సకల జనుల సమ్మె నుంచి ఆర్టీసీకి మినహాయింపు
-రేపు తెలంగాణ బంద్
-మిగతా సమ్మె యథాతథం
-తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, అక్టోబర్ 15 : సకల జనుల సమ్మె నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసుకు, ఆర్టీసీలో ఎదుగుతున్న నాయకత్వానికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉండటం, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మె నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. సకల జనుల సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కోదండరాం స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఆంధ్ర నాయకులు, పాలకులు కుట్రలు పన్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. ఆర్టీసీ నాయకులపై ఒత్తిళ్లు పెరగడం, సంఘటిత శక్తికి తూట్లు పడే ప్రమాదం ఏర్పడటం కూడా మినహాయింపుకు కారణమని చెప్పారు. ప్రభుత్వం పాశవికంగా దాడులు చేయిస్తూ, భయోత్పాతాన్ని సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం తెలంగాణ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఆర్టీసీతో సహా ప్రజలు, వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఉద్యమకారులపై సంబంధంలేని ఘటనలతో కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. మఫ్టీ పోలీసులే రైల్వే ఆస్తులకు నష్టం కలిగించి ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. విజయశాంతి, కె. కవిత, సంధ్య సహా 60 మంది మహిళలను పోలీసు స్టేషన్‌లలో పెట్టడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని, వారిని వెంటనే విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనాగరికంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పట్టాలపైకి వస్తే సాధారణ కేసులు నమోదు చేయాల్సి ఉండగా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను, ఉద్యమకారులను అరెస్టు చేయడంపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులను కూడా సీమాంధ్ర పాలకులు వేధింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు.
మంత్రులు రాజీనామాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే బాగుండేదని ఆయన అభివూపాయపడ్డారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఆదివారం లేదా సోమవారం సమావేశమై నిర్ణయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ దొంత ఆనందం, కన్వీనర్ రాజిడ్డి, టీఎన్‌ఎంయూ చైర్మన్ థామస్‌డ్డి, కన్వీనర్ అశ్వత్థామడ్డి, కో-కన్వీనర్ హన్మంతు, ఆర్టీసీ జేఏసీ నాయకులు సుభాష్, అక్బర్, రమేష్, రాజు మాట్లాడుతూ రాజకీయ జేఏసీ ఎప్పుడు పిలుపునిచ్చినా సమ్మెకు సిద్ధమని, ప్రజల సౌకర్యార్థం మాత్రమే ఈ సడలింపు అని అన్నారు. ఆర్టీసీలో కార్మికులు, అధికారులు తమ ఐక్యతను గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాటారని అన్నారు. సీమాంధ్ర పాలకులు, యూనియన్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ సంఘటిత శక్తిని చాటామని చెప్పారు. తెలంగాణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వారు ప్రకటించారు.
కేసీఆర్‌తో జేఏసీ నాయకుల భేటీ
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల చైర్మన్ కె.స్వామిగౌడ్, కో-చైర్మన్లు జి.దేవివూపసాద్‌రావు, సి.విఠల్, సెక్రటరీ జనరల్ వి.శ్రీనివాస్‌గౌడ్ సమావేశమయ్యారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన భేటీలో వారి మధ్య సుదీర్ఘ మంతనాలు సాగాయి. ఈ సందర్భంగా రైల్‌రోకో, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. పోలీసులు అక్రమ కేసులు బనాయించిన అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment