ఒకే నినాదం జై తెలంగాణ
లోక్‌సభలో తెలంగాణం
- రెండోరోజూ కొనసాగిన నిరసనలు
- నేడు మళ్లీ టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
- తెలంగాణకు మద్దతిస్తాం.. కేసీఆర్‌కు శరద్‌పవార్ హామీ
- నల్లధనంపై నేడు చర్చ
- సర్కారు, బీజేపీ మధ్య అవగాహన
- సుష్మ, ప్రణబ్ ముఖర్జీ మంతనాలు
- రాత్రి పొద్దుపోయాక ఒప్పందం!
- ధరల పెరుగుదలపై సోమవారం చర్చ?

తామిచ్చిన వాయి దా తీర్మానంపై చర్చకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్‌ను పదేపదే కోరారు. చర్చకు అనుమతి నిరాకరించడంతో వారిరువురూ వెల్‌లోకి వెళ్లి, తమ నిరసనను కొనసాగించారు. ‘పార్లమెంటులో తెలంగాణ బి ల్లును ప్రవేశపెట్టండి’ అని రాసి ఉన్న ప్లకార్డులతో కాం గ్రెస్ ఎం పీలు కూడా వెల్‌లోకి చేరారు. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌డ్డి, మందా జగన్నాథం, రాజయ్య, బలరాంనాయక్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, మధు యాష్కీ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేంత వరకు సభను కొనసాగనివ్వబోమని టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ వారితో జత కలిశారు. అదే సమయంతో అధిక ధరలపై చర్చించాలని లెఫ్ట్ సభ్యులు సైతం వెల్‌లోకి రావడంతో సభలో గందరగోళం నెలకొంది.
సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సభాపతి పదేపదే విజ్ఙప్తి చేసినప్పటికీ పరిస్థితులు కుదుటపడకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో తెలంగాణ నినాదాలు మారుమోగినంత సేపు ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రేక్షక పాత్ర పోషించారు. తమ పార్టీ ఎంపీల చేతుల్లోని తెలంగాణ ప్లకార్డులు చదవటానికే పరిమితమైన వారు సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదు. సభ వాయిదాతో తెలంగాణపై బుధవారం నాటి తమ వాయిదా తీర్మానం చర్చకు రాకపోవడంతో టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం మరో వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌కు అందించనున్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల నాలుగున్నర కోట్ల ప్రజల్లో నెలకొన్న అశాంతి, ఆందోళన’’పై చర్చకు ఆ పార్టీ ఎంపీలు పట్టుపట్టనున్నారు. సభ ప్రారంభానికి ముందే ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. 600 మంది ప్రాణ త్యాగాలు గుర్తించైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు.
నేడు నల్లధనంపై చర్చ?
ఇదిలా ఉండగా.. నల్లధనంపై చర్చ విషయంలో ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. గురువారం వీరి మధ్య ఒక ఒప్పందం జరగనున్నట్లు సమాచారం. దీంతో గురువారం నుంచి సమావేశాలు సజావుగా సాగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. నల్లధనం అంశంపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై గురువారం చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో సభా నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ జరిపిన సమావేశంలో ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్న వామపక్షాలు.. తాజా పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
దీంతో ప్రత్యేకంగా ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తున్నాయి. ధరల పెరుగుదల అంశంపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. అటు డీఎంకే సభ్యులు డ్యామ్ 999 అనే త్రీడీ సినిమా విడుదలను అడ్డుకోవాలని పట్టుబట్టారు. ఎన్సీపీ సభ్యులు ఉల్లిపాయల ఎగుమతులపై పరిమితులు ఎత్తివేయాలని కోరుతూ తమ తమ స్థానాల్లో నిలిచి నినాదాలు చేశారు. ఈ అంశాలు కూడా తోడవడంతో బుధవారం నాడు ఉభయ సభల్లోనూ ఎలాంటి కార్యక్షికమాలు సాగలేదు. తీవ్ర గందరగోళ పరిస్థితులు కనిపించాయి.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, Lok Sabha,
0 comments:
Post a Comment