టీ కాంగ్రెస్‌లో ఊసరవెల్లులు!
- దూసుకుపోతున్న ఎంపీలు
- దూరమవుతున్న ఎమ్మెల్యేలు
- అవమానాపూదురైనా పదవుల్లోనే టీ మంత్రులు
- టీ నేతలపై సీఎం వలతో ఉద్యమంలో వెనకడుగు?
- కల్లోలం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు
- దూరమవుతున్న ఎమ్మెల్యేలు
- అవమానాపూదురైనా పదవుల్లోనే టీ మంత్రులు
- టీ నేతలపై సీఎం వలతో ఉద్యమంలో వెనకడుగు?
- కల్లోలం రేపిన కేటీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబర్ 13 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీ కాంగ్రెస్ నేతల ఉద్యమబాట అటకెక్కినట్లు కనిపిస్తోంది. ఒకరిద్దరు మినహా టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం కోసం జోరుగా ఉద్యమిస్తూ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీవ్రతరం చేస్తుండగా, మరో వైపు టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేలు, టీ మంత్రుల తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలలో కూడా నలుగురైదుగురు మినహాయించి మిగతావారందరూ ఉద్యమంలో ఉన్నట్లు నటిస్తూనే అటు సీఎంకు జై కొడుతూ ఇటు ఉద్యమానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రలోభాలకు గురవుతూ ఊసర మాదిరిగా రంగులు మార్చుతున్నారని తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. అవమానాలు ఎదుర్కొంటూనైనా టీ మంత్రులు పదవుల్లో కొనసాగేందుకు ఇష్టపడుతున్నారే తప్ప పదవులను వదులుకుని ఉద్యమబాటలో పయనించేందుకు ససేమిరా అంటున్నారని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి టీ కాంగ్రెస్ నేతలను దారికి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విఫలయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
దీనికి భిన్నంగా అటు అధిష్ఠానం, ఇటు సీఎం వైపు నుంచి ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు వచ్చినా టీ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఉద్యమంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెబుతూ దూసుకు పోతున్నారు. టీ కాంగ్రెస్ ఎంపీల్లో సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్ మినహాయించి మిగతా ఎంపీలు అందరూ మొదటి నుంచి తెలంగాణ పోరులో ఒకే మాట, ఒకే బాటకు కట్టుబడి ఉన్నారు. అంతే కాకుండా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామాలు ఆమోదింపజేసుకునేందుకు తాజాగా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి ఒత్తిడి తెచ్చారు. సకలజనుల సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ఉద్యోగులకు, సమ్మె నేపథ్యంలో తెలంగాణవాదులు చేపడుతున్న కార్యక్షికమాలకు పూర్తి మద్దతునిస్తున్నారు. అంతే కాకుండా ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రైల్ రోకోలో స్వయంగా పాల్గొంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణపై హైకమాండ్ ప్రకటన చేసే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు.
ఎంపీల పోరాట స్ఫూర్తికి భిన్నంగా ఉంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి. ఎంపీలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో దిగి జోరుగా దూసుకుపోతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం గడికో మాట, పూటకో రంగు మార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యమంలో పాల్గొనడం మాట అలా ఉంచితే కనీసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తమ పదవులను వదులుకోవడానికి కూడా వారు ససేమిరా అంటున్నారు. సమిష్టి నిర్ణయాలతో ఐక్యంగా ఉద్యమిద్దామంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజావూపతినిధులు టీ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ సభ్యులుగా ఉన్నారు. కానీ.. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదు.
దీనిపై తెలంగాణవాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విధులకు హాజరు కావద్దని టీకాంక్షిగెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయిస్తే.. దాన్ని మంత్రులు బేఖాతరు చేశారు. సీఎం మాటకు తలొగ్గి కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణపై ప్రకటన రాక పోతే మంత్రి పదవులు, పార్టీకి గుడ్‌బై చెప్పాలని స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆవేశంగా ఢిల్లీ వెళ్లిన నేతలు.. అక్కడ పార్టీ అధిష్ఠానం ముందు పిల్లులైపోయారు. తమ పార్టీ పెద్దలను కలిసినప్పుడు కనీసమైన హెచ్చరిక చేయడానికి కూడా సాహసించలేదు. పైగా సకల జనుల సమ్మె విరమించేందుకు ప్రయత్నించడని అభ్యర్థించి వచ్చారు. అంతే తప్ప తెలంగాణపై ప్రకటన రాక పోతే పదవులకు రాజీనామా చేస్తామని ఎక్కడా హెచ్చరించలేకపోయారు. టీ మంత్రుల్లో జూపల్లి కృష్ణారావు, కోమటిడ్డి వెంకట్‌డ్డి చెప్పిన మాటకు కట్టుబడి తెలంగాణ కోసం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించి, ప్రజలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు.
మిగతా మంత్రులు మాత్రం పదవులను అంటిపెట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆగ్రహావేశాలు తెలంగాణవాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి. టీ మంత్రుల్లో దామోదర రాజనర్సింహ, దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ మినహా మిగతా మంత్రులు తెలంగాణ పేరుతో సమావేశమవుతున్నప్పటికీ ప్రభుత్వం దిగివచ్చేలా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో, పదవులను వదులుకుని ప్రజల పక్షానా నిలబడటానికి ఏ మాత్రం ఇష్టపడకుండా పరోక్షంగా కిరణ్ సర్కార్‌కు సహాయపడుతున్నారని ఉద్యమక్షిశేణులు మండిపడుతున్నాయి. మరోవైపు టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేల తీరు రంగులు మార్చే ఊసర తరహాలో ఉందంటూ టీ వాదులు నిప్పులు చెరుగుతున్నారు. కనీసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడానికి సైతం ముందుకు రావడం లేదు. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), సోమారపు సత్యనారాయణ (రామగుండం) తెలంగాణ కోసం రెండవ సారి తమ రాజీనామాలు సమర్పించగా, మిగతా ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాల మాటే ఎత్తొద్దంటున్నారు. సీఎం కిరణ్ ప్రయోగిస్తున్న ప్రలోభాల అస్త్రానికి వీరు తలొగ్గినట్లు వారి తీరు చూస్తుంటే తెలుస్తోందని పార్టీ వర్గాల్లో విమర్శలు వెల్లు
నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఆర్థిక, ఇతర ప్రయోజనాలను ఎరగా విసురుతున్న సీఎం.. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్యమ బాట నుంచి తప్పించి, తనవైపు తిప్పుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఉద్యమంలో చురుకుగా కనిపించిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు తెరచాటుకు వెళ్ళిపోయారు. సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడటం, రాజీనామాలపై వెనక్కి వెళ్ళడం, సీఎంపై పొగడ్తల జల్లు కురిపించేందుకు జిల్లాల నుంచి జనాన్ని తరలిస్తుండడం, టీ ఉద్యమంలో మెత్తపడటం, టీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయాలను ధిక్కరించే విధంగా వ్యవహరిస్తుండడం వంటి చర్యలు చూస్తుంటే టీఎమ్మెల్యేలపై సీఎం ప్రలోభాలు తీవ్రంగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలంగాణవాదులు అంటున్నారు. 13 మంది టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం భారీ స్థాయిలో ముడుపులు అందించి, ప్రలోభాలకు గురి చేశారంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా చేసిన ఆరోపణలు టీ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి.
సీబీఐ ద్వారా దర్యాప్తు చేయిస్తే ఆధారాలతో నిరూపించేందుకు తాను సిద్ధమంటూ కేటీఆర్ విసిరిన సవాలుతో టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భుజాలు తడుముకుంటున్నారన్న వాదన వినిపిస్తున్నది. గాలి, జగన్ వ్యవహరాలపై దర్యాప్తులో సీబీఐ పాత్రతో ఇప్పటికే రాజకీయ నేతలకు గుబులు పుట్టుకుంది. గత రెండు రోజులుగా కొందరు టీకాంక్షిగెస్ ఎమ్మెల్యేలు సకల జనుల సమ్మె విరమించుకోవాలని, విద్యా సంస్థలను మినహాయించాలని సన్నాయి నొక్కులు నొక్కుతూ సీఎంకు అనుకూలంగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రలోభాల మంత్రం వారిపై బాగానే పనిచేసినట్లు కనిపిస్తోందని తెలంగాణవాదులు ధ్వజమెత్తుతున్నారు.
Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment