజులుగా సభ లోపల, వెలుపల నిరసన తెలిపినా అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై వారు కొంత అసంతృప్తికి లోనయ్యారు. గత శీతకాల సమావేశాల మాదిరిగా పార్టీ పెద్దలు తమను సంప్రంతించి తెలంగాణపై ప్రకటన చేస్తారన్న నమ్మకంతో నిరసనలను కొనసాగించాలని భావించారు. అధిష్ఠానం ప్రతిస్పందనలను బట్టి నిరసన కార్యక్షికమాల తీవ్రత పెంచడమో తగ్గించడమో చేయాలని నిర్ణయించారు. ఎక్కడా పార్టీని ధిక్కరించేటట్లు వ్యవహరించకుండా తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలన్న తపనను వ్యక్త పరచాలని వారంతా నిశ్చయించుకున్నట్లు సమాచారం.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News,
0 comments:
Post a Comment