పట్టాలపై కొట్లాట
- ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు.. పట్టాలపైకి పల్లెలు, పట్టణాలు
- అడుగడుగునా నిర్బంధకాండ.. వేల మంది అరెస్ట్
- అర్ధరాత్రి కూడా ఠాణాల్లోనే నేతలు, కార్యకర్తలు
- 124 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- సమ్మె విరమించాలన్న జానాడ్డి.. మంత్రి తీరుపై యాష్కీ నిప్పులు
పల్లెలు, పట్టణాలు ఏకమయ్యాయి.. తెలంగాణ జెండా చేతబట్టి పట్టాలపైకి చేరుకున్నాయి. నాలుగున్నర కోట్ల గొంతుకల ఆకాంక్షను ఎలుగెత్తిచాటాయి. రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా రైల్‌రోకో కార్యక్షికమం శనివారం తొలిరోజు గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, కేసులకు అదరక బెదరక తెలంగాణ ప్రజలు పిల్లాపాపలతో కలిసి రైలు పట్టాలపైకి కదిలివచ్చారు. అన్ని పార్టీల నాయకులు వారికి అండగా నిలిచారు. 33రోజులుగా అలుపెరగకుండా సకలజనుల సమ్మె బాటపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, కుల సంఘాల నేతలు.. ఇలా అందరూ పట్టాలపైకి చేరుకొని నినదించారు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుతామని ప్రతినబూనారు. ఆది, సోమవారాల్లోనూ రైల్‌రోకోను విజయవంతం చేసి దశాబ్దాల ఆకాంక్షను చాటిచెబుతామన్నారు. నిజామాబాద్ జిల్లా కామాడ్డిలో మహిళలు పెద్దసంఖ్యలో రైలు పట్టాలపైకి చేరుకొని నాలుగు గంటలపాటు పోలీసులను ప్రతిఘటించారు. ప్యాసింజర్ రైలును అడ్డుకున్నారు. రంగాడ్డిలో టీఆర్‌ఎస్, జేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో సామాన్య ప్రజలే రైల్‌రోకో నిర్వహించారు.
తాండూరులోని టీఆర్‌ఎస్వీ నేత వాజీద్ ఆత్మహత్యకు యత్నించారు. ఖమ్మంలో ఖాకీల వలయాన్ని ఛేదించుకొని తెలంగాణవాదులు రైళ్లను ఆపేశారు. నల్లగొండలో పట్టాలపైకి చేరుకున్న ముగ్గురు ఎంపీలను, ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారకముందే హైదరాబాద్‌లో తెలంగాణ బిడ్డలు పట్టాలపైకి చేరుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం లొల్లిపెట్టారు. రైల్‌రోకో కార్యక్షికమానికి వెళుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. రైల్‌రోకోకు బయలుదేరిన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. మెదక్‌లో 385 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు అరవిందర్‌డ్డి, నల్లాల ఓదెలు, కావేటి సమయ్యలను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిర్బంధంలో ఉంచారు. పాలమూరులో పట్టాలపైకి చేరుకున్న తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
అయినా ప్రజలు తెగించి రైళ్లను ఆపేశారు. తెలంగాణ దెబ్బకు కాజీపేట నుంచి కేవలం ఖాళీ భోగీలతోనే ప్యాసింజర్ రైలు విజయవాడకు బయలుదేరింది. రైల్‌రోకో కారణంగా తెలంగాణలో కేవలం ఆరు ఎక్స్‌వూపెస్, ఆరు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడిచాయని అదనపు డీజీపీ(శాంతి భద్రతలు) ఎస్‌ఏ హుదా తెలిపారు. హైదరాబాద్‌లో 33 మెట్రో రైళ్లు తిరిగాయన్నారు. శనివారం దాదాపుగా ప్రజారవాణా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే ప్రధాన రైల్వే మార్గం తెలంగాణ నుంచే వెళుతుండటంతో రెండు ప్రాంతాల మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయింది. ముందస్తుగా 124 ప్రధాన రైళ్లతోపాటు భారీగా ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించింది. రైలోరోకో కారణంగా తెలంగాణవాదులను పెద్ద సంఖ్యలో పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అధికార పార్టీ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్‌లో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, మోహన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలోకి ఎక్కించేటప్పుడు పొన్నం కిందపడ్డా వదలలేదు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే జిల్లాలోని ఉప్పల్ స్టేషన్‌లో వేలాది మందితో టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ రైల్‌రోకో నిర్వహించారు. వరంగల్ జిల్లాలో ఎంపీ రాజయ్యను అరెస్టు చేసి రైల్వే రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
కరీంనగర్‌లో ఎంపీ వివేక్, మెదక్ జిల్లా అక్కన్నపేటలో ఎమ్మెల్యే హరీష్‌రావు, హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఎంపీ విజయశాంతి, మౌలాలి రైల్వే స్టేషన్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మహబూబాబాద్‌లో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కవిత, సీతాఫల్‌మండీలో పోలీసుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న నేరారోపణలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను అరెస్టు చేశారు. నిజామాబాద్‌లో ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే రవీందర్‌డ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను రాత్రి పూట కూడా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. రైల్‌రోకో సందర్భంగా తెలంగాణవాదులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ న్యాయవాదుల జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించనప్పటికీ ముందస్తు అరెస్టుల పేరిట ఉద్యమకారులను నిర్బంధించారని, వారిని వెంటనే విడుదల చేసేలా ఆదేశించాలని కోరింది. అరెస్టుల పర్వంపై ఎంపీ మధుయాష్కీ నిప్పులు చెరిగారు. ఉద్యమాన్ని సీఎం, గవర్నర్, పీపీసీ చీఫ్ కుట్రపూరితంగా అణచివేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం తామంతా జీవిత ఖైదీలుగా జైలుకు వెళ్తామని ఎంపీ కేశవరావు చెప్పారు. కాగా.. రైల్‌రోకోలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీ మంత్రులు సీఎంను కోరారు. ఈ మేరకు మంత్రులు గీతాడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌డ్డి, అరుణ సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. సీఎం నుంచి హామీని సాధించలేక పోయారు. పైగా సమ్మె విజయవంతమైందని, ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని, తాము రాజకీయంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అయి తే తెలంగాణ ఉద్యమాన్ని ముం దుండి నడిపించాలని సీనియర్ మంత్రి జానాడ్డిని నాయకుడిగా ఎన్నుకుంటే ఆయన ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్నారని యాష్కీ ఘాటుగా విమర్శించారు.

Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand

0 comments:
Post a Comment