రాజోలిబండ రాజుకుంది!
- ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత.. ఆనకట్టపై ఇసుక బస్తాలు
- నీటి కోసం తెలంగాణ రైతుల యత్నం
- దాడికి సిద్ధమైన సీమాంధ్ర రైతాంగం
- ఒప్పందం ప్రకారం నీళ్లివ్వాల్సిందే
- జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్
- తెలంగాణ రైతాంగానికి పరామర్శ
- ఆర్డీఎస్‌పై రాయలసీమ పెత్తనం
- ఆది నుంచీ పాలమూరు రైతుకు శాపం
అయిజ, గద్వాల) :మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఉన్న ఉన్న రాజోలిబండ డైవర్షన్ పథకం వివాదం మరోసారి రాజుకుంటున్నది. ఓవైపు ఖరీఫ్ పంటలు ఎండిపోతుంటే వాటిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం ఆనకట్టపై నీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు ఒక అడుగు ఎత్తున ఇసుక బస్తాలు వేయడంతో ఆర్‌డీఎస్ వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కింది స్థాయిలో నీరు తక్కువ కావడంతో ఆవేదన చెందిన రైతు లు ఆర్టీఎస్ చైర్మన్ సీతారామిడ్డిని శనివారమే కలిశారు. దీనిపై ఆయన నీటి కోసం ఇండెంట్ కూ డా పెట్టారు. ఈ మేరకు సుమారు వెయ్యి క్యూసెక్కుల నీరు మూడు నాలుగు రోజుల్లో ఎగువ నుంచి రావాల్సి ఉంది. ఈ నీటిని నిలుపుకునే ఉద్దేశంతో రైతులు ఆదివారం నాడు వేలాదిగా ప్రాజెక్ట్‌కు తరలి వచ్చారు. ఆనకట్టపై ఇసుక బస్తాలు పేర్చి, నీటి ప్రవాహాన్ని నిరోధించారు.
కర్నూలు వైపు తీరం వెంబడి ఉన్న ఆయకట్టు రైతులు దీన్ని సహించలేదు. పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు, సుమోల్లో అవతలి ఒడ్డుపై నిలబడ్డారు. ఇసుక బస్తాలు తొలగించేస్తామని తెలంగాణ రైతులను హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తెలంగాణ రైతులు బస్తాలు పేర్చడాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకోవడంతో రైతులు తమ బాధను ఆమె దగ్గర వెళ్లబోసుకున్నారు. రైతుల గోడు విన్న కవిత ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకుని ఈఈ, డీఈలతో మాట్లాడారు. ఏది ఏమైనా ఆర్డీఎస్ కెనాల్‌కు రావాల్సిన వాటా ప్రకారంగా పంటలు పండే వరకు సాగునీరు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. ఆనకట్ట దగ్గర మోహరించిన ఆంధ్ర, కర్ణాటక పోలీసులు పరిస్థితి చేయి జారకుండా చూశారు. దశాబ్దాలుగా ఆర్డీఎస్ రైతాంగం దగా పడుతున్నా తెలంగాణ ప్రజావూపతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పంట చేతికొచ్చే దశలో నీటి తడుల కోసం ప్రాధేయపడాల్సిన దుస్థితి నెలకొందని వారు చెబుతున్నారు.
బాబ్లీ ప్రాజెక్టుతో మహారాష్ట్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టుతో కర్ణాటక, సుంకేసుల బ్యారేజీతో రాయలసీమలు తెలంగాణ ప్రాంతంలోని ఆయకట్టుకు సాగునీరు అందకుండా మోకాలడ్డుతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలతో రైతాంగం పోరాడుతున్నదే తప్ప.. మంత్రులు, ప్రజావూపతినిధులు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వెల్లు
ఇప్పటికీ న్యాయం లేదు!
నిజాం కాలంలో పురుడు పోసుకున్న ఆర్డీఎస్ నీటి మళ్లింపు పథకం కింద తెలంగాణలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాలలోని ఆయకట్టుకు 15.9 టీఎంసీల సాగునీరు అందాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నాటి నుంచి నేటి వరకు నిర్దేశించిన ఆయకట్టు(87,500)కు సాగునీరు అందిన దాఖలాలు లేవు. దీంతో ఆర్డీఎస్ రైతాంగం సుంకేసుల బ్యారేజీ తరహాలోనే ఆర్డీఎస్ మళ్లింపు పథకాన్ని బ్యారేజీగా మార్చాలని, అది ఈ ఆధునీకీకరణ పనుల భాగంలోనే చేపట్టాలని డిమాండ్ చేస్తోంది.
బ్యారేజీతోనే ప్రయోజనం..
నాటి మద్రాసు రాష్ట్రంతో ఒప్పందం ప్రకారం కర్నూలు, కడపలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుంగభద్ర నదిపై రాజోలి వద్ద సుంకేసుల బ్యారేజీని నిర్మించారు. గద్వాల, అలంపూర్ ప్రాంతాలలోని లక్ష ఎకరాలకు సాగునీరిచ్చేందుకు సుంకేసులకు ఎగువన కర్ణాటకలోని రాజోలిబండ వద్ద ఆర్డీఎస్‌ను నిర్మించారు. 1952-69 మధ్య కాలంలో నీటి వాడకంలో వివాదాలు ఏర్పడి ఆయకట్టులో భారీగా తేడాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రాల పునర్విభజన (1956) తరువాత లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్ 1.75లక్షల ఎకరాలకు పెరిగి, 1969 నాటికి 2.75లక్షల ఎకరాలకు చేరుకుంది. ప్రస్తుతం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
ఈ కాలంలో లక్ష ఎకరాలు ఉన్న ఆర్డీఎస్ ఆయకట్టు తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర నీటిపై 50శాతం హక్కులున్నప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ ఎదుట పాలకులు గట్టిగా వాదించకపోవడంతో తెలంగాణకు సాగునీటి పరంగా భారీ నష్టం జరిగింది. పర్యవసానంగానే బచావత్ ట్రిబ్యునల్ కేసీ కెనాల్‌కు 39.90 టీఎంసీల నీటిని కేటాయించగా, ఆర్డీఎస్‌కు 17.9 టీఎంసీల నీటిని కేటాయించింది. దీంతో తెలంగాణ ప్రాంతానికి హక్కుగా ఉన్న సాగునీటిని నేతల నిర్వాకంతో కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఆది నుంచే ఆర్డీఎస్ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యాడు.
ట్రిబ్యునల్ తీర్పు మేరకూ అందడం లేదు
ట్రిబ్యునల్ తీర్పు మేరకు లక్ష ఎకరాల నుంచి 87,500 ఎకరాలకు ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించారు. ఈ మేరకైనా సాగునీరు సక్రమంగా ఆర్డీఎస్ రైతాంగానికి అందడం లేదు. గత 50 ఏళ్ల కాలంలో ఆర్డీఎస్ రైతాంగానికి అందిన సాగునీటి గణాంకాలను పరిశీలిస్తే 40వేల ఎకరాలకు మించి ఏ ఏడాది కూడా సాగునీరు లభించలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో కేసీ కెనాల్ త్వరితగతిన అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంవూతులుగా ఉండటంతో కేసీ కెనాల్ అభివృద్ధికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్‌డ్డి కేసీ కెనాల్ అభివృద్ధికి ₹.1400కోట్లు ఖర్చు చేశారు. సుంకేసుల వద్ద ఆర్డీఎస్ తరహాలోనే నీటి మళ్లింపు పథకం ఉండేది. కోట్ల హయంలో దాని స్థానంలో దాదాపు మూడు టీఎంసీల సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీని నిర్మించి సుమారు 80 టీఎంసీల సాగునీటిని వాడుకుంటున్నారని ఆర్డీఎస్ రైతాంగం ఆరోపిస్తున్నది.
పోతిడ్డిపాడు వల్ల కూడా కేసీ కెనాల్ ఆయకట్టు అభివృద్ధి చెందింది. ప్రస్తుతం దీని ద్వారా కడప, కర్నూలులో సుమారు 4లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు అంచనా. అదే తీరులో ఆర్డీఎస్ అభివృద్ధి చెందాల్సి ఉన్నా తెలంగాణ ప్రాంత నేతల రాజకీయ దౌర్బల్యం కారణంగా ఆయకట్టు రోజురోజుకు కుదించుకుపోతుందన్న ఆరోపణలు వెల్లు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి సాగునీరును ఇండెంట్ పెట్టుకునే హక్కు కూడా ఆర్డీఎస్‌కు లేకపోవడంతో రాయలసీమ నేతల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నదని తెలంగాణ ప్రాంత రైతులు అంటున్నారు. దీనికి కర్ణాటక వంత పాడడం ఆర్డీఎస్‌కు శాపంగా మారుతోంది. ఆధునీకరణ పనులు పూర్తి చేసినా చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.
కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు
కర్ణాటక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన లిఫ్ట్‌లు, విద్యుత్ ప్రాజెక్టులతోపాటు తాగునీటి వంకతో తుంగభద్ర నది నుంచి పైపులైన్‌ల ద్వారా అక్రమ నీటి వాడకం రోజురోజుకు అధికమవుతుండడం ఆర్డీఎస్ రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి విడుదలైన సాగునీరు, రివర్ అసిస్టెంట్స్ నుంచి అందాల్సిన నీరు కూడా కర్ణాటక ప్రాంతంలోని లిఫ్ట్‌లు, అక్రమ పైపులైన్‌ల ద్వారా చౌర్యానికి గురవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో నది నుంచి కిలోమీటర్ల కొద్ది పైపులైన్‌లను తీసుకెళ్లి సాగునీటిని వాడుకుంటున్నాని అంటున్నారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఆర్డీఎస్ రైతాంగం గత నెలలో ఆర్డీఎస్ కాలువల వెంబడి పాదయాత్ర చేపట్టి కర్ణాటక, రాయలసీమల నుంచి ఆర్డీఎస్‌కు పొంచివున్న ముప్పు గురించి సవివరంగా ఓ నివేదికను తయారు చేసినా, పట్టించుకునే నేతలు కరువయ్యారు. ఆర్డీఎస్ రైతాంగం బాగుపడాలన్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలన్నా ఎక్స్‌పర్ట్ కమిటీ చేసిన సూచనలతోపాటు ఆర్డీఎస్‌ను బ్యారేజీగా నిర్మించాల్సిందేనని ఆర్డీఎస్ రైతాంగం అభివూపాయపడుతోంది.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha
0 comments:
Post a Comment