‘తుఫాన్’గా వస్తున్న ‘జంజీర్’!
రామ్‌చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ‘జంజీర్’.
అమితాబ్‌బచ్చన్ కథానాయకుడిగా 1973లో విడుదలైన హిట్ సినిమా ‘జంజీర్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అపూర్వలాఖియా దర్శకుడు. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తోంది.
అపూర్వలాఖియా, అమిత్ మెహ్రా నిర్మాతలు. ప్రాణ్ పోషించిన షేర్‌ఖాన్ పాత్రను ఈ తాజా రీమేక్‌లో సంజయ్‌దత్ పోషిస్తుండగా..తెలుగు వెర్షన్‌లో అదే పాత్రను హీరో శ్రీహరి పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. హిందీలో ‘జంజీర్’గా విడుదల కానున్న ఈ చిత్రానికి తెలుగులో ‘మెరుపు, ‘జ్వాల’ అనే పేర్లు పరిశీలిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ చిత్రానికి ‘తూఫాన్’ అనే పేరుని ఖరారు చేశామని చిత్ర వర్గాలు తెలిపాయి. తెలుగు వెర్షన్‌కు ‘చింతకాలయరవి’ ఫేమ్ యోగి దర్శకత్వ పర్య వేక్షణ చేస్తున్నాడు.
ఈ చిత్ర ప్రచార చిత్రాలను రామ్‌చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ నెల 27న విడుదల చేస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం.
0 comments:
Post a Comment