16రీళ్ల తెలుగు సినీమాయ!
కోస్తా మిగులు సంపద సృష్టించిన కోట్లు
గతం వైభవం.. నేడు దిగజారుడే నైజం
కొన్ని సామాజికవర్గాలదే ‘డైరెక్షన్’
కొందరు తెరపైనే కథానాయకులు.. వేషం తీస్తే ఫక్తు వ్యాపారవేత్తలు.. కబ్జాకోరులు
రాజధానిలో వందల ఎకరాలు స్వాహా
స్టూడియోల పేరుతో భూములు కట్ చేస్తే మల్టీప్లెక్సుల వ్యాపారాలు
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వంనమస్తే తెలంగాణ
రీళ్ల డబ్బాల్లోకి కోస్తా సంస్కృతి..అదే రాష్ట్ర సంస్కృతిగా ‘షాట్’
మద్రాస్ నుంచి తరలి వచ్చి.. తెలంగాణ నడిబొడ్డున పాగావేసిన సీమాంధ్ర సినీ పెద్దలు.. తెలుగు సినిమా రంగాన్ని దిగజార్చిన తీరుపై.. హైదరాబాద్‌ను గుప్పిటపట్టిన వైనంపై.. తెర అసలు స్వరూపాలపై నమస్తే తెలంగాణ సంధిస్తున్న అక్షర శస్త్రాలు.. రేపటి నుంచి..
నిన్న మొన్నటి సినిమా అంటే.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి!ఇది పదహారు రీళ్ల తెలుగు సినీమాయా ప్రపంచం! పుష్కలంగా పారే నీళ్లతో మూడు పంటలూ పండగా పేరుకున్న మిగులు సొమ్ముతో కామందులు ఆక్రమించిన కళా సామ్రాజ్యం!! నలుపు-తెలుపు కాలం నుంచి.. సప్తవర్ణాల దాకా..! మూకీ.. టాకీల నుంచి.. డాల్బీ డిజిటల్ సరౌండ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌ల దాకా! పౌరాణికాల నుంచి జానపదాలకు ఎదిగి.. సాంఘిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ.. అభ్యుదయాన్ని కాంక్షించి.. విప్లవనాదాలు చేసి.. ఫక్తు వ్యాపార ధోరణికి జారి.. బూతును, ఆడపడుచు అర్ధ నగ్న అందాలను వెండితెరపై అమ్మకానికి పెట్టే దిగజారుడు స్థాయికి పడిపోతున్న నాలుగు ఆటల.. మూడు గంటల దందా! మాఫియా, మత్తుమందుల వ్యాపారాలతో ఇప్పుడు మరింత పాతాళంలోకి! కళను నమ్ముకున్న కొందరు దర్శక నిర్మాతలు.. వారు తీసిన కొన్ని ప్రగతిశీల సినిమాలకు మినహాయింపు! ఎక్కువ మందికి సినిమా పెట్టిన పెట్టుబడికి..
అంతకు రెట్టింపు.. వీలైతే పదింతలు సంపాదించుకునే యావే! అందుకే వారికేమీ పట్టవు! సమాజం పట్ల కొరవడిన బాధ్యత.. ఉపాధ్యాయులంటే హాస్యగాళ్లు.. పురోహితులంటే అర్భకులు.. సామాజిక వర్గాలంటే చులకన భావం.. బడుగు జీవులంటే అవహేళన.. అస్తిత్వ ఉద్యమాలంటే ఎక్కడలేని అలుసు! మద్రాస్ నుంచి వస్తూ.. అనేక రాయితీలు తెచ్చుకుని, చట్టాలు మార్పించేసుకుని, హైదరాబాద్‌లో మకాం వేశారు! అంతా ఒక ప్రాంతం వారే! వారు తీసిందే సినిమా.. వారు చూపిందే బొమ్మ! రాష్ట్రం మొత్తం చూసే సినిమా! కానీ.. ఒక ప్రాంతంలో ఒకటిండు సామాజికవర్గ కుటుంబాల భావనలే కథాంశాలు! ఒకే ఒక్కడు.. హీరో! ఎక్కడో కోనసీమ పల్లెల నుంచి వచ్చి.. వంద మందిని ఒకేసారి మట్టికరిపించేస్తాడు! ఒకప్పుడు పాత్రల్లో జీవించేవారు.. ఇప్పుడు నటించడం మానేశారు! గొంతు బాగాలేకపోతే.. డబ్బింగ్.. ఫేస్‌లో హీరో చార్మ్ లేకుంటే ప్లాసిక్ సర్జరీ! అంతా బ్లూస్క్రీన్ మాయ! నాటి తారలు మృదు మధుర శృంగారభావనలను హావభావాలతో ఒలికిస్తే.. నేడు ఒక్కటే సూత్రం ఎక్స్‌పోజింగ్! ఒకప్పుడు సినిమారంగం అంటే కళాపోషణ! ఇప్పుడు ‘కళ’ తప్పి.. పోషణే మిగిలింది! ఆ పోషణ కుటుంబం గడిచేందుకు కాదు.. తరతరాలు గడించకపోయినా.. ఇబ్బంది లేకుండా! నిన్న మొన్నటి సినిమా అంటే..
ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి! స్థానిక డిస్ట్రిబ్యూటర్లు.. దుకాణాలు మూసేసుకోవాల్సిందే! థియేటర్లు రాసిచ్చేయాల్సిందే! కార్మిక నాయకుడిగా కదనరంగాన దూకిన కథానాయకులు..
వేషం తీసేస్తే ఇక్కడ కబ్జాకోరులు! తెరపై హీరోయిన్‌కు కన్నుగీటి.. ప్రేమను బకెట్ల కొద్దీ కురిపించే హీరోలు.. తెర వెనుక కాసుల లెక్కల్లో మునిగితేలుతుంటారు! మానవతావాదాన్ని చాటే మహానటులు.. నిజ జీవితంలో నటులే! హీరోయిన్ బొడ్డు అందంగా చూపడంపై ఎంత శ్రద్ధ పెడతారో.. నగరం నడిబొడ్డున భూములు కొట్టేయడానికీ అంతే తపన! రీళ్ల డబ్బాలు కురిపించిన నోట్ల కట్టలతో జూబ్లీ.. బంజారా గుట్టలను భక్షించి.. మయసభలు కట్టుకున్న సినీమాంవూతికులు! ఇప్పుడు ఆ గుట్టల పరిరక్షణే ధ్యేయం! అందుకే అస్తిత్వ ఉద్యమాలంటే వారికి అసహ్యం.. ఉద్యమాలు విజయం సాధిస్తే తాము కట్టుకున్న కోటలు ఎక్కడ కూలిపోతాయోనని! తెలంగాణ జీవనశైలి అంటే అదేదో పరాయి దేశపుదన్న ఆలోచన! తెలంగాణ యాస అంటే రౌడీలు గూండాలు, అనాగరికులు, లేబరోళ్లు మాట్లాడే భాషగా నిర్ణయం.. ఈ ప్రాంతంలో ఉండేది వారేనని ఒక తీర్మానం! కోస్తా జిల్లాల సంస్కృతే రాష్ట్ర సంస్కృతిగా చిత్రీకరణ.. ఒకటి కాదు.. వంద కాదు.. వేల రీళ్లు తిరిగినా ఇదే దృశ్యం! ఇడ్లీ సాంబారు ప్రస్తావనలే తప్ప.. జొన్న రొట్టెలు, అంబలి కనిపించవు! పండుగల్లోనూ అదే తీరు! ఒకానొక కాలంలో సంక్రాంతి పండుగ ప్రస్తావన లేని సినిమాల్లేవంటే ఆశ్చర్యమే! ఇప్పటికీ అదే తీరు! రాష్ట్రంలో సగభాగం ఎంతో గొప్పగా జరుపుకొనే బతుకమ్మ పండుగ పేరే ఇటీవలి కాలంవరకూ రాష్ట్రంలోని ఏ సినిమా హాల్‌లోనూ వినిపించలేదంటే తెలంగాణపై ఏ స్థాయిలో ఉందో వివక్ష! జమీందారు అకృత్యాలపై హీరో పోరాటాలే తప్ప.. రజాకార్లపై తెలంగాణ రైతులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు వెండితెర వేల్పులకు కనిపించలేదు. ఇక వామపక్ష అభ్యుదయ, విప్లవ భావజాలాలను ఏం చేస్తారు? తీసే సినిమాల్లోనూ వాస్తవాల వక్రీకరణలు..
ఒక ప్రాంతంపై దూషణభాషణలు! అదే సొంత ప్రాంతమైతే.. పాత్రలకు అత్యున్నత శిఖరాలు! అందుకే వారికి కొమురం భీమ్ పోరాటం కనిపించదు! మన్యంవీరుడెవరంటే అల్లూరి సీతారామరాజే! నటశేఖరుడు చెప్పాడుగా మరి! ఖాకీ నిక్కరు చొక్కా వేసుకుని.. యోగిలా జీవితం గడుపుతూ గిరిజనులను ఏకం చేసిన అల్లూరి సీతారామరాజు.. కాషాయ వస్త్రాలతో.. విల్లంబులతో వెండితెరపై కొత్త.. నాగరిక ముద్ర వేసుకుంటాడు! కొమురం భీం సినిమా విడుదలకు ఏళ్లు పడుతుంది.. నైజాం నవాబును గడగడలాడించిన కొమురం భీం మన్యంవీరుడంటే వాళ్ల మనసు నచ్చదు! ఆ యోధుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే మళ్లీ ఆ ప్రాంతపువాడే తలపెట్టాలి! జీవన శైలిలోనూ అదే తీరు. ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు..అంటూ భార్యాభర్తలు సాగునీటి కాల్వల నుంచి నీళ్లు చేదుతున్న పాటల దృశ్యాలే! ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి.. ఎన్నడూ మెతుకెరుగని తెలంగాణ రైతు కష్టాన్ని పాట సినిమా కథలో తేవాలంటే మళ్లీ తెలంగాణ కలమే రావాలి! ఇప్పుడు పైత్యం మరింత ముదిరింది. మొన్నటిదాకా తెలంగాణపై పరోక్షంగా విషం కక్కిన దర్శకాక్షిగేసరులు.. ఇక నేరుగా యుద్ధం చేస్తున్నారు. తెలంగాణవాదంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నారు.. కెమెరామెన్ గంగతో రాంబాబు ఒక ఉదాహరణ మాత్రమే! సినిమా ఒకనాడు వినోదం, కళ.. తదుపరి వినోదం, అభ్యుదయం.. కొన్నాళ్లకు వినోదం, వ్యాపారం..కాలం గడిచే కొద్దీ ఆస్తుల సేకరణ.. ఇప్పుడు ఆస్తుల రక్షణ! తెలుగు సినిమా పరివర్తనా క్రమమిది!
- T News
0 comments:
Post a Comment