త్వరలో నిర్ణయం అందుకు మా ప్రయత్నం
- పండుగలొస్తున్నాయి..సమ్మె విరమించండి
- ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
- ఉద్యోగులకు ఆజాద్ వినతి
- పరిష్కారానికి కాలపరిమితి చెప్పలేమని వ్యాఖ్య
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 :తెలంగాణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున ఉద్యోగులు సమ్మె విరమించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కార మార్గంలో చాలా దూరం ప్రయాణించినందున త్వరలో నిర్ణయం వెలువడుతుందన్న హామీ ఇచ్చారు. రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అంశాన్ని సత్వరం పరిష్కరిస్తామనే విశ్వాసాన్ని ప్రకటించారు. అయితే దీనికి ఎలాంటి కాలపరిమితీ చెప్పలేనని అన్నారు. దీపావళి, బక్రీద్ పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉద్యోగులు సమ్మెకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తన నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డితో గంటన్నరపాటు సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 40 రోజులుగా కొనసాగుతున్న ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నా రు.
చాలా రోజుల తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నా, చాలా మంది ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నందునేఇరు ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో చర్చలు ముగించి, జాతీయ స్థాయిలో సైతం సంప్రతింపుల ప్రక్రియను పూర్తిచేశామని తెలిపారు. సత్వర పరిష్కారమే తమ అభిలాషని అన్నారు. ప్రముఖ పండుగలైన దీపావళి, బక్రీద్ రాబోతున్నందున ప్రజలు ఎన్నో వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి రాకపోకలు సాగించాల్సి ఉంటుందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ద్వారా సమస్య పరిష్కారం కానందున ఉద్యోగులు సమ్మె విరమించాలని పార్టీ, ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. పండుగల సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందించనున్న సేవలను వారికి అందేలా సహకరించాలని కోరారు.
జాతీయ నేతలతో, పార్టీ కేంద్ర నాయకత్వంతో విస్తృత స్థాయి సంప్రతింపులను పూర్తి చేసి, తెలంగాణ అంశంపై సత్వర నిర్ణయానికి ప్రయత్నిస్తున్నామన్న ఆయన అది ఎప్పటి లోగా అన్నది మాత్రం చెప్పలేనన్నారు. సమస్య పరిష్కరానికి ఎటువంటి కాల పరిమితీ ఇవ్వలేమని తెలిపారు. నిర్ణయం పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందుంటుందా లేక తర్వాత ఉంటుందా అన్నది చెప్పలేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నిర్ణయం నేడా లేక రేపా అన్న ఆశతో ప్రజలు చాలా కాలంగా తమ ఉద్యమాన్ని పొడిగిస్తున్నారని తెలిపారు. రానున్న మూడు నాలుగు నెలలు అభివృద్ధికి చాలా కీలకం కానున్నాయని అన్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అభివృద్ధి కార్యక్షికమాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తాన్ని వెచ్చించనుందని తెలిపారు.
దీర్ఘకాలికంగా సాగుతున్న ఆందోళన వల్ల రాష్ట్రంలో ఏదేని ప్రాంతంగానీ, లేక రాష్ట్రం మెత్తంగానీ ఇబ్బంది పడకూడదన్నదే తమ అభిమతమని అన్నారు. తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలు జరిపి సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై అంతిమ నిర్ణయం తీసుకునే ముందు మరి కొంతమందిని సంప్రతించాల్సి ఉందన్న ఆజాద్.. అఖిలపక్షం ఏర్పాటుపై తానేమీ వ్యాఖ్యానించబోనని చెప్పారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ కోర్‌కమిటీ సభ్యులు చిదంబరం, ఆంటోనీలతో కూడా సీఎం సమావేశమయ్యారు.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha
0 comments:
Post a Comment