బక్రీద్ తర్వాత తెలంగాణపై నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబర్ 31 (): నవంబర్ మొదటివారంలోని బక్రీద్ పండుగ ముగిసిన తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకునే దిశగా కదులుతామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం స్పష్టంచేశారు. పండుగ తర్వాత తెలంగాణపై నిర్ణయంగానీ, నిర్ణయం తీసుకునే దిశగా అడుగులుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. హోం మంత్రిత్వ శాఖ నెలవారి నివేదికను సోమవారం చిదంబరం మీడియాకు వివరిస్తున్న సందర్భంగా, తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటుచేయనున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇది పండుగల సీజన్ కనుక బక్రీద్(నవంబర్ 7) కూడా ముగిసిన తర్వాతే నిర్ణయం తీసుకోగలమని చిదంబరం చెప్పారు. పండుగల సీజనైనందునే తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లలేకపోతున్నదని ఆంధ్రవూపదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలోని వివిధ గ్రూపులకు ఇదివరకే తెలియజేశారని అన్నారు. పండుగల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో సమ్మె విరమించాల్సిందిగా ఆజాద్ ఇటీవల అక్కడి ఉద్యోగ వర్గాలకు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ అంశంపై తాను చెప్పాల్సిందంతా ఇదివరకే చెప్పానని చిదంబరం అన్నారు.
Take By: T News
Keywords: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand,
Keywords: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand,
0 comments:
Post a Comment