‘డ్యామ్ 999’ ప్రదర్శనపై నిషేధం - Dam 999
- తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు
- సుప్రీంకు వెళ్లే యోచనలో సినిమా దర్శకుడు
చ్నై, నవంబర్ 24: వివిధ రాజకీయ పక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం వివాదాస్పద చిత్రం ‘డ్యామ్ 999’ ప్రదర్శనపై నిషేధం విధించింది. కేరళతో సంబంధాలు దెబ్బతింటాయని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ముల్లపెరియార్ డ్యామ్ ఇతివృత్తంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చిత్ర దర్శకుడు సోహన్ రాయ్ వెల్లడించారు.
ఈ నిషేధంతో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, సినిమాల విషయంలో ఇలా వ్యవహరించకూడదని అభివూపాయపడ్డారు. కేరళలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో డ్యామ్ పరిసర ప్రాంతాలలో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా కేంద్రాన్ని అభ్యర్థించారు. కొత్త డ్యామ్ నిర్మాణం విషయంలో సహకరించవలసిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌కు బుధవారం ఒక లేఖ రాశారు. కొత్త డ్యామ్ ఆలోచన చేయకూడదని కేరళకు సూచించాల్సిందిగా ప్రధానిని కోరారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో నెలకొని ఉన్న ఈ డ్యామ్ 116 ఏళ్ల క్రితం నిర్మించారు. కేరళలో ఉన్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దక్షిణ తమిళనాడు జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తుంది. దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి 999 ఏళ్లు న్యాయపరంగా హక్కు ఉంటుంది.
Take By: T News
Tags: T News, hmtv, tv9, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood, డ్యామ్ 999, Dam 999,
0 comments:
Post a Comment