స్వామిగౌడ్ నాకు కుడి భుజం: కేసీఆర్
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఇవాళ కొత్తగా చేరిన కొత్త గులాబీ టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఉద్యమంలో స్వామిగౌడ్ తనతో వెన్నంటి ఉన్నారని, తనకు కుడి భుజంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికలకు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా కూడా స్వామిగౌడ్‌ను ఆహ్వానిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. స్వామిగౌడ్‌ది రాజీ పడని మనస్తత్వం అని అన్నారు. స్వామిగౌడ్‌కు ఉద్యమాభివందనాలు తెలుపుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. స్వామిగౌడ్ నేతృత్వంలో జరిగిన సకల జనుల సమ్మె ఒక అపూర్వ ఘట్టమని కేసీఆర్ పేర్కొన్నారు.
0 comments:
Post a Comment