మెగా విస్తరణ
22 మంది ప్రమాణం
17 కొత్త ముఖాలే
పలువురికి పదోన్నతులు
మంత్రివర్గంలో చేరని రాహుల్
ముగిసిన పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రప్రదేశ్‌కే అగ్రతాంబూలం
చిరంజీవికి స్వతంత్ర సహాయ హోదా
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి,
బలరాంనాయక్, సర్వేలకు చోటు
పల్లంరాజుకు ప్రమోషన్.. పురంధేశ్వరి శాఖ మార్పు
పెట్రోలియం నుంచి సైన్స్‌కు జైపాల్‌రెడ్డి
వీరప్పమొయిలీకి పెట్రోలియం
సల్మాన్ ఖుర్షీద్‌కు విదేశాంగశాఖ
బన్సల్‌కు పట్టణాభివృద్ధితోపాటు
పార్లమెంటరీ వ్యవహారాలు
న్యూఢిల్లీ,
అక్టోబర్ 28: చాలాకాలంగా నలుగుతున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
పూర్తయింది. కొత్తగా 22 మందిని చేర్చుకుంటూ, పలువురి శాఖలను మారుస్తూ
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆదివారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణను
ముగించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి
ప్రణబ్‌ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్షికమానికి ఉప
రాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్
అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష నేత
సుష్మాస్వరాజ్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న
నేపథ్యంలో ఇవే చివరి మార్పులు చేర్పులు కావచ్చని భావిస్తున్నారు. ఆదివారం
మొత్తం 22 మంది ప్రమాణం స్వీకరించగా, వీరిలో 17 మంది మంత్రిపదవి చేపట్టడం
ఇదే తొలిసారి. మార్పులు చేర్పుల అనంతరం కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య
78కి పెరిగింది. ప్రభుత్వం విధానపరంగా చలనరహితంగా మారిందని, అవినీతిమయమై
పోయిందని ఆరోపణలు వెల్లు నేపథ్యంలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో యువతకు
అవకాశం కల్పించారు. కొందరి శాఖలు మార్చారు. సహాయ మంత్రులు కొందరికి
కేబినెట్, స్వతంత్ర హోదా కల్పించి పదోన్నతులు కల్పించారు. ఇంకొందరి అదనపు
శాఖలను తొలగించారు. ఈసారి మార్పుల్లో ఆంధ్రవూపదేశ్‌కే ప్రాధాన్యం
లభించింది. కొత్తగా ఐదుగురికి అవకాశం కల్పించారు. కే చిరంజీవికి స్వతంత్ర
సహాయ మంత్రి హోదా (పర్యాటకం) లభించింది. కోట్ల సూర్యవూపకాశ్‌డ్డి (రైల్వే),
కిల్లి కృపారాణి (కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ), పోరిక
బలరాంనాయక్ (సామాజిక న్యాయం, సాధికారత), సర్వే సత్యనారాయణ (రోడ్డు రవాణా,
హైవే) లకు సహాయమంవూతులయ్యారు. పల్లంరాజుకు ప్రమోషన్ లభించింది. ఇప్పటిదాకా
రక్షణశాఖ సహాయమంవూతిగా ఉన్న ఆయనకు మానవ వనరుల అభివృద్ధి శాఖతో కేబినెట్
హోదా కల్పించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పురంధేశ్వరిని
వాణిజ్య, పరిక్షిశమల శాఖకు మార్చారు. ఇప్పటిదాకా కీలకమైన పెట్రోలియం శాఖను
నిర్వహిస్తున్న ఎస్ జైపాల్‌డ్డికి సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖను
కేటాయించారు. పెట్రోలియం, సహజవాయు శాఖను వీరప్పమొయిలీకి అప్పగించారు.
మొత్తంగా మరిన్ని ఆర్థిక సంస్కరణలకు అనుకూలంగా ఉన్నవారే మన్మోహన్ కీలక
బృందంలో భాగమయ్యారు.
ప్రధానమంవూతికి చాలా సన్నిహితంగా భావించే
విదేశాంగశాఖను సల్మాన్ ఖుర్షీద్‌కు కట్టబెట్టారు. అవినీతి ఆరోపణలు
ఎదుర్కొంటున్న ఆయనను న్యాయశాఖ నుంచి విదేశీ వ్యవహారాల శాఖకు మార్చడం
పదోన్నతిగానే భావించవచ్చు. ముఖ్యమైన న్యాయశాఖను అశ్వనికుమార్‌కు
అప్పగించారు. ఖుర్షీద్ అదనంగా నిర్వహించిన మైనారిటీ వ్యవహారాల శాఖను
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, కర్ణాటక ముఖ్య నేత కే రహ్మాన్‌ఖాన్
చేపట్టారు. జలవనరులశాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్‌ను రైల్వేశాఖకు మార్చారు.
గనుల మంత్రిత్వశాఖలో సహాయమంవూతిగా ఉన్న దిన్‌షా పటేల్‌కు కేబినెట్ హోదా
కల్పించారు. కపిల్‌సిబల్ ప్రాముఖ్యాన్ని కూడా తగ్గించారు. మానవ వనరుల
అభివృద్ధి శాఖను మినహాయించి, ఆయనను కమ్యూనికేషన్లు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ
మంత్రిగా పరిమితం చేశారు. మరింత ఉన్నతస్థాయి శాఖలు కావాలనుకున్న గులాంనబీ
ఆజాద్ కోరికను పట్టించుకోలేదు. ఈసారి పునర్వ్యవస్థీకరణలో కొత్తవారిని,
యువతను చేర్చుకోవడం ముఖ్యాంశమయింది. మొత్తం 22 మందిలో ఆంధ్రవూపదేశ్,
పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర
మంత్రివర్గంలో చేరుతారని ఎంతోకాలంగా ఊహిస్తున్న రాహుల్‌గాంధీ ఈసారీ
దూరంగానే ఉండిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు ఎక్కువ
ప్రాముఖ్యమివ్వాలనుకుంటున్నారని, తన విజ్ఞప్తికి స్పందించలేదని
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా అదనపు బాధ్యతలు
నిర్వహిస్తున్నవారి శాఖలను ప్రధాని ఈసారి వేరేవారికి బదలాయించారు. తృణమూల్
కాంగ్రెస్ మంత్రుల నిష్క్రమణ, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతి, తాజాగా కొందరు
మంత్రుల రాజీనామాల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీచేశారు. రాహుల్‌గాంధీకి
సన్నిహితులుగా భావించే ముగ్గురు సహాయమంవూతులకు స్వతంత్ర హోదా కల్పించారు.
జ్యోతిరాదిత్య సింధియాకు విద్యుత్‌శాఖను, సచిన్ పైలట్‌కు కార్పొరేట్
వ్యవహారాలను అప్పగించారు. ఇప్పటివరకు ఈ శాఖలను వీరప్పమొయిలీ కేబినెట్
హోదాలో నిర్వహించారు. జితేంవూదసింగ్‌కు యువజన, క్రీడల వ్యవహారాలు
కేటాయించారు. ఇప్పటిదాకా అంబికాసోనీ నిర్వహించిన సమాచార, ప్రసారశాఖ
స్వతంత్ర సహాయమంత్రి పదవి మనీష్‌తివారీకి లభించింది. ఇదివరలో ఐపీఎల్
వివాదంతో విదేశాంగశాఖ సహాయమంత్రి పదవి నుంచి వైదొలగిన శశిథరూర్ తాజాగా మానవ
వనరుల సహాయమంత్రి అయ్యారు. పవన్‌కుమార్ బన్సల్ నుంచి పార్లమెంటరీ
వ్యవహారాలను కమల్‌నాథ్‌కు అప్పగించారు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా
కూడా కొనసాగుతారు.
కేబినెట్ మంత్రులు
కే రహ్మాన్ ఖాన్, దిన్‌షా పటేల్,
అజయ్ మాకెన్ , పల్లం రాజు , అశ్విని కుమార్, హరీష్ రావత్, చంద్రేశ్ కటౌచ్
సహాయ మంత్రులు
మనీష్ తివారీ, సర్వే సత్యనారాయణ,
శశిథరూర్, కొడికున్నిల్ సురేష్
సహాయ మంత్రులు
పొరిక బలరాం నాయక్
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
కిల్లి కృపారాణి
తారిఖ్ అన్వర్
అధిర్ రంజన్ చౌదరి
ఏహెచ్ ఖాన్ చౌదరి
నినాంగ్ ఇరింగ్
రానీ నారా
లాల్‌చంద్ కటారియా
దీపాదాస్‌మున్షీ
0 comments:
Post a Comment