ప్రభుత్వ సర్వీసులో నెలకు 3 లక్షలు
ఎల్.ఐ.సి డెవలప్‌మెంట్ ఆఫీసర్
ప్రభుత్వోద్యోగంలో వేతనాలు స్థిరంగా ఉంటాయి. ఎంత పని చేసినా అంతే వేతనం కానీ ఉద్యోగభద్రతకు గ్యారంటీ లేదు ఈ రెండింటినీ మేళవించి జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి) నేటి యువతకు గొప్ప అవకాశం కల్పిస్తోంది.
-నెలకు 2.5 లక్షల ఇన్సెంటివ్ * నెలకు 50 వేల ఆఫీసు వేతనం * ఎంతమంది ఏజెంట్లనైనా నియమించవచ్చు * బ్రాంచీలో సీనియర్ డివిజనల్ మేనేజర్ వరకు ఎదగవచ్చు * ప్రపంచ అగ్రగామి సంస్థలల్లో ఉద్యోగం * కొద్ది సంవత్సరాలలోనే కారు యోగం * బిజినెస్ సామర్ధ్యాన్ని బట్టి ఏకంగా అమెరికా దేశంలో గౌరవ పురస్కారాలు * నిధులు ఖర్చుకాని నిచ్చెన వంటి వ్యాపారం * మీ ఆఫీసుకు మీరే ‘బాస్’.
ఇలా ఇన్ని ప్రయోజనాలు, ఆకర్షణలు గల కెరీర్ ఏదైనా ఉందా అంటే ఎల్‌ఐసి అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ మాత్రమేనని చెప్పాలి. ప్రభుత్వ సర్వెంట్ల వలే నెలవారీ జీతాలకై ఎదురుచూడకుండా నెల నెలా మొత్తం ఇన్సెంటివ్ అందుకునే అత్యుత్తమ కెరీర్ అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్. అయితే ఎ.డి.ఓ కెరీర్‌లో ప్రవేశించిన అభ్యర్ధులు ఎవరైనా ఎదురుగా ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ‘శ్రమకోర్చే తత్వం’ ఉండాలి. ఏదో నాలుగు ఫైళ్ళు రాసేస్తే నా జీతం నాకు ఠంచనుగా వస్తోందిలే అనే ధోరణి వదిలి, నలుగురు దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్‌ను నచ్చచెప్పే విధులకు స్వాగతం పలికితే నిజంగా ఆకాశమే హద్దు... అని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ఇప్పటికే వేలాదిమంది డెవలప్‌మెంటు ఆఫీసర్లు మన కంటికి ఎదురుగానే తిరుగుతూ మనతోనే లక్షలాది రూపాయలు ప్రీమియంలు కట్టిస్తూ దర్జాగా కెరీర్‌లో దూసుకుపోతున్నారు. మరి ఇటువంటి అవకాశం తెలియని వాళ్ళూ ఉన్నారు. తెలిసేసరికి అంతంత మాత్రం ఆదాయంలో చేరిన వృత్తిలో పది, పదిహేనేళ్ళు ప్రయాణంచేసి ఉంటారు. ‘యస్... నాకు అంతులేని సంపదకావాలి? అందరూ నా గురించి చర్చించుకునేలా నా జీవితం ఉండాలని’ కోరుకునే ‘కసి... కృషి’ గల యువతీ యువకులకు ఎ.డి.ఓ.పోస్టులు స్వాగతం పలుకుతున్నాయి.
వృత్తి స్వభావం
ఎల్.ఐ.సి. పాలసీ విక్రయం జరుపటంలో పెద్దన్న పాత్ర పోషించేలా పర్యవేక్షణ బాధ్యతలు గల ఉద్యోగం అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్. ఈయనకు ప్రధానంగా 5 రకాల విధులు ఉంటాయని చెప్పవచ్చు. 1. ఏజెంట్లను నియమించుకోవటం 2. ఏజెంట్లకు పాలసీలు ఆకర్షించేలా శిక్షణ అందించటం 3. తన ఏజెంట్ల నుంచి వచ్చే పాలసీదారులకు అవసరమైన ఎల్.ఐ.సి సేవలు అందించడం. 4. నిర్దేశిత బ్రాంచీ పరిధిలో వీలయినంత వరకు పర్యటిస్తూ అత్యధిక పాలసీలు చేయించటం. 5. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ లేదా ఇతర అంశాలు మీరయితేనే బాగా చెప్పగలరని ఏజెంట్లు కోరినప్పుడు ఎ.డి.ఓ.లు తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఎటు చూసినా ఎల్.ఐ.సి పాలసీ విక్రయం చుట్టూనే తిరిగేలా అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ విధులుంటాయని చెప్పవచ్చు. నిర్దేశిత బ్రాంచీ ఎల్.ఐ.సి కేంద్రంగా అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్లు ఏడాది టార్గెట్లకు సిద్ధమయి ముందుకు పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరు ముందుగా వెళ్తారో, ఎవరు ఎంత త్వరగా పరుగులు పెడ్తారో వారే పాలసీల్లోనే కాదు ఇన్సెంటివ్ తీసుకోవటంలోను ప్రథమస్థానంలో ఉంటారు.
తొలి ఏడాది టార్గెట్
అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయిన అభ్యర్ధులకు 3 నెలలు శిక్షణ ఉంటుంది. 15 రోజులు ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయ పాలసీల, కరస్పాండెన్స్, 45 రోజులు ‘పాలసీ క్రాక్’ చేయటం - ఏజెంట్ల నియామకం, ఇతర అంశాలన్నింటిపై క్లాస్‌రూం శిక్షణ, మిగతా 30 రోజులు ఫీల్డ్ లెవల్ పాలసీ సేల్స్‌పై ‘డోర్ టు డోర్’ ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.. అనంతరం ఎంపికయిన డివిజన్‌లో ఏదేని ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయానికి ఎ.డి.ఓ.ను అటాచ్ చేస్తారు. తొలి ఏడాది లక్ష్యంతో కనీసం 35 మంది ఏజెంట్లను నియమించుకోవాలి. 450 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏజెంట్ల ద్వారా కొత్తగా చేయించాలి. ఈ పాలసీల మొత్తం ప్రీమియం రూ.12 లక్షలు ఉండాలి. ఇక్కడ టార్గెట్‌ను మించి ఎల్.ఐ.సి బిజినెస్‌ను ఇవ్వవచ్చు. ఇంకా ఎల్.ఐ.సి ఏజంట్లను నియమించుకోవచ్చు. ఏడాది టార్గెట్ పూర్తి చేయటం తప్పనిసరి. ఏడాది కాలం తర్వాత అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్‌ను డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా పిలుస్తారు. ప్రతిఏటా తన ఏజెంట్ల చేత లేదా నూతన ఏజెంట్ల చేత నిర్దేశిత మొత్తంలో ఎల్.ఐ.సి పాలసీ బిజినెస్ అందించాల్సి ఉంటుంది.
ప్రారంభ వేతనం
అప్రంటిస్ పీరియడ్‌లో రూ.20 వేల వరకు స్టయిఫండ్‌ను ఎ.డి.ఓ అభ్యర్ధులు పొందవచ్చు. ఈ వ్యవధి దాటగానే ప్రతినెల రూ.23 వేల వరకు వేతనం అందుకుంటారు. ప్రొబేషనరీ డెవలప్ మెంటు ఆఫీసరు వేతన స్కేలు రూ.11,535 - 28,865 , ఇతర అలవెన్సులు డెవలప్‌మెంటు ఆఫీసర్ అభ్యర్ధులు పొందవచ్చు. తొలి రోజులలోనే రుణ సదుపాయంతో టూ వీలర్ వాహనాన్ని అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పొందవచ్చు. బిజినెస్ పెర్ఫామెన్స్‌ను బట్టి అనేక రకాల రుణాలు, సదుపాయాలు ఈ ఉద్యోగ అభ్యర్ధులందరికీ ఎల్.ఐ.సి. సంస్థ సమకూరుస్తోంది.
బ్రాంచీ ఆఫీసర్‌గా అవకాశం!
డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా కెరీర్‌లో రాణిస్తోన్న అభ్యర్ధులు ఆసక్తి ఉంటే నిర్దేశిత విధానంలో ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయాల్లోని వివిధ కేటగిరి ఆఫీసర్ స్థాయిలో చేరవచ్చు. అయితే ఎ.డి.ఓగా కెరీర్ ప్రారంభించిన 100 మంది అభ్యర్ధులలో కేవలం 20 శాతం మంది మాత్రమే బ్రాంచీస్థాయి పోస్టులపై ఆసక్తి చూపుతున్నారు. కానీ 80 శాతం మంది డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా ఏటా వచ్చే బిజినెస్ లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటూ అత్యధిక మొత్తంలో ఇన్సెంటివ్‌లు తీసుకుంటూ అదే డెవలప్‌మెంటు ఆఫీసరుగా కొనసాగుతు న్నారు. ఎల్.ఐ.సి బ్రాంచి పోస్టులవైపు వచ్చే అభ్యర్ధుల పదోన్నతులు ప్రోత్సాహకరంగా ఉంటు న్నాయి. అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ నుంచి డెవలప్‌మెంటు ఆఫీసర్, అసిస్టెంట్ బ్రాంచీ మేనేజర్ బ్రాంచీ మేనేజర్, సీనియర్ బ్రాంచీ మేనేజర్, డివిజనల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి వరకు ఎదగవచ్చు. సీనియర్ డివిజనల్ మేనేజర్లు రెండు జిల్లాల్లోగల ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయాన్నింటికీ ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సౌత్ సెంట్రల్ జోనల్ ఎల్.ఐ.సిలో 315 బ్రాంచీలలో 4 వేల మంది డెవలప్‌మెంటు ఆఫీసర్లు ఎల్.ఐ.సి పాలసీ బిజినెస్ చేస్తున్నారు. పదిమందిలో కలిసిపోయేలా, పది ప్రాంతాలకు వెళ్లడమంటే ఇష్టమైనటువంటి అభ్యర్ధులకు ఈ ఉద్యోగం బ్రహ్మాస్త్రమే !
నోటిఫికేషన్ వచ్చేసింది
613 ఖాళీలతో అప్రంటిస్ డెవలప్ మెంటు ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల యింది. సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ పరిధిలోని 17 డివిజన్లలో 613 ఖాళీలకు ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. ఎంబిఎ మార్కెటింగ్ పిజిడిఇన్ మార్కెటింగ్ అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పిస్తారు. 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు గల అభ్యర్ధులు పోటీపడవచ్చు. రిజర్వేషన్ సదు పాయం గల అభ్యర్ధులకు గరిష్ట వయఃపరిమితిలో సడలింపు ఉంది. ఆన్‌లైన్ పోటీ పరీక్ష , ఇంట ర్వ్యూ ద్వారా అభ్యర్ధులను అప్రంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ పోటీ పరీక్ష 2013, ఫిబ్రవరి 2 మరియు 3 తేదీలలో జరుగనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ 2012, డిసెంబర్ 22. ఇతర వివరాలకై http://www.licindia.in/careers.htm వెబ్‌సైట్‌లో సంప్రదించండి.
ఎల్‌ఐసి విశిష్టతలు
- ఎల్.ఐ.సిలో కేంద్ర ప్రభుత్వం 100% స్టాక్ హోల్డర్.
-ఎల్.ఐ.సి ఆస్తులు రూ.13.25 ట్రిలియన్‌లు
-243 ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రావిడెంట్ సొసైటీలను ఐక్యం చేస్తూ 1956లో ఎల్.ఐ.సి ఏర్పాటయింది.
-ఎల్.ఐ.సి హెడ్‌క్వార్టర్స్ - ముంబాయి
-8 జోనల్ ఆఫీసులు 113 డివిజనల్ ఆఫీసు లతో ఎల్.ఐ.సి దేశమంతటా ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
-3500 సర్వీసింగ్ ఆఫీసులలో 2048 ఎల్‌ఐసి బ్రాంచీలు మిళితమై సేవలు అందిస్తున్నాయి.
-13,37,064 ఎల్.ఐ.సి ఏజెంట్లు, ఎల్.ఐ.సి.కి ఉన్నారు.

0 comments:
Post a Comment