ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో నూతనోత్సాహంతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పూర్తిగా అహింసా మార్గంలో సాగుతోంది. ఆబాలగోపాలం తెలంగాణ ప్రజల భాగస్వామ్యం తో అంచలంచలుగా ఉద్యమం ఉధృతమై, ఊపందుకుంది. అయినా కేంద్ర-రాష్ట్ర పాలక పక్షాలు నిమ్మకునీత్తినట్లు వ్యవహరించడం బహుశా ప్రపంచ చరివూతలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ, ఏ నియంతృత్వ దేశంలోనూ జరిగి ఉండదు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల మద్దతు అన్ని రాజకీయ పార్టీలకంటే ఎక్కువ వున్నప్పటికీ, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు, తెలంగాణకు మద్దతిచ్చే నాయకులను కలుపుకు పోవాలన్న లక్ష్యంతో 2004 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి నాయకత్వాన వున్న కాంగ్రెస్ పార్టీతో ఉమ్మడి గా ఎన్నికల బరిలోకి దిగారు. సోనియాగాంధీని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని నమ్మారు. కేంద్రంలో మంత్రి పదవిని అంగీకరించారు. నమ్మక ద్రోహం జరిగిందాకా పదవిలో కొనసాగారు. తెలంగాణ ఏర్పాటును తాత్సారం చేస్తుండటంతో.. పదవీ త్యాగం చేశా రు. తన ఎమ్మెల్యేలతోను, రాష్ట్ర మం త్రులతోను రాజీనామాలు చేయించా రు. ఇటు తెలంగాణ ప్రజలకు, అటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఏలుతున్న కాంగ్రెస్ అధిష్ఠానానికి తన నిబద్ధతను ఎరుక పరిచారు.
మళ్లీ ఎన్నికలు వచ్చే దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ప్రక్రియ, కాశీ-రామేశ్వరం మజిలీ కథలాగా, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందం అయింది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో (మహా కూటమితో) వ్యూహాత్మకంగా చేతులు కలిపారు కెసిఆర్. ఎన్నికలలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మళ్లీ ప్రశ్నార్థకం కావడంతో మరో ఉద్యమానికి తెరలేపక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈసారి టిడిపిలోని తెలంగాణ మద్దతుదారులతో సహా, బిజెపి, సిపి ఐ, న్యూ డెమోక్షికసీ పార్టీలు కూడా ఉద్యమంలో దూకాయి. ఉద్యమించా యి. కెసిఆర్ ప్రయత్నాలు, ఆయనదైన శైలితో ఉద్యమం కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 2009లో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం దిగి రాక తప్పని పరిస్థితులొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టుతున్నట్లు కేంద్రం ప్రకటించడం తో.. దీక్ష విరమించారు. దీంతో సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల బెదిరింపు రాజీనామాలు మొదలయ్యాయి. చిదంబరం డిసెంబర్ 23న మరో ప్రకటన. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి (ఇద్దరు మినహా) ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే అంగీకరించబడ్డాయి. మరో కుట్రకు శ్రీకారం చుట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో, వస్తుందనుకున్న తెలంగాణ ఎప్పు డో ఒకప్పుడు రాకపోతోందా అన్న మజిలీకి చేరుకుంది.
తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందనుకున్న శ్రీకృష్ణ కమిటీ గోడమీద పిల్లి వాటంగా ఏమీ చెప్పకుండా దాటవేసింది. కేంద్రంలో ఈ వ్యవహారాన్ని చూస్తున్న చిదంబరం అఖిల పక్షం అంటూ సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నాడు. ఎప్పుడో వేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ అసలా సంగతే మర్చిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కూడా మారారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రాంత ప్రభుత్వోద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమ్మె చేశారు . ఏవో కొన్ని హామీలు ఇచ్చి అప్పట్లో సమ్మెను విరమింప చేసింది ప్రభుత్వం. మిలియన్ మార్చ్ రాష్ట్ర సాధన దిశగా ఓ మలుపుగా నిలిచింది.ఈ క్రమంలోనే.. ఉస్మానియా విద్యార్థుల ఆందోళన, బలిదానాలు, ఉద్రిక్తతలు ఎన్ని చోటుచేసుకున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.
కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నది కాని నిర్ణయం తీసుకోవడంలో మాత్రం అడుగు ముందుకు వేయడంలేదు. రాష్ట్ర శాసన సభలోని మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు రాజీనామా సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు కేశవ రా వు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులలో ముగ్గురు మినహా అందరూ రాజీనామా చేశారు. పదిహేను మందికి పైగా ఎమ్మెల్సీలు సహితం వీరి బాటలోనే నడిచారు. దీంతో రాజకీయ,రాజ్యాంగ సంక్షోభం దిశగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలున్నందు వల్ల వాటి ఆమోదం అంత కష్టం కాదనుకున్న ఎమ్మెల్యేలకు ఆశాభంగమే మిగిలింది. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం రాలేదు.
సమష్ఠి బాధ్యతా రాహిత్యం, అసమర్థ నాయకత్వంతో, పీకల లోతు మునిగిపోయిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వం తెలంగాణ విషయంలోను ఒక నిర్ణయం అంటూ తీసుకోకుండా ఎంత కాలం సాగదీస్తుంది? ఈ మధ్య కాలంలో ఏకాభివూపాయమంటూ మరో వాదన తెరమీదికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను, రాజకీయ అవసరాల కొరకు, చంద్రబాబు నాయుడి ఆధిపత్యాన్ని ఎదుర్కొని, ఎన్నికలలో విజయం సాధించడానికి ఉపయోగించుకుంది. ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా వున్న అభివూపా యం కలిగించారు. అప్పుడు గుర్తుకురాని ఏకాభివూపాయం ఇప్పుడెందుకు గుర్తుకు రావాలి?
వాస్తవానికి, డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు జరిగింది అన్ని పార్టీల ఏకాభివూపాయం కాదా? రోశయ్య అధ్యక్షతన చేసిన అఖిలపక్ష తీర్మా నం ఏకాభివూపాయం కాదా? ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు, వూపజా ప్రతినిధులు నిలువుగా చీలిపోయినప్పుడు, ఎవరి సిద్ధాంతంతో వారు వున్నప్పుడు, ఏకాభివూపాయం నెపంతో, వారి మధ్య వైషమ్యాలు మాత్రమే పెంచుతుంది. దొంగే...దొంగ..దొంగా అని అరిచినట్లు తన పార్టీ మధ్యనే ఏకాభివూపాయం సాధించలేని చిదంబరం ఏకాభిప్రాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ఇరు ప్రాం తాల వారికి వీలైనన్ని తక్కువ అభ్యంతరాలతో సమస్యను పరిష్కరించాలి తప్ప, ఏకాభివూపాయం పేరుతో, దీర్ఘకాలికంగా వాయిదా వేసుకుంటూపోతే, దొరికేది పరిష్కారం కాదు కదా... మరి న్ని సమస్యల తోరణాలు మాత్రమే!
ఈ నేపథ్యంలో సకల జనుల సమ్మెతోనైనా ప్రభుత్వాల కళ్లు తెరిపిద్దామని ప్రపంచ చరివూతలోనే ఓ గొప్ప పోరాటం గా సకల జనుల సమ్మె సాగింది. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమ్మెతో ప్రభుత్వానికి దిమ్మ తిరిగిందే కాని అసలు సమస్యను పరిష్కరించాలన్న ఇంగిత జ్ఞానం మాత్రం కలగలేదు. ఏ సకల (తెలంగాణ) జనులకొరకు తాము ఇబ్బందులకు గురైనా సమ్మెకు దిగారో, ఆ సకల జనుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, పాఠశాలలు, కాలేజీల సిబ్బంది సమ్మెను వాయిదా వేసుకున్నారు. రైలు రోకోలు, సార్వవూతిక బం దులు ఏవీ ప్రభుత్వంలో చలనం తెప్పించలేకపోయాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే! ఇంకేం చేస్తే తెలంగాణ వస్తుంది? తెలంగాణ ప్రజలంతా ప్రతిరోజూ వీధుల్లోకి వచ్చి ఢిల్లీ దాకా వినిపించేటట్లు తెలంగాణ ఏర్పాటు కావాలని నినాదాలు చేయాలా? ప్రతి తెలంగాణవాది తన వంతు విరాళంగా నెల కు ఒక్క రూపాయన్నా ఇచ్చి (నాలుగైదు కోట్ల రూపాయలు?) తెలంగా ణ ఇచ్చిందాకా అధిష్ఠానానికి అధికారికంగా ముడుపులు చెల్లించాల్నా? ప్రతివారం కనీసం కొన్ని లక్షల సంఖ్యలో ఒక్కో తెలంగాణవాది ఓ కార్డు ముక్క సోనియా గాంధీకి పోస్టు చేద్దామా?కాదూ కూడదంటే సీమాంధ్ర ప్రభుత్వాన్ని బహిష్కరించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనల్ని మనం ఏలుకుందాం.
Take By: T News
Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad,
0 comments:
Post a Comment