డీజీపీ.. బెదిరింపులు సరికాదు
-హింసకు దిగితే తిరుగుబాటు తప్పదు
- జేఏసీ కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య
హైదరాబాద్, అక్టోబర్ 13 (టీ న్యూస్) : ప్రజలను హింసిస్తే తిరుగుబాటు తప్పదని, సర్కార్ పతనమవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ కో-చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య హెచ్చరించారు. రైల్‌రోకోలో పాల్గొంటే జీవిత ఖైదు విధిస్తామని డీజీపీ దినేష్‌డ్డి బెదిరించడం దారుణమన్నారు. రైల్వే చట్టంలో లేని కొత్తవాదాన్ని డీజీపీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జేఏసీ కార్యాలయంలో జరిగిన ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సమ్మెను హింసాత్మకంగా మార్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15,16,17 తేదీల్లో రైల్‌రోకో కార్యక్షికమం యథావిధిగా సాగుతుందన్నారు. విద్యా సంస్థలను సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇచ్చిన గడువుపై విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. ఆయనకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.ఈ సందర్భంగా రైల్‌రోకో వాల్ పోస్టర్‌ను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు.
దమ్ముంటే ఖాకీ దస్తులు వదిలేసి రా: కేటీఆర్
డీజీపీ దినేష్‌డ్డి బెదిరింపులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘డీజీపీ.. దమ్ముంటే ఖాకీ దుస్తులు వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. మాతో పోరాడాలి’ అని సవాల్ విసిరారు. గురువారం పాతబస్తీలోని పురాణాహవేలీలోని సిటీ సివిల్ కోర్ట్ జ్యుడీషియల్ ఉద్యోగులు, న్యాయవాదుల జేఏసీ నిర్వహించిన వంటావార్పు కార్యక్షికమంలో ఆయన పాల్గొన్నారు. డీజీపీ సీమాంవూధులకు చెంచాగిరీ చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన రాజకీయ నేతలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఆయనకు అంత దురదగా ఉంటే వచ్చి ఖద్దరు దుస్తులు వేసుకుని రాజకీయాల్లోకి రావాలి. అప్పుడు చూసుకుందాం. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మంచి మంచి తుర్రుంఖాన్‌లను చూశాం. నీ ఆటలు మా వద్ద సాగవు’ అని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్షికమంలో జ్యుడీషియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సుబ్బయ్య, పాతబస్తీ టీఆర్‌ఎస్ నేత ఇనాయత్ అలీభాఖ్రీ, న్యాయవాదులు మాణిక్‌వూపభు గౌడ్, తిరుమల రావు, జయవూపకాశ్, శ్రీరంగారావు, శ్రీధర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు,
రైల్‌రోకో చేసి తీరుతాం: విజయశాంతి
‘రైల్‌రోకో చేసి తీరుతాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. తొలుత నేనే రైలు ఆపుతా. రైలు ఆపితే జీవితఖైదు అని డీజీపీ చెప్పడం తప్పు అని టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ విజయశాంతి గురువారం ప్రశ్నించారు. డీజీపీ వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నాయకులు స్పందించాలన్నారు. ఎందరు డీజీపీలు వచ్చినా 15 నుంచి రైల్‌రోకో ఆగదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. సీఎం తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజల కోపాగ్నికి గురికాక తప్పదని హెచ్చరించారు. రైల్‌రోకో చేస్తే జీవిత ఖైదు విధిస్తామని డీజీపీ మాట్లాడ్డం చట్టాన్ని ఉల్లంఘించడమేనని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ కో-చైర్మన్ సి.అశోక్‌కుమార్ యాదవ్ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి డీజీపీ పోస్టులోకి వచ్చిన వ్యక్తి చట్టాల గురించి వల్లించడం విచివూతంగా ఉందన్నారు. ఉద్యమకారులను డీజీపీ సోయిలేకుండా బెదిరిస్తున్నారని న్యూడెమొక్షికసీ నేత కె.గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ అణచివేతకు సీఎం తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని డీజీపీ దినేష్‌డ్డి చేసిన వ్యాఖ్యలపై మానవ హక్కుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు ప్రజలను ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయని వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్, కార్యదర్శి కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand

0 comments:
Post a Comment