మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఎన్‌కౌంటర్
కోల్‌కత : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత కిషన్‌జీని పోలీసలు కాల్చి చంపారు. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రం పశ్చిమ మిడ్నాపూర్‌లోని సాల్పోనీలో కిషన్‌జీని పోలీసులు కాల్చిచంపారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు కూడా ధృవీకరించారు. కుష్బునీ అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందినట్లు తెలుస్తోంది. కిషన్‌జీ అసలు పేరు మల్లోజులు. మల్లోజులుతోపాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజులు మావోయిస్టు ఉద్యమంలో తొలితరానికి చెందిన వ్యక్తి. సిరిసిల్లలో ఇంటర్, కరీంనగర్‌లో డిగ్రీ చేశాడు. ఉస్మానియాలో న్యాయశాస్త్రం చదువుతూ మధ్యలో ఆపేశాడు. 1956 లో కిషన్‌జీ జన్మించారు. ఉద్యమంలో తిరుగులేని నేతగా మల్లోజుజుల కోటేశ్వరరావు ఒక వెలుగు వెలిగారు. ఉద్యమంలో ఆయన రాజీలేని పోరాటం చేశారు. ప్రభుత్వాలు జనం గొంతు నొక్కినంతకాలం ఆయుధాలు వదలమని ఎన్నోసార్లు కిషన్‌జీ విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ కోసం కిషన్‌జీ తన జీవితాన్ని ధారపోసారని చెప్పవచ్చు. 1975లో ఆయన ఉద్యమంలోకి అడుగు పెట్టారు. కిషన్ జీ తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. కిషన్‌జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్‌రావ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. కిషన్ జీ మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో ముప్పాళ్ల గణపతి తరువాత కిషన్ జీదే అగ్రస్థానం.
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఓ నాటకమని, దాన్ని బహిష్కరించాలని కిషన్‌జీ గతంలో పిలుపునిచ్చారు. కమిటీల పేరుతో తెలంగాణ అంశాన్ని కేంద్రం అటకెక్కించిందని కిషన్‌జీ చెప్పారు. తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర నేతలు చేసిన రాజీనామాలను ఆయన పవర్ పాలిటిక్స్‌లో భాగమేనని చెప్పారు.
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఓ నాటకమని, దాన్ని బహిష్కరించాలని కిషన్‌జీ గతంలో పిలుపునిచ్చారు. కమిటీల పేరుతో తెలంగాణ అంశాన్ని కేంద్రం అటకెక్కించిందని కిషన్‌జీ చెప్పారు. తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర నేతలు చేసిన రాజీనామాలను ఆయన పవర్ పాలిటిక్స్‌లో భాగమేనని చెప్పారు.
Take By: http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=1&ContentId=47700
0 comments:
Post a Comment