మిలియన్ మార్చ్ యథాతథం
హైదరాబ్, మేజర్‌న్యూస్: టీజేఏసీ నిర్వహించ తలపెట్టిన ‘మిలీనియం మార్చ్ టు హైదరాబాద్’పై ఉత్కంఠ వీడింది. ముందుగా ప్రకటించినట్టుగానే మార్చి 10వ తేదీన మిలియన్ మార్చ్ జరుగుతుందని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. అయితే సమయం లోనే మార్పు చేశారు. మధ్యాహ్నం 1గంటకు ఈ ధర్నా ప్రారంభించి 4గంటల వరకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు కలుగ రాదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి పారు. నగరంలోని రెండు మూడు ప్రాంతాల నుండి భారీ ర్యాలీలుగా తరలివచ్చి ట్యాంక్‌బండ్‌పై ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ, స్రజాసంఘాలు, తెలంగాణ వాదులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
సోమవారం టీజేఏసీ కార్యాలయంలో జేఏసీ విస్తృత సా్థూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చి10 తేదీన జరిగే ఇంటర్ పరీక్ష వాయిదా వేసుకుంటామనిఇంటర్మీడియట్ బోర్డు హామీ ఇచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని ప్రకటించామని, కానీ తెలంగాణ ఉద్యమం పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందున ఉద్యమ పంథాలో కొంత మార్పు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సహాయ నిరాకరణ కార్యక్రమంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దుకుని భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ రూపొందించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్‌జీఓ అధ్యక్షులు స్వామీగౌడ్, దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్, శ్రవ ణ్‌కుమార్, బీజే పీ నాయకులు అశోక్, సీపీఐఎమ్‌ఎల్ న్యూడెమక్రసీ నేత గోవర్ధన్, శేషు రాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images
0 comments:
Post a Comment