సింగరేణి సమ్మెపై కేంద్రం ఆరా...
- కార్మికుల మనోభావాలపై నివేదిక అడిగిన ఆజాద్
- తెలంగాణ కోసం మళ్లీ సమ్మెకు సిద్ధం
- సంకేతాలిచ్చిన కార్మికులు
(కోల్‌బెల్ట్ ) ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో 60 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్న సింగరేణి కార్మికులు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టి పడే విధంగా 35 రోజులు సమ్మె చేశారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర ఒక అపూర్వఘట్టం. మలివిడత ఉద్యమంలో ఇంతకు ముందే తొమ్మిది సార్లు కార్మికులు సమ్మె చేశారు. భారతదేశంలో ఒక రాజకీయ డిమాండ్‌పై ప్రభుత్వ రంగ సంస్థలో ఇలా సుదీర్ఘ సమ్మె జరగడం ఇదే ప్రప్రథమం. వీరి సమ్మెతో దక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం నెలకొంది. విద్యుత్ కష్టాలు భారీగా వచ్చాయి. ఇప్పటి వరకు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ పర్యటన జరిపినపుడు వారు సింగరేణి ప్రాంతానికి రాలేదు. కనీసం సింగరేణి ప్రస్తావన కూడా తమ నివేదికలో పొందుపరచలేదు.
ఈ ప్రాంతం నుంచి సుమారు 300 నివేదికలు ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ వెళ్లినా కమిటీ పట్టించుకోలేదు. కార్మికులు సమ్మెకు ఉపక్షికమించినపుడు ఎనిమిదో చాప్టర్ అమలు చేసేందుకు ప్రయత్నించారు. 177వ జీవోను సైతం కార్మికులు పట్టించుకోలేదు. తెలంగాణ ఆకాంక్ష ఇంత బలంగా ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్రానికి అసలు సమాచారమే లేదని తెలిసింది. సకలజనుల సమ్మె సెగ కేంద్రానికి తగలడంతో సింగరేణి ప్రాంతంలో ఈ అంశంపై సమాచారాన్ని సేకరించాల్సిందిగా నిఘా విభాగాన్ని కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో నిఘా వర్గాలు నివేదికను తయారు చేసినట్లు తెలిసింది. కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించినా, మరోసారి సమ్మె చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్ర నిఘా విభాగం ఆరాతీయడాన్ని బట్టి సింగరేణి కార్మికుల పోరాటం వృథాగా పోలేదని స్పష్టమవుతోందని తెలంగాణవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర నిఘా విభాగానికి చెందిన వారిగా పేర్కొంటున్న వారు సింగరేణి సమ్మెలో పాల్గొన్న పలువురు కార్మికులను సమ్మెపై, తెలంగాణ అంశంపై అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే కార్మికులు తాము తెలంగాణ కోసమే సమ్మె చేసినట్లు, రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మోసం వల్ల తాము విరామం తీసుకున్నామని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోసారి సమ్మెకు దిగేందుకు కూడా సిద్ధమని తెలిపినట్లు సమాచారం.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha
0 comments:
Post a Comment