12 నుంచి రైల్ రోకో తాజా షెడ్యూల్
-12,13,14 తేదీల్లో రైల్ రోకో
-9 లేదా 10న కోల్‌బెల్ట్‌లో జేఏసీ బస్సు యాత్ర
-11న ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగుల మహాధర్నా
-నేడు జేఏసీ విసృ్తత స్థాయి సమావేశం
-ప్రభుత్వ వ్యూహం ప్రభుత్వానికుంటే..
మా వ్యూహం మాకుంది
-అన్నీ చెప్పం.. చేసి చూపిస్తాం
-జేఏసీ పర్యటనతోనే ఢిల్లీలో కదలిక
-టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
- తెలంగాణ సాధించేదాక ఉద్యమం ఆగదు
- జేఏసీ ఢిల్లీ వెళ్లొచ్చాక కేంద్రం విద్యుత్ ఇచ్చింది.. దాన్ని రాష్ట్ర సర్కారు
సీమాంవూధకే తరలిస్తున్నది
- శాంతియుత ఉద్యమంపై ప్రభుత్వ కుట్ర
- కావాలనే హింసాత్మకం చేస్తున్నది
- జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శ
‘‘ఉద్యమంపై ప్రభుత్వ వ్యూహం ప్రభుత్వానికి ఉంటుంది. మా వ్యూహం మాకుంది. అన్నీ చెప్పం. ఎప్పుడు ఏం చేయాలో చేసి చూపిస్తాం’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నేతల ఢిల్లీ పర్యటన తరువాత కేంద్రంలో చలనం వచ్చిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని సాధించుకునేదాకా సకల జనుల సమ్మెను విరమించేది లేదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పునరుద్ఘాటించారు.
శుక్రవారం నాడు ఇక్కడి బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌లోని ప్రైవేట్ ఫాం హౌజ్‌లో రాజకీయ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్, కోదండరాం విలేకరులతో మాట్లాడారు. సమావేశం నిర్ణయాలను వివరించారు. ఈ నెల 9,10,11 తేదీల్లో నిర్వహించతలపెట్టిన నిరవధిక రైల్‌రోకో కార్యక్షికమాన్ని 12,13,14 తేదీలకు మార్చారు. 9 లేదా 10వ తేదీన జేఏసీ బృందం సింగరేణి కార్మికులకు సంఘీభావంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలో బస్సు యాత్ర చేయనుంది. 11న ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల మహాధర్నాను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ తేదీలపై శనివారం జరుగనున్న జేఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సింగరేణి పర్యటన, ఉద్యోగుల మహాధర్నా కార్యక్షికమాల వల్ల రైల్‌రోకో షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందని జేఏసీ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 2.00గంటలకు లోటస్‌పాండ్ వద్ద జేఏసీ విసృ్తత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయని ప్రజావూపతినిధులను టార్గెట్ చేస్తూ, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేసీఆర్.. 25రోజులుగా సమ్మె సాగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలుపాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాజీనామాలు చేయని ప్రజావూపతినిధులను ఏం చేయాలన్నది శనివారం జరిగే జేఏసీ సమావేశంలో ఎజెండాను ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సమ్మెపట్ల ప్రభుత్వ వ్యూహం ప్రభుత్వానికి ఉంటుందని, అదేసమయంలో తమ వ్యూహం తమకు ఉంటుందని చెప్పారు. అన్నీ చెప్పమని.. చేసి చూపిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఉద్యమాన్ని, సమ్మెను ఆపేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల మహా ధర్నా, జేఏసీ బృందం సింగరేణి పర్యటనవల్ల రైల్‌రోకో కార్యక్షికమంలో స్వల్ప మార్పులు చేసినట్లు చెప్పారు.
ఈనెల 12,13,14 తేదీల్లో రైల్‌రోకో కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. శాంతియుతంగానే ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతోందని, అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యమాన్ని సాకుగా తీసుకొని ప్రభుత్వం తెలంగాణలో విద్యుత్ కోతను విధిస్తూ రైతులను వేధిస్తోందని ఆరోపించారు. రైతులను వేధించడం సరికాదన్నారు.
జేఏసీ బృందం ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన మేరకు రాష్ట్రానికి 1350మెగావాట్ల విద్యుత్‌ను, 350 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను రాష్ట్రానికి ఇస్తే అది కేవలం ఆంధ్ర ప్రాంతానికే కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఏడు గంటల విద్యుత్‌ను పునరుద్ధరించాలని కోదండరాం డిమాండ్ చేశారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు పని చేసిన కాలంలో జీతాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల జీతాల కోసం శనివారం రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలువనున్నట్లు ఆయన తెలిపారు.
జేఏసీ సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు గుంతకండ్ల జగదీష్‌డ్డి, దాసోజు శ్రవణ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు, బీజేపీ నాయకులు బండారు దత్తావూతేయ, సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీహెచ్ రాజేశ్వర్‌రావు, సీ అశోక్‌కుమార్ యాదవ్, న్యూడెమొక్షికసీ నాయకులు పీ సూర్యం, కే గోవర్ధన్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో-చైర్మన్ సీ విఠల్, ఎకె్సైజ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రయ్య, విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు, ఇరిగేషన్ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ వెంక తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment