కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్‌లో ర్యాగింగ్ బూతం కలకలం...
-బీఫార్మసీ విద్యార్థినిపై సీనియర్ల వేధింపులు
-ప్రిన్సిపాల్‌కు బాధితురాలు ఫిర్యాదు
-వీసీ, రిజిస్ట్రార్‌లను కలిసిన తల్లిదంవూడులు
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ బూతం జడలు విప్పింది. అమాయకురాలైన ఓ దళిత
విద్యార్థినిపై సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మానసిక
వేదనకు గురైన బాధితురాలు ఈ చదువు తనకొద్దంటూ ప్రిన్సిపాల్‌తో
మొరపెట్టుకుంది. తల్లిదంవూడులకు విషయాన్ని చేరవేసి తాను ఇంటికి
వస్తున్నట్లు తేల్చి చెప్పింది.
ఈ సంఘటన కేయూలో శుక్రవారం ఆలస్యంగా
వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ములుగు మండల కేంద్రానికి చెందిన
శనిగరపు రమ్య కాకతీయ యూనివర్సిటీలోని బీఫార్మసీ కళాశాలలో మొదటి సంవత్సరం
చదువుతోంది. 20రోజుల క్రితం కళాశాలలో అడ్మిషన్ పొందిన రమ్య క్యాంపస్‌లోని
పద్మాక్షి హాస్టల్‌లో ఉంటోంది. మొదట్లో సజావుగానే సాగినా సీనియర్ల పరిచయం
రాను రాను వేధింపులకు దారి తీసింది. జూనియర్ అయిన రమ్యను సీనియర్లు
ర్యాగింగ్ పేరిట మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు.
ఆమెతో మిగతా
విద్యార్థినుపూవరూ మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారు. సున్నిత మనస్కురాలైన
రమ్య ఆ బాధను తట్టుకోలేక చదువునే దూరం చేసుకోవాలని అనుకుంది. తనకు
జరుగుతున్న అన్యాయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది.
హాస్టల్‌లో సీనియర్ల వేధింపులు తాళలేక పోతున్నామని వెంటనే తన సమస్యకు
పరిష్కారం చూపాలని వేడుకుంది. లేకుంటే ఇక్కడ చదువు కొనసాగించడం
కష్టసాధ్యమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తల్లిదంవూడులకు చేరవేసింది.
వీసీని కలిసిన తల్లిదంవూడులు
కూతురు
రమ్యను హాస్టల్‌లో సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురి చేసిన
విషయాన్ని తెలుసుకున్న తల్లిదంవూడులు వీసీ, రిజిస్ట్రార్‌ను కలిశారు.
కూతురు రమ్య సున్నిత మనస్కురాలైనందున సీనియర్ల వేధింపులతో ఏదైనా
అఘాయిత్యానికి పాల్పడే అవకాశాలు ఉన్న దృష్ట్యా చర్యలు తీసుకోవాలని వారు
కోరారు. వెంటనే స్పందించిన వీసీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ డైరెక్టర్,
జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడారు. హాస్టల్, కళాశాలలో జరుగుతున్న విషయాలను
చర్చించారు.
కొంత కాలంగా కేయూలో ర్యాగింగ్ అనే మాటలు వినిపించిన
దాఖలాలు లేవని విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇలాంటి పరిణామాలు చోటు
చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వీసీ సూచించారు. ర్యాగింగ్‌ను అరిక
కొంత మంది ప్రొఫెసర్లతో కమిటీని వేసి భవిష్యత్‌లో ర్యాగింగ్ పేరు
వినపడకుండా చూడాలని వీసీ ఆదేశాలు జారీ చేశారు.
0 comments:
Post a Comment