తెలంగాణ కోసం 1న ఆమరణదీక్ష సీఎం, ------ సీమాంధ్రులు అడ్డుకుంటే ఆత్మార్పణే: కోమటిరెడ్డి
నల్లగొండ, : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 1 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గురువారం నల్లగొండలో జిల్లా నీటిపారుదల శాఖ, జిల్లా అధికారుల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధూం..ధాం కార్యక్రమంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
తన దీక్షను అడ్డుకునేందుకు సీఎం కిరణ్, సీమాంధ్రులు ప్రయత్నిస్తే ఆత్మార్పణ చేసుకుంటానని, తన ప్రాణాలకు ముఖ్యమంత్రే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. గతంలో ఫ్లోరైడ్ నివారణ కోసం నల్లగొండ పట్టణంలో చేపట్టిన దీక్ష వేదికగానే ఆమరణ దీక్ష చేపడుతున్నామని తెలిపారు.
ఎంతో మంది మంత్రి పదవులు వదిలినా పట్టించుకోని కిరణ్.. తాను మంత్రి పదవిని వదిలిపెట్టిన తక్షణమే గన్‌మెన్‌లను తొలగించారని, జిల్లాకు చెందిన నలుగురు నేతలను పిలిపించుకొని మంత్రి పదవి ఆశపెట్టాడని, ఒక్క పదవిని ఎంతమందికి ఇస్తాడో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. వారు నన్ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాలో చూశానని, తెలంగాణ కోసం ఆత్మార్పణకు సిద్ధపడిన తనను ఎవ డో తొక్కేదేందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
మంత్రి జానారెడ్డి ఒక్కరే రాజీనామా చేయడం కాదని, తెలంగాణ మంత్రులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ 14మంది మంత్రులే మళ్లీ పదవులు తీసుకోండని సూచించారు. మంత్రుల ఇళ్ల ముందు చావుడప్పు కొట్టినా ఇసమంతైనా సిగ్గూశరం లేకపోవడం దురదృష్టకరమన్నారు.
సీమాంద్ర నేతలైన లంగ.. లగడపాటి, దొంగ.. రాయపాటి వంటి పెట్టుబడిదారులే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారని, ఎంతమంది దుర్మార్గపు చర్యలతో అడ్డుపడినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరక తప్పదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సభలో కోమటిరెడ్డితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు.
Take By: http://sakshi.com/main/FullStory.aspx?catid=252776&Categoryid=1&subcatid=33
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, TRS, Komatireddy Venkat Reddy
0 comments:
Post a Comment