ఆమరణ దీక్ష మేము అడిగినామా..?
సాదిస్తున్నర... లేక సాగదీస్తున్నర...
మా పొయ్యింట్ల ఇంగ్లం ఎయ్యనియ్యకుండ
రెండ్రోజుల కొక్కన్ని కాటి గడ్డకు పంపుతున్నరు
ఒకని మూడొద్దులు చెయ్యకముందే
ఇంకోడు పాణందీసుకుంటుండు
ఒకని దినాలకు ఇంకోని శవ యాత్ర అడ్డమొచ్చే
కానీ...
ఒక లంగ గాని జిత్తుల మారి ఎత్తు మరిచిపోక ముందే
ఇంకొకడు దుశ్శాసనుల పొత్తు పెట్టుకుంటుండు
ఏం పరాశ్కమాడుతున్నర..?
ఒక దిక్కు సావొద్దు... బతికి సాదించుకుందాం అనుకుంట
ఇంకో దిక్కు నన్నెవడన్న ఆపితే ఆత్మ బలిదానం చేసుకుంట అననీకె
ఏం పీకావని... ఇంకేం పీకుతావని...
మస్తుగా జూసినం నీ లాంటి దొమ్మరోల్లను...
ఆమరణ దీక్ష అనే పదానికి అర్థం
ఒట్టు పెట్టుకున్న ఏ ఒక్కడు చెప్పలే ఇప్పటి దాక...
కట్టగట్టుకోని మీరందరు కూసొండి...
మిమ్ల ఆపనీకే ఎవడొస్తడో మేము కాపలగాస్తం...
మీరు సచ్చే దాక దగ్గరుండి సూసుకుంటం... నీళ్ళు, పండ్లు ఎవడు అందియ్యకుండా...
సచ్చిన మీ శవాల మీద
పాత శాట డప్పులు గొట్టుకుంట కాముని పున్నమి జేసుకుంటం
ఉందా దమ్ము... కూసుంటారా ఆమరణ దీక్షకు...?
తెలంగాణ ఒచ్చేదాక... లేక మీరు సచ్చే దాక...
-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి
Take By: Yuvatelangana - Email
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, schools closed, TRS,
0 comments:
Post a Comment