కోమటిరెడ్డి దీక్ష ప్రారంభం
నల్లగొండ: మాజీ మంత్రి, నల్లగొండ ముద్దు బిడ్డ కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కోసం ఆమరణ దీక్ష ప్రారంభించారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో ఇవాళ మధ్యాహ్నం అమరుడు శ్రీకాంతాచారి తల్లి చేతుల మీదుగా కోమట్‌రెడ్డి దీక్షను చేపట్టారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన శపథం చేశారు. పరిస్థితులు చేయిదాటితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మాజీ మంత్రి, నల్లగొండ ముద్దు బిడ్డ కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కోసం ఆమరణ దీక్ష ప్రారంభించారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో ఇవాళ మధ్యాహ్నం అమరుడు శ్రీకాంతాచారి తల్లి చేతుల మీదుగా కోమట్‌రెడ్డి దీక్షను చేపట్టారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేవరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన శపథం చేశారు. కోమట్‌రెడ్డి దీక్షకు నల్లగొండ జిల్లా నలుమూలనుంచి జనం తరలివాచ్చారు. వెంకన్నా... మీ వెంట మేమున్నాం... జై తెలంగాణ... జైజై తెలంగాణ అంటూ నినదించారు. టీ కాంగ్రెస్ ఎంపీలు కేకే, గుత్తా, పొన్నం, రాజయ్య, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజయ్య, సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయి దీక్షకు సంఘీభావం తెలిపారు.
Take By: T News
Keywords: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand,
0 comments:
Post a Comment