శివసేన అధినేత బాల్‌ఠాక్రే కన్నుమూత
ముంబయి: మహారాష్ట్ర పౌరుల హక్కుల పరిరక్షణ పోరాట యోధుడు, అలుపెరుగని వీరుడు
శివసేన అధినేత బాల్‌ఠాక్రే కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం 3.33 గంటలకు ఆయన
తన స్వగృహం ‘మాతోశ్రీ’లో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు.
ఠాక్రే పూర్తి పేరు బాలసాహెబ్ కేశవ్ ఠాక్రే. గత కొంత కాలంగా ఠాక్రే
శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా గుండె
ఆగిపోయి చనిపోయారని వైద్యులు తెలిపారు. బాల్‌ఠాక్రేకు భార్య మీనా ఠాక్రే,
ముగ్గురు కుమారులు బిందుమాధవ్ ఠాక్రే, జయదేవ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే.
ఠాక్రే
1926, జనవరి 23న మధ్యప్రదేశ్‌లోని బాలఘాట్‌లో జన్మించారు. ముంబయిలోని ‘ద
ఫ్రీ ప్రెస్ జర్నల్’ ఆంగ్ల పత్రికకు కార్టూనిస్టుగా పనిచేస్తూ తన వృత్తి
జీవితాన్ని ప్రారంభించారు. 1960లో సొంత పత్రిక ‘మార్మిక్’ను ప్రారంభించారు.
1989లో మరాఠీ పత్రిక ‘సామ్నా’, హింధీ పత్రిక ‘దుప్హార్‌కా సామ్నా’లను
ప్రారంభించారు. ఠాక్రే తండ్రి సమైక్య మహారాష్ట్ర ఉద్యమ నాయకుడు కేశవ్
సీతారామ్ ఠాక్రే. తన తండ్రి కేశవ్ సీతారామ్ స్ఫూర్తితోనే బాల్‌ఠాక్రే తన
రాజకీయ జీవితాన్ని మలుచుకున్నారు. భూమి పుత్రుల సిద్ధాంతాన్ని ఠాక్రే
ప్రతిపాదించారు. మహారాష్ట్ర మహారాష్ట్రీయులదేనని గట్టిగా నినదించారు.
వలసవాదులతో మహారాష్ట్రీయులకు అన్యాయం జరుగుతుందని ఆయన విశ్వసించేవారు.
మహారాష్ట్రను
భాషాప్రయుక్త రాష్ట్రంగా నిర్మించాలనేది ఠాక్రే లక్షం. జర్మన్ నియంత
అడాల్ఫ్ హిట్లర్‌ను ఆయన అమితంగా అభిమానించేవారు. 1966 జూన్ 19న ఆయన
‘శివసేన’ను స్థాపించారు. తన పార్టీకి ఛత్రపతి శివాజీ సైన్యం అని అర్థం
వచ్చేలా ‘శివసేన’ అని నామకరణం చేశారు. ఆపార్టీ కార్యకర్తలకు శివ సైనికులుగా
పేరు పెట్టిన ఘనత ఠాక్రేది. 1960-70ల రాజకీయ పార్టీలతో పొత్తులు
కుదుర్చుకున్నారు. మన సంస్కక్షుతికి వ్యతిరేకమైన ‘వాలంటైన్స్ డే’ను
జరుపుకోరాదని పిలుపునిచ్చారు.
విదేశీ సంస్కక్షుతిని అడ్డుకోవాలని
శివసైనికులకు పిలుపునిచ్చారు. 1995లో ఠాక్రే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా కృషి చేశారు. 1996లో ఆయనకు సతీవియోగం
సంభవించింది. మీనా ఠాక్రే గుండెపోటుతో స్వర్గస్థులైనారు. పెద్ద కుమారుడు
బిందు మాధవ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడ్డారు.
0 comments:
Post a Comment