Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, March 17, 2013

X క్టాస్ సక్సెస్


Xclassవచ్చింది వంద శాతం రాయడానికి ఫైవ్ పాయింట్ ఫార్ములా!

టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే విద్యార్థులకు టెన్షన్, పేరెంట్స్ అటెన్షన్. చాలా మంది పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. కానీ ఎగ్జామ్స్‌పై అవగాహన, సరైన ప్రణాళిక లేక రావలసిన గ్రేడు కంటే తక్కువ గ్రేడు తెచ్చుకుంటారు. ఈ నిరాశను నివారించేందుకు వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించి అత్యుత్తమ ర్యాంకులు సాధించిపెట్టిన శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ పి.వి.ఆర్.కె.మూర్తి టర్నింగ్ పాయింట్ విజ్ఞప్తిపై మార్క్స్ స్కోరింగ్ స్టెప్స్ అందిస్తున్నారు.


విద్యార్ధినీ విద్యార్ధులు తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో టెన్త్‌క్లాసు పబ్లిక్ పరీక్షలను రాయబోతు న్నారు. ప్రతి విద్యార్ధికీ కెరీర్‌లో అత్యంత ముఖ్యమై నవి టెన్త్‌క్లాసు ఎగ్జామ్స్. పదవతరగతిని ఒకే విద్యా సంవత్సరంగా పరిగణిస్తున్నప్పటికీ, నిజానికి 9వ తరగతి చివరిలోనే టెన్త్ క్లాసు పాఠాలు ప్రారంభమై ఏడాదిన్నర కాలం విద్యార్ధితో సహవాసం చేస్తాయి. మరో ఐదు రోజుల్లో టెన్ల్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.
ఇప్పటివరకు నేర్చుకున్న దానిని వంద శాతం పరీక్షల్లో రాసేలా విద్యార్ధులు సిద్ధం కావాలి. ఇక ఇప్పుడు కొత్తగా పాఠాలు చదువవద్దు. కొత్తగా ఏదైనా లెసన్ దృష్టికి వచ్చినా, దానిని వదిలేసి ఇప్పటికే చదివినది పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం. పరీక్షల్లో తనకు వచ్చింది వందశాతం రాసేలా అభ్యర్ధులు సిద్ధం కావాలి.

1. గ్రేడింగ్‌పై అవగాహన 
స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ‘నువ్వా? నేనా? డిస్ట్రిక్ టాపర్‌ను ఇక నేనే... స్కూల్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలవాలి’... అన్న ఉద్వేగం విద్యార్ధులను ఊపేసేది. దీనితో విద్యార్ధులు టెన్త్ పబ్లిక్ పరీక్షలను జీవన్మరణ సమస్యగా భావించి రాసేవారు. అయితే ప్రస్తుత గ్రేడింగ్ విధానం వల్ల విద్యార్ధులు అంతగా కష్టపడాల్సిన పనిలేదు. 600 మార్కులకు గాను 550 మార్కులు స్కోర్ చేసిన విద్యార్ధులు ఎవరైనా 10/10 గ్రేడింగ్‌తో టెన్త్‌క్లాసు ఉత్తీర్ణత సాధించినట్టే. ఇక ఇందులో తారతమ్యాలు లేవు. 10/10 గ్రేడ్ రావాలంటే కొన్ని సబ్జెక్టుల్లో సెంట్‌పర్సంట్ (100/100) స్కోర్ చేయాలనే నియమం లేదు. వివిధ సబ్జెక్ట్లు 92 నుంచి 100 లోపు ఎన్ని మార్కులు స్కోర్ చేసినా విద్యార్ధికి 10/10 గ్రేడ్ లభిస్తుంది. కాబట్టి బోర్డు నిర్దేశించిన మార్కుల వరకు అన్ని సబ్జెక్టుల్లో తెచ్చుకుంటే చాలు. కాబట్టి కొన్ని సబ్జెక్టులను మాత్రం ఫోకస్‌గా చదవాలనే పరిస్థితి గ్రేడింగ్‌తో తప్పించినట్టయిందని అభ్యర్ధులు గుర్తుంచుకోవాలి.

2. ప్రెజెంటేషన్ ప్రధానం 
ఏడాదిన్నరపాటు (9వ తరగతి చివరి నుంచి అనుకున్నాం కదా) విద్యార్ధి పరీక్ష రోజున రెండున్నర గంటల్లో జవాబుప్రతం (ఆన్సర్ షీట్) రాస్తాడు. ఎస్.ఎస్.సి బోర్డు రూపొందించిన వేల్యూ పాయింట్ల ఆధా రంగా వేల్యుయేటర్ స్పాట్ సెంటర్‌లో నాలుగైదు నిమిషాల సమయంలో దిద్ది మార్కులు వేసేస్తారు. అందుకే ఎంత చదివినా, ఎంత బాగా వచ్చినా వేల్యు యేటర్‌ను ఆకర్షించేలా జవాబులు రాయాలన్న విషయం మాత్రం విద్యార్ధి మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉండాలి. ప్రశ్నాపత్రం చేతిలోకి తీసుకోగానే మొదటి ప్రశ్నే కష్టంగా ఉంటే నీరుకారిపోకూడదు. ‘ఈ ప్రశ్న నాకే కాదు. అందరికీ కఠినమే’ అని మనసుకు సర్దిచెప్పుకొని మిగతా ప్రశ్నల్లో బాగా నచ్చిన దానిని ఎంచుకొని వేల్యూయేటర్‌ను మెప్పించేలా జవాబులు రాయాలి. తొలి జవాబు నుంచి ఆఖరి జవాబు రాసే వరకు ‘ప్రజంటేషన్ స్టైల్’ ఒకే ఒరవడిలో కొనసాగించినప్పుడే విద్యార్ధి కోరుకోకుండానే వేల్యూయేటర్ మంచి మార్కులు ఇస్తారు. ఆన్సర్ షీట్‌ను అంగుళం ఖాళీ లేకుండా నింపేయకుండా పేజీలో నలువైపులా కాసింత స్థలం ఇస్తూ మధ్యలో జవాబును రాసే ప్రయత్నం చేసినప్పుడే వేల్యూయేటర్‌ను ఆకర్షించ గలుగుతారు. అడిగిన మేరకే ప్రశ్నకు తగిన జవాబును రాయాలి. విద్యార్ధి తనకు ఎంతో విషయం తెలిసినప్పటికీ దానిని మొత్తం జవాబు రూపంలో గుమ్మరించేస్తే వేల్యూయేటర్‌ను గందరగోళ పరచినట్టుంటుంది. కాబట్టి ఎంత వరకు జవాబు రాయాలన్న జడ్జిమెంట్ విద్యార్ధికి ఉండాలి.

3. టైమ్ మేనేజ్‌మెంట్ 
పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ టైమ్ మేనేజ్ మెంట్ కీలకం అవుతుంది. ఎంతసేపు చదవాలి? ఎంతసేపు నిద్రపోవాలి? తమ తప్పు లేకుండా వృధా టైమ్‌పోవడాన్ని ఎలా నియంత్రించాలి? అన్న సందేహాలు విద్యార్ధులను వెన్నాడుతుంటాయి. ఈ విషయంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు స్పష్టతలో ఉండాలి. ఒకే ఆలోచనతో ఉండాలి. మొత్తం 24 గంటల్లో 7 గంటలు నిద్రకు వదిలేయాలి. 3 గంటలు కాలకృత్యాలకు, ఇతర పనులకు వదిలేసి ఇక మిగిలిన 17 గంటలు చదువులోనే నిమగ్నం కావాలి. తెల్లవారుఝూమున లేచి చదవడమా? లేక రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉండటమా? అన్నది విద్యార్ధి మనస్తత్వం, శరీర తత్వం బట్టి నిర్ణయించుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్లాన్ చేసుకొని చదివితే మంచిది. రెండున్నర గంటల పాటు చదివిన తర్వాత అరగంటసేపు రిలాక్స్ కావచ్చు. తర్వాత 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. లంచ్, రిలాక్స్ కోసం 2 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు సబ్జెక్టు ప్రిపరేషన్ చేయవచ్చు. టీ టైమ్‌కి సాయంత్రం 6 నుంచి అరగంట పాటు విద్యార్ధి ఫ్రీగా మళ్ళీ రిలాక్స్ కావచ్చు. చివరగా 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రిపరేషన్ పూర్తి చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని 10 గంటల కల్లా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు.

4. గ్రూప్ స్టడీ 
సమాన ప్రతిభ గల సహవిద్యార్ధులు కలిసి చదువుతామంటే సానుకూల ఫలితాలే వస్తుం టాయి. టెన్త్ క్లాస్ స్థాయిలో బృందాలుగా విద్యార్ధులు చదవటం తక్కువగా ఉంటుంది. మార్కుల రీత్యా టాపర్‌గా నిలవగలిగే విద్యార్ధి క్లాసులో యావరేజీ మార్కులు వచ్చే విద్యార్ధి ఇద్దరూ గ్రూప్ స్టడీ చేయటం సరికాదు. ఎప్పుడో వచ్చేసిన సబ్జెక్టును మళ్ళీమళ్ళీ చదవటం రుచించని టాపర్. కొన్ని అంశాలకే పరిమితమయ్యే యావరేజి విద్యార్ధికి పొంతన కుదరక గ్రూప్ స్టడీ ఇద్దరికీ నష్టంగా పరిణమిస్తుంది. ఇటువంటి సందర్భాలలో ఎవరికి వారే ఇండిపెండెంట్‌గా పరీక్షలు ప్రిపేర్ కావటం ఉత్తమమైనది. చదివే క్రమంలో ఏమైనా అనుమానాలుంటే టీచర్‌ను లేదా సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ను ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇంటిపట్టునే ఉంటూ పరీక్షలకు చదవాలి. ఉదా ॥ మ్యాథమెటిక్స్, సైన్స్ వంటి సబ్జెక్టులలో టీచర్ పరీక్షల సమయంలో చెప్పిన దానికంటే విద్యార్ధి సొంతంగా ప్రాక్టీసు చేస్తేనే నిర్దేశిత అంశం సులువుగా అర్ధం అవుతుంది.

5. మితాహారం - ఆరోగ్యం
పరీక్షల సమయంలో ఫిజికల్ ఎక్సర్ సైజులు, వాకింగ్‌లు వంటివి విద్యార్ధులు చేయ రాదు. అవి చేస్తే శరీరం అలసిపోయి నిద్రవచ్చే ప్రమాదం ఉంది. ఉదయం లేవగానే పావుగంట, రాత్రి పడుకునే ముందు పావుగంట మెడిటేషన్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టెన్త్ క్లాసు పరీక్షలు బాగా రాయాలంటే విద్యార్ధులు మానసికంగా దృఢంగా ఉండాలి. మెడిటేషన్‌తో దానిని సాధ్యం చేసుకోవచ్చు. ఆహారం పరంగా ఎక్కువగా తీసుకోకుండా, మితమైన ఆహారం తీసుకునే ప్రయ త్నం చేయాలి. పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరం తేలికగా ఉంటుంది. అంటే అన్నం తినటం మానేసి పూర్తిగా పండ్లు మాత్రమే తీసుకోవాలనేది కాదు. ఇతరత్రా ఆహారం మితంగా తీసుకొని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగటం విద్యార్ధులకు పరీక్షల దృష్ట్యా బాగుంటుందనేది తల్లిదండ్రులు మరువరాదు.

తల్లిదండ్రులూ ఇలా వ్యవహరించండి..
1. ‘చదువురా .. బాబు పరీక్షలు చదువు..’ అంటూ పిల్లలను పరుగులు పెట్టించరాదు.

2. అసలే విద్యార్ధులకు లోలోపల తెలియ కుండానే పరీక్షల వత్తిడి ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకొని వారి మనసును తేలికపరిచేలా విరామ సమయంలో వారిని ఆహ్లాదపరచేలా మాట్లాడాలి.

3. ఎట్టి పరిస్థితులలోను నువ్వు ఎన్ని మార్కులు సాధిస్తావు? ‘చూడు .. ఎదురింటి అబ్బాయి ఎంత బాగా చదువు తున్నాడో’ అంటూ పోలికలు తీసుకురావద్దు. 

4. పిల్లలలో ఆత్మ విశ్వాసం పెరిగేలా విజయగాథలు చెప్పండి. 

5. రిలాక్స్ అయ్యే క్రమంలో కాసేపు టివి చూస్తుంటే పరీక్షల్లో టివి ఏమిటంటూ ‘కసురుకోవద్దు. టైమ్ లిమిట్ పెట్టి అనుమతించండి. 

6. తల్లిదండ్రులు టివి చూసే బలహీనత ఉంటే పిల్లల పరీక్షల సమయం నియంత్రించుకోవాలి. వీలయితే పరీక్షల సమ యంలో టివి కట్టేసే ప్రయత్నం చేయండి. 

7. తొలి రోజు పరీక్షా కేంద్రానికి చేరడంలో జాప్యాన్ని నివారించేందుకు పరీక్ష సెంటర్ చిరునామా ఒక రోజు ముందు మీరు తెలుసుకుని సిద్ధంగా ఉండండి. 

8. అరగంట ముందు పరీక్ష సెంటర్‌కు విద్యార్ధి చేరుకునేలా ప్లాన్ చేయండి.

9. పరీక్షలు రాసిన రోజు మధ్యాహ్నం గంట లేదా రెండు గంటలు మీ అబ్బాయి, అమ్మాయి నిద్రపోయేలా చూడండి. అప్పుడు పరీక్ష రాసిన వత్తిడి తగ్గుతుంది. 

10. జరిగిన పరీక్ష గురించి ఎక్కువగా చర్చించవద్దు.

11. ఎగ్జామ్ ప్యాడ్, బ్లూ బాల్ పాయింట్‌పెన్ను, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్, రబ్బరు, స్కేల్ వంటి స్టేషనరీ ఒక రోజు ముందే విద్యార్ధి రెడీ చేసుకునేలా సహకరించండి.

12. ఫంక్షన్లు, బంధువులు వంటి హంగామా విద్యార్ధులకు ప్రిపరేషన్‌లో ఏకాగ్రతను దూరం చేస్తాయి. కాబట్టి వాటిని పరీక్షల వరకు పుల్‌స్టాప్ పెట్టేలా కఠిన నిర్ణయం తీసుకోండి.

13. ప్రతిరోజూ ‘నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయగలవు’ అనే ప్రేరణ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పండి.

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP