నేనలా అనలేదు.. ------ ప్రణబ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మరిన్ని సమస్యలు వస్తాయని తాను ఎక్కడా చెప్పలేదని, అలాంటి వ్యాఖ్య లు తనకు అపాదించవద్దని కేంద్ర మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఢిల్లీలో స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం బెంగాల్‌లో తను ఒక ప్రైవేటు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశంలో మరిన్ని డిమాండ్లు పుట్టుకొస్తాయని అన్నట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ విషయంలో శుక్రవారం సబ్ కోర్ కమిటీ సమావేశం తరువాత వివరణ ఇచ్చి తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని పరోక్షంగా స్పష్టం చేశారు.

ప్రణబ్ ఆ ఇంటర్వ్యూలో తెలంగాణకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన మాటల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు సుముఖంగా లేదని తేలిపోయిందని సీమాంధ్ర చానళ్లు కొన్ని రోజంతా విషవూపచారం చేశాయి. ప్రణబ్ వ్యాఖ్యలతో రాష్ట్ర విభజనపై కేంద్రం చేతుపూత్తేసిన భాష్యం చెప్పాయి.
ఈ వ్యాఖ్యానాలను నమ్మిన తెలంగాణవాదులు తీవ్రంగా కలత చెందారు. మరీముఖ్యంగా తెలంగాణ పరిణామాలను గమనిస్తున్న యువత కలవరపడింది. చివరికి ప్రణబ్ తను అలా చెప్పలేదని శుక్రవారం వివరణ ఇవ్వడంతో సీమాంధ్ర చానళ్లు చేసిన విష ప్రచారం అసలు రంగు బయటపడింది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికే సీమాంధ్ర మీడియా పనిచేస్తోందని, ఆ మీడియా కథనాలను ఇకనైనా తెలంగాణ ప్రజలు నమ్మొద్దని జేఏసీ ఛైర్మన్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర మీడియా విష ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని, అలాంటి చానళ్లను పట్టించుకోకూడదని రాజకీయ విశ్లేషకుడు వి ప్రకాశ్ చెప్పారు. ప్రణబ్ అలా మాట్లాడలేదని తను మొన్ననే చెప్పానని, అదే ఇవ్వాళ ఆయన వివరణతో రుజువైందని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ వినోద్ తెలిపారు.
0 comments:
Post a Comment