డబ్బు సంచులతో తెలంగాణను అడ్డుకున్నారు
సిద్దిపేట అర్బన్, : తెలంగాణ ప్రాంతాన్ని ఐదు దశాబ్దాలు గా దోచుకొని సంపాదించిన డబ్బు సంచులతో సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను, శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కొన్నారని ఎమ్మె ల్యే హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట పాత బస్టాండు వద్ద జరుగుతున్న రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుగోడలు నిర్మిస్తున్నారని ఆక్షేపిం చారు. కేంద్రం సీమాంధ్ర నేతల ప్రలోభాలకు తలొగ్గకుండా తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్లను విని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం రావడానికి కూడా సమయం పట్టిందని, ఆలస్యమైనా ఓపిగ్గా పోరాడి తెలంగాణ సాధించుకుందామన్నారు. తాము రచ్చబండను అడ్డుకోవడం లేదని, ఈ ప్రాంత కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను మాత్రమే అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘అభివృద్ధి పౌరహక్కు, తెలంగాణ సాధన మా జన్మహక్కు’అని నినదించారు. రచ్చబండ ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉనికి చాటుకునే యత్నం చేస్తున్నారన్నారు. తెలంగా ణ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో కలిసి రా వాలని పిలుపునిచ్చారు. అనంతరం హనుమాన్‌నగర్ మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, ఎంపీపీ రామచంద్రం, టీఆర్‌ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, బర్ల మల్లికార్జున్, నాయకులు లక్ష్మీరాజం, లక్ష్మణ్, మల్లేశం, యోగి, మురళి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment