Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, October 22, 2011

బిజీనెస్ ఎంజేఎం

రోడ్డుకిరువైపులా రంగు రంగుల పూలతో
అలంకరించినట్లున్న చిన్న చిన్న దుకాణాలు
కొన్నిచోట్ల గుడారాల కింద పండ్ల్ల వ్యాపారస్తులు
ఇరువైపులా చరివూతకు సాక్ష్యంగా నిలుచున్న కట్టడాలు
శిథిలావస్థకు చేరినవి.. పాక్షికంగా దెబ్బతిన్నవి..
రోడ్డు వెడల్పు కోసం నేలమట్టమైనవి.
అవన్నీ ఒకప్పటి అందమైన భవంతులు.
ఇప్పుడు నేలకొరిగి.. మొజంజాహీ మార్కెట్ భవన సముదాయాన్ని మాత్రం మనకు నజరానాగా మిగల్చాయి. ఆ గొడుగు కిందే చిరువ్యాపారాలు విస్తరించాయి.


మొజంజాహీ మార్కెట్ చౌరస్తా...
Xroad-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఎడమవైపు అఫ్జల్‌గంజ్ రోడ్. కుడివైపు అబిడ్స్ రోడ్. రెండువైపులా కాకుండా సీదా వెళ్లేది గోషామహల్ రోడ్. అఫ్జల్‌గంజ్‌కు వెళ్లే మూలమలుపులో స్వాతంవూత్యోద్యమ కాలం నుంచి ఉన్న ‘అహుజా’ ఎలక్షిక్టానిక్స్, దానికెదురుగా ‘కరాచీ బేకరీ’. సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆ షాపు నిర్వాహకులు మారిపోతున్నా ఇప్పటికీ ఆ పాత బిల్డింగ్‌లోనే వ్యాపారం నడుస్తోంది. ఆ షాపులు మొజంజాహీ భవనానికి తోడుగా ఉండి.. గతాన్ని, ప్రస్తుతాన్ని గమనిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఇప్పుడిలా...
ఎంజే మార్కెట్ మినార్‌పై ఉన్న గడియారం టైమ్ చూపిస్తోంది. దాన్ని పట్టించుకోలేదు కాని మార్కెట్‌లోకి అడుగుపెట్టగానే నిజాం కాలంలోకి వెళ్లిపోయాను. ఆ పాతకాలపు నిర్మాణాలు నిజంగానే తెలియని చోటుకు వెళ్లిన అనుభవాన్ని మిగిల్చాయి. వ్యాపారం కోసమే కట్టినవి కాబట్టి గదులన్నీ విశాలంగా ఉన్నాయి. వందల దుకాణాలు ఉండేవట మొదట్లో. ఇప్పుడంతా చిరు వ్యాపారులమయం. చాయ్.. పాన్ నుంచి మొదలై మటన్, బటర్ దుకాణం దాకా అన్నీ కనిపిస్తుంటే అప్పటి పూల, పండ్ల వ్యాపారం, ఆ సందడి ఏదీ ఊహకు చిక్కడం లేదు. పంచర్ షాపులు, మోటార్ రిపేరింగ్ షాపులు కూడా ఉన్నాయి. మట్టికుండలు, ప్రమిదలు అమ్మేవారు, హమాలీ వాళ్లూ మార్కెట్ నీడలో నాలుగు పైసలు సంపాదించుకునేందుకు కష్టపడుతున్నారు. మార్కెటంతా ఓ బస్తీలా ఉంది. కిరాణం దుకాణాలు, ఐస్‌క్షికీమ్ పార్లర్‌లు కస్టమర్లతో కావలసినంత సందడి. ఇది ఇప్పటి పరిస్థితి కానీ

ఒకప్పుడు....
narsimha-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ అంతా తోటలతో, బావులతో కళకళలాడుతూ ఉండేదట. ప్రత్యేకంగా పూల తోటలు, పండ్ల తోటలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అప్పటి పూల, పండ్ల వ్యాపారం కోసం ఏర్పడిందే మొజంజాహీ మార్కెట్(ఎంజేమ్కాట్). నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కొడుకు మొజంజా బహదూర్ పేరిట 1935లో ఒక అందమైన భవన సముదాయాన్ని నిర్మించి ఇచ్చాడు. అప్పటి నుంచి మొజంజాహీ మార్కెట్ నగర ప్రజలకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారస్తులకూ మంచి ‘బిజినెస్ జోన్’గా మారింది.
పుత్లీబౌలీ నుంచి అబిడ్స్ చౌరస్తా, నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు ‘మూడు పూవులు ఆరు పళ్లు’గా వ్యాపారం సాగేది. కానీ ఇప్పుడా మార్కెట్ లేదు. పురాతన కట్టడాలు, మొజంజాహీ మార్కెట్ భవనం మాత్రమే నాటి ఆనవాళ్లుగా కనపడతాయి. అసలు ఈ మార్కెట్‌ను ఎప్పుడు నిర్మించారు? ఇప్పుడెందుకు లేదు? అనే ప్రశ్నలు మదిలో మెదులుతుంటే వెనక్కి తిరిగాను.మళ్లీ ఓసారి మినార్‌లోని టైమ్ చూశాను. దాని పని అది చేస్తుంది. నిజమే. దేన్ని పట్టించుకోకుండా కాలం తనంతట తాను సాగిపోతూనే ఉంటుంది.
సంవత్సరాలు దొర్లిపోయాయి. నిజాం దృష్టిని మించి వ్యాపారస్తులు ఎక్కువయ్యారు.

వ్యాపారం జోరు పెరగడంతో పాటు ‘ఇరుకు’ భావన కూడా మొదలైంది. దాంతో ‘స్థలం సరిపోవడం లేదని’ ఇక్కడ నుంచి మార్కెట్‌ను కొత్తపేటకు తరలించారు. దానితో పాటే ప్రతి వ్యాపారస్తుడు ఇక్కడ నుంచి కదిలిపోలేదు. అంత దూరం పోయి వ్యాపారంలో లాభం రాకపోతే..? అనే సందేహంతో కొందరు, ప్లేస్ మీద ప్రేమతో ఈ ప్రాంతాన్ని వదిలిపోలేక మరికొందరు రోడ్డు పక్కన శిథిలావస్థలో ఉన్న భవనాల్లో.. గుడారాల కింద తమ దందా చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు.అడుగు ముందుకు పడుతున్నకొద్దీ ఎన్నో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. అందుకే ఈ మార్కెట్ ప్రాంతం వ్యాపారానికే కాదు ఉద్యమానికి అండగా నిలిచిన చరిత్ర ఉందనే విషయమూ గుర్తుకొచ్చింది.

ఉద్యమ బాటలు
1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మొజంజాహీ మార్కెట్ చెంతనే ఉద్యమకారులు పిడికిళ్లు బిగించిన సందర్భాలు అనేకం. తరుచూ తెలంగాణ నినాదాలతో మార్కెట్ మార్మోగేది. ఏ ర్యాలీ తీసినా, ఆందోళన చేసినా అది కచ్చితంగా మార్కెట్ రోడ్డు మీదకు రావాల్సిందే. ఆ ప్రాంతమంతా పోలీస్ బలగాలతో నిండి ఉండేది. కోఠీ నుంచి.. సిటీ కాలేజీ, హైకోర్టు నుంచి.. గోషామహల్ వరకు అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఇక్కడకి వచ్చేవారు.అప్పటి ఉద్యమంలో మొజంజాహీ మార్కెట్ పక్కనే ఉన్న వివేకవర్ధిని కాలేజీ, రెడ్డి హాస్టల్, అబిడ్స్ చౌరస్తాలది ప్రధాన పాత్ర. విద్యార్థులు రెడ్డి హాస్టల్‌లో తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే.. కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు వివేకవర్ధిని కాలేజీలో ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్య పరిచేవారు. రెడ్డి హాస్టల్‌లో జరిగిన రెండ్రోజుల సదస్సు ప్రేరణగానే అప్పటి ఉద్యమం నడిచిందని చెబుతారు. ఇలాంటి పరిస్థితులన్నీ నిశ్శబ్దంగా గమనించిన ప్రదేశం మొజంజాహీ మార్కెట్. అందుకే తెలంగాణ ఉద్యమం ఎంజే మార్కెట్ పరిసరవూపాంతాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒకవైపు వ్యాపారం, మరో వైపు ఉద్యమం రెండింటికీ నీడనిచ్చిన ఎంజే మార్కెట్ స్మృతుల్ని తలుచుకుంటూ అబిడ్స్ వైపు నా నడక సాగుతోంది.మార్కెట్ నుంచి కొద్ది దూరం వెళ్లగానే ఎడమవైపు బ్యాచ్‌లర్ క్వార్టర్స్ బిల్డింగ్. ‘తెలంగాణ ఎన్జీవోల సంఘం’ కార్యాలయం బోర్డు. తెలంగాణ సాధన కోసం సమ్మెకు దిగిన ఉద్యోగుల ఆఫీస్. అవును. తొలి తెలంగాణ ఉద్యమ సమయంలో ‘సత్యాక్షిగహం’ జరిగింది ఇక్కడే. తెలంగాణ ఉద్యోగుల ప్రస్తుత ‘సకల జనుల సమ్మె’ కూడా సత్యాక్షిగహంతో సమానంగా అనిపించింది.

అబిడ్స్... నెహ్రూ
చౌరస్తాలో నెహ్రూ విగ్రహం. దాని వెనకాల నిత్యం అత్యంత రద్దీగా ఉండే జనరల్ పోస్ట్ ఆఫీస్. నగరంలోని ఎన్నో ప్రధాన దారుల పేర్లకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్టే ఈ అబిడ్స్‌రోడ్‌కూ ఓ స్టోరీ ఉంది. ఆల్బర్ట్ అబిద్...ఆరవ నిజాం దగ్గర పనిచేసే నమ్మకమైన ఉద్యోగి. ఆయనంటే నవాబుకు చాలా విశ్వాసం. అబిద్ ఐస్ డిపో నడుపుకుంటూ ఇక్కడే నివాసం ఉండేవాడు. అబిద్‌పై ఉన్న నమ్మకాన్ని బహిరంగ పరిచేందుకు నవాబు ఈ ప్రాంతాన్ని ‘అబిద్స్’ అని పిలిచేవాడు. అప్పట్నుంచి ఈ ప్రాంతం అబిద్స్‌గా, కాలక్షికమేణా అబిడ్స్‌గా మారింది.చౌరస్తాలోని నెహ్రూ విగ్రహం చూస్తుంటే ‘ఆంధ్రా- తెలంగాణ ప్రాంతాలు గడసరి అబ్బాయి, అమాయకపు అమ్మాయిలాంటివి. తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తున్నాం. ఎప్పుడైనా వీరు విడాకులు తీసుకునే హక్కు ఉంది’ అని ఓ సభలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నేటి ఆంధ్రాపాలకులకు ఆ మాటలు గుర్తున్నాయా? అనుకుంటూ అక్కణ్నుంచి నాంపల్లి దారివైపు కదిలాను.

గోల్డెన్ థ్రెష్‌హోల్డ్
kunda-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ‘గోప్డూన్ థ్రెష్‌హోల్డ్’ అని రాసివున్న భవనం. ై‘నెటింగేల్ ఆఫ్ ఇండియా’, దేశానికి తొలి మహిళా గవర్నర్ సరోజినీనాయుడు నివాసం అది. ఆమె అచ్చమైన హైదరాబాదీ. ఆమె తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ. నిజాం కాలేజీ వ్యవస్థాపకుడు. ఆమె 1909లో ‘ది గోల్డెన్ థ్రెష్‌హోల్డ్’ పేరుతో రాసిన పద్యాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే ఆమె తన ఇంటికి ‘గోప్డూన్ థ్రెష్ హోల్డ్’ అనే పేరు పెట్టింది. స్వాతంవూత్యోద్యమ కాలంలో గాంధీజీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే బస చేశారట. సరోజినీ నాయుడు మరణానంతరం ఆమె కూతురు ఈ భవనాన్ని ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి’ అప్పగించింది. అనేక సందర్భాలను, సంఘటనలను గర్తు చేసుకుంటూ, చూస్తూ వెనక్కి తిరిగి వస్తుంటే నెహ్రూ మాటలు, మొజంజాహీ మార్కెట్ పాతకాలపు సన్నివేశాలు, ప్రస్తుత బతుకుదెరువు పోరాటం అంతా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి.

అప్పుడు అద్దె లేదు
మా తాత, తండ్రి కూడా ఇదే మార్కెట్‌లో కిరాణ షాపు నడిపేవారు. అప్పట్లో వారు వ్యాపారంలో బాగా ఉండేది. అద్దె లేకుండానే నిజాం వాళ్లకి ఈ షాపులను ఇచ్చాడు. అదే షాపును నేను నడిపిస్తున్నాను. ఇప్పుడు ఎంజే మార్కెట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా ఉన్నా. మాకే సమస్య వచ్చినా అసోసియేషన్ తరఫునే పరిష్కరించుకుంటాం. వ్యాపారం సంగతి అంటే... ఇప్పుడు అంతంత మాత్రమే.
- నర్సింహామూర్తి,
కిరాణ షాపు నిర్వాహకుడు


తరాల నుంచీ...
అసిఫ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ మట్టి కుండలు, ప్రమిదలు అమ్ముతాను. మా తాతలు కూడా ఇక్కడే అమ్మేవారు. దీపావళి వస్తుంది కదా రెండ్రోజుల్లో గిరాకీ మొదలైతది. అయితే ప్లాస్టిక్ కుండల వల్ల మట్టి కుండలను కొనేవాళ్లు తగ్గిపోయారు. వేసవి, బోనాల ఉత్సవాలు, దీపావళి పండగ ఇవే మాకు గిరాకీనిచ్చే సమయాలు.
- సత్తెమ్మ,
మహిళా వ్యాపారి


Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, .

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP