తెలంగాణ ఇవ్వండి
నవంబర్ 1లోగా ప్రకటన చేయండి
- రాహుల్‌కు డీఎస్‌పీ నళిని లేఖ...
హైదరాబాద్, అక్టోబర్ 21 : ‘‘తెలంగాణపై సత్వరం నిర్ణయం తీసుకోండి...మీ అమ్మగారిని ఈ అంశంపై మౌనం వీడమని చెప్పండి...యువ నాయకుడైన మీరు చొరవ చూపి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా చూడండి... అలా చేస్తే ఇక్కడి ప్రజల మనస్సుల్లో మీరు శాశ్వతంగా ఉండిపోతారు’’.. సీఐడీ విభాగంలో డీఎస్‌పీగా పనిచేస్తున్న నళిని కాంగ్రెస్ యువ నేత రాహుల్‌గాంధీకి రాసిన లేఖలోని మాటలివి. తెలంగాణ కోసం ఇప్పటికే ఒకసారి రాజీనామా చేసి తిరిగి ఉద్యోగంలో చేరిన డీఎస్‌పీ నళిని ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగున్నర కోట్లమంది చేస్తున్న మలిదశ ఉద్యమం గురించి, తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలు పడుతున్న ఆరాటం గురించి రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో సవివరంగా తెలిపారు. 2009, డిసెంబర్ 9న ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఆ రోజున కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని లేఖలో పేర్కొన్నారు. తమకున్న మనీ, మీడియా, మాఫియా, మజిల్ పవర్‌తో సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన గోరంత ఆందోళనలపై ముఖ్యమంవూతితో కొండంతలుగా చిత్రీకరింపజేసి కేంద్రానికి నివేదికలు పంపించారన్నారు. దాంతో సోనియోగాంధీ పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకుని తెలంగాణపై విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరమని కేంద్ర హోంమంత్రి యూ టర్న్ తీసుకున్నారని పేర్కొన్నారు.
మొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసి తిరిగి ఉద్యోగంలో చేరిన తరువాత తనను సీమాంధ్ర అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. సకల జనుల సమ్మెపై ప్రభుత్వం నిర్లిప్త ధోరణిని ప్రదర్శిస్తూ కాలయాపన చేస్తోందని, పైగా హింసను ప్రేరేపిస్తూ రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయటానికి దాని చర్యలు ఉంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 10న ముఖ్యమంవూతికి లేఖ రాసి తెలంగాణ ఇచ్చేంతవరకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే ఈ లేఖనే రాజీనామాగా భావించుకోవాలని లేఖలో తెలిపినట్టు వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే తెలంగాణ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నళిని, రాహుల్‌గాంధీని కోరారు. బస్సులు, రైళ్లలో తిరిగి ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. కరెంట్ లేక, బస్సులు నడవక, రైళ్లు తిరగక, పొలాలు ఎండిపోయి, స్కూళ్లు మూతబడి, జీతాలు లేక ఉద్యోగులు పడుతున్న కష్టాల గురించి తెలుస్తుందన్నారు. తెలంగాణ కోసం ఇప్పటివరకు ఏడువందలమందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకున్నా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం న్యాయమైన కోరిక అన్నారు. 1956కు ముందు ఉన్న తెలంగాణను ‘ఇంచు’ కూడా అటూ ఇటూ కాకుండా అడుగుతున్నామని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణను ప్రకటించాలని కోరారు. అలా కాకుండా ఇతర పార్టీలపై నిందలు వేస్తూ, ఏకాభివూపాయం సాకుతో నిర్ణయాన్ని వాయిదా వేయవద్దన్నారు. నవంబర్ 1వ తేదీలోపు నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. లేఖ ప్రతులను సోనియాగాంధీతోపాటు బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్‌లకు కూడా పంపించారు.
స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కమిషనర్‌కు లోకాయుక్త అరెస్టు వారెంట్ జారీ
హైదరాబాద్: భూముల అన్యాక్రాంతంపై వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఇచ్చిన ఆదేశాలను విస్మరించిన రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కమిషనర్‌కు లోకాయుక్త అరెస్టు వారెంట్ జారీ చేసింది. గోల్కొండ, ఆసిఫ్‌నగర్ మండలాల్లో ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలకు తప్పుడు ఇంటి నెంబర్‌లతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు చేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను లోకాయుక్త గతంలో సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కమిషనర్‌కు ఆగస్టు 30న ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 20వ తేదీన హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. అసంపూర్తి నివేదిక అందించిన సదరు అధికారి తీరుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసి అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 19 వ తేదీకి వాయిదా వేసింది.
ఉస్మానియా ఆసుపత్రి భవనాల జాప్యంపై లోకాయుక్త ఆగ్రహం
హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి భవన మరమ్మతుల విషయంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ైవైద్యారోగ్య శాఖ ప్రధా కార్యదర్శికి లోకాయుక్త సమన్లు జారీ చేసింది. ఆసుపత్రి భవనాల విషయంలో పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టిన లోకాయుక్త.. వివరణ ఇవ్వాలంటూ కార్యదర్శికి గతంలో ఆదేశాలు జారీ చేసింది.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, DSP Nalini
0 comments:
Post a Comment