రైల్ రోకో సవాల్
- ప్రభుత్వం అన్ని పవర్స్ ఇచ్చింది
- రైల్వే యాక్ట్ ప్రకారం కేసులు
- పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్షలు
- ప్రేరేపించినవారికీ శిక్షలు తప్పవు
- డీజీపీ బెదిరింపులు
- ఏం చేస్తారో చేసుకోండి..
- సర్కారుకు ఉద్యమం సవాల్
- మేము సైతం రైల్‌రోకోలో
- టీ కాంగ్రెస్ ఎంపీల ప్రకటన
- ప్రజలను హింసిస్తే సర్కార్ పతనం:మల్లెపల్లి లక్ష్మయ్య
- రైల్‌రోకోలో మేము సైతం:తెలంగాణ వృద్ధుల సంఘం
- ముందు జాగ్రత్తలో రైల్వేశాఖ
- భారీగా రైళ్లరద్దు.. దారి మళ్లింపు
-నిర్బంధకాండ ఏర్పాట్లలో సర్కారు.. తెగిస్తున్న తెలంగాణ
దిగ్విజయంగా 31 రోజులు పూర్తి చేసుకున్న సకల జనుల సమ్మెలో మరో మహత్తర ఘట్టానికి తెరలేవబోతున్నది. యావత్ తెలంగాణం రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి సవాలు విసరబోతున్నది. తెలంగాణ లక్ష్యంగా 15,16,17 తేదీల్లో నిరవధిక రైల్‌రోకోలకు రంగం సిద్ధమైంది. వాడవాడలు.. పల్లెపప్లూలూ పట్టాలపైకి రాబోతున్నాయి. అదే సమయంలో దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వమూ సమాయత్తమవుతున్నది. ఓవైపు రైల్వే శాఖ తనంతట తానుగానే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేసుకున్నా.. పంతానికి పోతున్న ప్రభుత్వం మాత్రం.. బెదిరింపులకు దిగుతున్నది. తాజాగా డీజీపీ ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. స్వయంగా రంగంలోకి దిగి విలేకరుల సమావేశం పెట్టి మరీ ఉద్యమాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు.
శాంతి భద్రతలు కాపాడేందుకు తనకు ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చేసిందన్న డీజీపీ దినేష్‌డ్డి.. కేంద్ర ప్రభుత్వం కూడా తమకు సహకరిస్తోందని చెప్పారు. రైళ్లను అడ్డుకున్నా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించినా, పట్టాల ఫిష్ ప్లేట్లు తొలగించినా రైల్వే చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులలో పడే శిక్షలేమిటో చెబుతూ బెదిరించారు. ఉద్యోగులను, విద్యార్థులనూ భయపెట్టారు. అయితే.. తెలంగాణ ఉద్యమ శ్రేణులు మాత్రం డీజీపీ బెదిరింపులను పూచికపుల్లతో సమానంగా తీసిపారేశాయి. రైల్‌రోకోలకు కోట్లాది మంది జనం వస్తున్నారని, వారందరినీ బంధించే దమ్ము కిరణ్ సర్కారుకు ఉందా? అని ఇటీవలే కేసీఆర్ సవాలు విసిరారు. ఇదే స్ఫూర్తిని ఇతర తెలంగాణ శ్రేణులు కూడా ప్రదర్శిస్తున్నాయి. తాము రైళ్లు ఆపుతున్నది కేవలం తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పడం కోసమేనని ప్రకటించిన తెలంగాణవాదులు.. లాఠీలకు, తూటాలకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు.
రైల్‌రోకో ఉద్యమానికి టీ కాంగ్రెస్ ఎంపీలు మరింత సమరోత్సాహాన్ని జత చేశారు. తాము సైతం రైల్‌రోకోల్లో తమ తమ నియోజకవర్గాల్లోని రైల్వే స్టేషన్‌లలో పాల్గొంటామని ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం జేఏసీ పిలుపు మేరకు ఈ ఆందోళనలో పాల్గొంటాయని తెలిపారు. కాగా.. దినేష్‌డ్డి బెదిరింపులపై తెలంగాణ రాజకీయ జేఏసీ కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను హింసిస్తే తిరుగుబాటు తప్పదని, ఇది సర్కారు పతనానికే దారి తీస్తుందని హెచ్చరించారు. డీజీపీపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు నిప్పులు చెరిగారు. ఆయ నకు దమ్ముంటే ఖాకీ బట్టలు వదిలేసి, కాంగ్రెస్ లో చేరి అప్పుడు తమతో పోరాడాలని సవాలు విసిరారు. ఆయన ఉద్యమనేతలే లక్ష్యంగా హెచ్చరికలు చేస్తూ సీమాంధ్ర నాయకత్వానికి చెంచా గిరీ చేస్తున్నారని మండిపడ్డారు.
రైల్‌రోకో చేసే తెలంగాణ ప్రజానీకాన్ని అరెస్టు చేసుకుంటూ పోతే ఉన్న జైళ్లు చాలవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎందరు డీజీపీలు వచ్చినా రైల్‌రోకోలను ఎవ్వరూ ఆపజాలరని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. రైల్‌రోకోలో మొదటి రైలు ఆపేది తానేనని, ఏం చేస్తారో చేసుకోండని మెదక్ ఎంపీ విజయశాంతి సవాలు విసిరారు. డీజీపీ చట్టాన్ని అతిక్షికమిస్తున్నారని బీజేపీ మండిపడగా.. డీజీపీ బెదిరింపులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరంకాదని న్యూడెమోక్షికసీ నేత గోవర్ధన్ హితవు పలికారు. సీనియర్ సిటిజన్‌లు సైతం రైల్‌రోకోలకు మద్దతు పలికారు. ఓ వైపు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ నిర్బంధకాండకు రంగం సిద్ధం చేస్తున్నా... రైల్వే శాఖ మాత్రం ప్రయాణికులకు మార్గమధ్యంలో ఇబ్బందులు ఎదురుకాకుండా భారీగా రైళ్లను రద్దు చేసింది. అనేక రైళ్లను దారిమళ్లించింది.
Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment