మూడు వ్యక్తిత్వాల కలయిక
సినీ రంగంలో మూడు దశాబ్దాల జైత్రయాత్ర.. సామాజిక సేవారంగంలో తనదైన పాత్ర
పాలిటిక్స్‌లో మెరిసిన రాజకీయ ధీరుడు.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం సాగిందిలా..
ఆడాడు..
ఆడించాడు..! పాడాడు.. పాడించాడు..! నవ్వాడు.. నవ్వించాడు..! నడిచాడు...
నడిపించాడు! ఆయన వేసిందే డాన్స్.. ఆయన చేసిందే స్టంట్! సూపర్‌స్టార్
కృష్ణలా పదునుగా డైలాగ్‌లు చెప్పగల స్వరం.. నటరత్న ఎన్టీఆర్‌లా హావభావాలు
ఒలికించగల కౌశలం.. నట సామ్రాట్ ఏఎన్నార్‌ను మరిపించేలా స్టెప్పులు వేసే
తుంటరితనం! అంతెందుకు.. నవరసాలనూ తన నటన ద్వారా వెండితెరపై చిలకరించగల
అరుదైన నటుడాయన! చంటబ్బాయ్.. ఇంద్ర.. ఆపద్భాందవుడు.. స్వయం కృషి.. ఠాగూర్..
గ్యాంగ్ లీడర్.. హిట్లర్.. ఆరాధన.. అభిలాష.. మంచు పల్లకీ.. జగదేక వీరుడు
అతిలోక సుందరి!! సినిమా ఏదైనా.. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగిపోవడమే తెలిసిన
అతికొద్ది మంది నటుల్లో ఒకరు! భిన్నమైన పాత్రలను విభిన్నంగా పోషించిన
దిట్ట! మూడు దశాబ్దాల విజయవంతమైన సినీజీవితంలో అశేష ప్రజాభిమానం సొంతం
చేసుకుని.. సామాజిక సేవారంగంలో విశిష్ఠపాత్ర పోషిస్తూ.. రాజకీయాల్లోకి
అడుగుపెట్టి.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతమై.. ఇప్పుడు కేంద్ర
మంత్రిగా మరో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు! విజయానికి మారుపేరుగా
నిలిచాడు! సినిమా.. సామాజిక సేవ.. రాజకీయం!! మూడు రంగాల్లోనూ ఎగసిన కెరటం!
ఒకే మనిషిలో ముగ్గురు మొనగాళ్లను నింపుకున్న వ్యక్తిత్వం! ఆ వ్యక్తిత్వం
పేరే... చి..రం..జీ..వి..!
చిరంజీవి అసలు పేరు శివ శంకర వరవూపసాద్.
నర్సాపురం సమీపంలోని చిన్న పల్లెటూరైన మొగల్తూరులో 1955 ఆగస్ట్ 22 న
జన్మించారు. ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివిన చిరంజీవి.. నర్సాపురంలోని
వైఎన్‌ఆర్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. తర్వాత సినిమాల్లో చేరాలని
భావించినప్పుడు ఆయన తండ్రి ముందు చదువుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఉభయతార
కం అన్నట్లు మద్రాస్ వెళ్లి ఐసీడబ్ల్యూ కోర్సులో చేరిన చిరంజీవి..
సమాంతరంగా నటనలో శిక్షణ పొందారు. 1976లో ఆయన మద్రాస్ ఫిలిం
ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. పునాదిరాళ్లు సినిమాలో దర్శకుడు రాజ్‌కుమార్
అవకాశం ఇవ్వడంతో మొదటిసారి చిరంజీవి మొఖానికి రంగు వేసుకున్నారు. ఆ నిర్మాత
క్రాంతికుమార్ కే వాసు దర్శకత్వంలోని ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం ఇ
చ్చారు. తొలి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ.. ప్రాణం ఖరీ దు మొదట
విడుదలైన సినిమా. తొలి సినిమాకు ఆయనకు లభించింది వెయ్యి నూటపదహార్లు.
కుటుంబంలో ఆంజేయస్వామిని పూజించేవారు. దాంతో స్క్రీన్‌నేమ్‌గా తల్లి సలహా
మేరకు చిరంజీవి అని పెట్టుకున్నారు. తెలుగు సినిమాలే కాకుండా పలు తమి ళ,
కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. 149సినిమాల్లో నటించిన
చిరంజీవి.. అనేక విభిన్నమైన పాత్రలను పోషించారు. తొలుత చిన్న చిన్న
క్యారెక్టర్లు, విలన్ పాత్రలు వేసిన చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ఖైదీ
సినిమా పూర్తిగా మార్చివేసింది.
చిరంజీవి
ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది.
సుప్రీం హీరోగా మొదలైన ఆయ న ప్రస్థానం.. మెగాస్టార్‌కు చేరుకుంది. చిరంజీవి
సినిమాల్లోకి వచ్చేసరికే ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు
వంటి దిగ్గజాలు యూత్ కారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో సైతం తన
సత్తా నిరూపించుకున్నాడు చిరంజీవి. వారందరి ఉత్తమ మేళవింపుగా తెలుగు సినీ
రంగానికి అందివచ్చాడు. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు కమల్‌హాసన్. మాస్
స్టైల్ కింగ్ రజనీకాంత్.. ఆ ఇద్దరినీ తనలో నింపుకున్న నటుడని సీనియర్
దర్శకుడు కే బాలచందర్ చేసిన వ్యాఖ్య చిరంజీవి నటనా చాతుర్యానికి నిదర్శనంగా
నిలిచిపోతుంది. ఫిలింఫేర్ మ్యాగజీన్ చిరంజీవిని ఉద్దేశించి.. బిగ్గర్ దేన్
బచ్చన్ అని సంబోధించినా.. ది వీక్ మ్యాగజైన్ ఆయనను న్యూ మనీ మిషన్ అని
అభివర్ణించినా.. అది ఆయన ప్రజాదరణనే చాటుతుంది.
1980లో అల్లు
రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవికి వివాహం జరిగింది. అప్పటికి
చిరంజీవి చేసిన సినిమాలు 11 మాత్రమే. మనవూరి పాండవులు సినిమా షూటింగ్
సందర్భంగా చిరంజీవిని చూసిన అల్లు.. అప్పుడే ఆయనను అల్లుడిగా చేసుకోవాలని
నిర్ణయించుకున్నారట. వీరి వివాహానికి ఎన్టీరామారావు ముఖ్య అతిథిగా వచ్చారు.
వీరికి కుమ్తాలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్‌చరణ్ తేజ ఉన్నారు. రాంచరణ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ ముఖ్యమైన హీరోగా ఎదుగుతున్నాడు. చిరంజీవి సోదరులు
నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా సినీరంగంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఇం
డస్ట్రీలో అత్యధిక పరిహారం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.
బాపూ
దర్శకత్వంలో రూపొందిన మనవూరి పాండవులు చిత్రంతో చిరంజీవికి గుర్తింపు
వచ్చింది. ఐ లవ్ యూ, ఇది కథ కాదు, 47 రోజులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ
వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. 1979లో ఎనిమిది సినిమాలు చేసిన
చిరంజీవి.. మ రుసటి సంవత్సరం 14 సినిమాలు చేశారు. 1981లో న్యాయం కావాలి
సినిమాలో విలన్ పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇంట్లో రామయ్య, వీధిలో
కృష్ణయ్య, అభిలాష వంటి సినిమాలతో మళ్లీ కథానాయకుడిగా తెరపైకి వచ్చారు.
ఇంట్లో రామయ్య, వీధి లో కృష్ణయ్య సినిమా ప్రేక్షకాదరణ పొందింది. 1982లో కే
విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన శుభలేఖ చిత్రానికిగాను చిరంజీవికి ఫిలిం
ఫేర్ అవార్డు లభించింది. 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవి సినీ ప్రస్థానం
దిశను మార్చివేసింది. సిల్వెస్టర్ స్టల్లోన్ హీరోగా వచ్చిన హాలీవుడ్ సినిమా
ఫస్ట్ బ్లడ్ సినిమా ఆధారంగా తీసిన ఖైదీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్
అయింది. చిరంజీవికి యాక్షన్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. 1983 చివరి
నాటికి ఆయన చేసిన సినిమాలు 60కి చేరుకున్నాయి.
ఆ తర్వాత మూడేళ్ల కాలంలో
క్రమక్షికమంగా అగ్రహీరోగా ఎదిగాడు చిరంజీవి. అందు కు మంత్రిగారి
వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, చాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ,
కొండవీటి రాజా, రాక్షసుడు, దొంగ మొగుడు వంటి సినిమాలు ఇందుకు దోహదం చేశాయి.
విజేత సినిమా కోసం 1985లో ఆయన తన మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
1987లో పసివాడి ప్రాణం సినిమా హిట్ తో చిరంజీవి స్టార్‌డమ్ అందుకున్నారు. ఈ
సినిమాతో కొత్త నృత్య ఒరవడి ‘బ్రేక్ డ్యాన్స్’ను చిరంజీవి చేశారు. ఈ తరహా
డ్యాన్స్‌కు ఆయన పెట్టింది పేరుగా మారారు. అంతకుముందే దొంగ సినిమా కోసం
మైఖేల్ జాక్సన్ ఆల్బం థ్రిల్లర్‌లోని నృత్యాన్ని చేశారు. అది ప్రేక్షకుల్లో
నాటుకుపోయింది. 1987లో స్వయం కృషి సినిమాకు గాను ఆయన తొలిసారి ఉత్తమ
నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటికే స్టార్‌డమ్ అందుకున్న సుప్రీం
యాక్షన్ హీరోగా ఉన్న చిరంజీవి ఒక లోప్రొఫైల్ పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా
బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడం విశేషం. తాను ఎలాం టి పాత్రనైనా
చేయగలనని ఈ సినిమా ద్వారా చిరంజీవి నిరూపించుకున్నారు.
ఖైదీ తర్వాత
అయన అనేక హిట్లు కొట్టారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్
786, స్టేట్‌రౌడీ, కొండవీటి దొంగ, కొదమసింహం, రాజా విక్రమార్క,
గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు వంటి భారీ హిట్లు నమోదు చేశారు. పది కోట్లకు
మించిన రెవెన్యూ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఘరానా మొగుడు రికార్డు
సృష్టించింది. శ్రీదేవితో జతకట్టిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా
అద్భుతమైన సోషియోఫాంటసీ సినిమాగా నిలిచిపోయిం ది. చిరంజీవి సినిమాల్లో
ఒకానొక అత్యుత్తమమైన సినిమాగా ఇప్పటికీ చెక్కుచెదరని స్థానం పొందింది.
చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసేనాటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులకు
విపరీతమైన ప్రజాదరణ ఉండేది. ఆ సమయంలో చిరంజీవి తనదైన శైలిలో స్టెప్పులు
వేయడం, మునుపు చూడని పద్ధతుల్లో సాహసోపేతమైన స్టంట్స్ చేయడం ఆయనకు క్రమేణా
అగ్రస్థానం కల్పించింది. సంఘర్షణ చిత్రం షూటింగ్ సమయంలో క్లైమాక్స్
సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా చిరంజీవి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ వెళ్లి
శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంటిగుట్టు సినిమాలో ట్యూబ్‌లైట్
పట్టుకుని పోరాడే సమయంలో కూడా గాయపడ్డారు. దొంగ సినిమాలో 11అంతస్తుల భవనం
గోడపై నిలబడి చేసిన పోరాట సన్నివేశాలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తాయి.
బావగారు బాగున్నారా చిత్రం కోసం ఒక టీనేజ్ పిల్లాడి మాదిరిగా బంగీజంప్
చేసి.. సాహసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు ఆయన
తెలుగు సినీరంగంపై ఏకఛవూతాధిపత్యం వహించారనడంలో సందేహం లేదు. చిరంజీవి సహ
నిర్మాతగా రూపొందిన రుద్రవీణ చిత్రం జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డు
అందుకుంది.
అవార్డులు కోకొల్లలు
చిరంజీవికి అవార్డులు
కోకొల్లలు. తెలుగులో ఏ సినీ హీరోకూ లభించని స్థాయిలో పది ఫిలింఫేర్
అవార్డులు ఆయనను వరించాయి. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన
పద్మభూషణ్ అవార్డు ఆయనకు దక్కింది. 2006లో ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ
డాక్టరేట్‌తో సత్కరించింది.
ప్రతిఘటన సినిమాకు రీమేక్‌గా హిందీలో
ప్రతిబంధ్ (1990) ద్వారా హిందీలోనూ విజయం సాధించారు చిరంజీవి. ఆజ్‌కా
గూండారాజ్ (గ్యాంగ్‌లీడర్), జెంటిల్మన్ సినిమాలతో బాలీవుడ్‌లోనూ తనకు
అభిమానం ఉందని రుజు వు చేసుకున్నారు. ఆపద్భాంధవుడు సినిమాలో నటనకు గాను
ఆయనకు రెండో సారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించింది. 1990వ దశకంలో
కొన్ని అపజయాలు ఎదురైనా.. తిరిగి నిలదొక్కుకున్న చిరంజీవి.. 1997లో
హిట్లర్‌తో తెలుగు సినీ రంగానికి రారాజు తానేనని నిరూపించుకున్నారు.
మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం వంటి సినిమాలు ఆయన
నటనా కౌశలాన్ని చాటాయి. 1999లో హాలీవుడ్‌లో కూడా చిరంజీవి అడుగుపె ది
రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమా సెట్లపైకి వెళ్లినా.. తెలియని
కారణాలతో నిలిచిపోయింది.
చిరంజీవి కొత్త దశాబ్దం అన్నయ్య సినిమాతో
పునఃవూపారంభమైంది. ఈ సినిమా సూపర్‌హిట్ కొట్టింది. 2002లో వచ్చిన ఇంద్ర
సినిమా అప్పటికి ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడోసారి ఉత్తమ
నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. సామాజిక కోణంలో వచ్చిన ఈ సినిమా
తర్వాత ఇదే కోణంలో ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, స్టాలిన్ వంటి సినిమాలు
చిరంజీవి స్థానం ఎవరూ కదల్చలేనిదని నిరూపించాయి. తెలుగు సినిమా
వజ్రోత్సవాల్లో ఆయనకు ‘లెజెండ్’ పురస్కారం అందజేసి.. తెలుగు సినీ పరిక్షిశమ
తనను తాను గౌరవించుకుంది. పెద్ద సినిమా కుటుంబ నేపథ్యం, గాడ్‌ఫాదర్‌లు
లేకుండానే చిరంజీవి సాధించిన విజయాలు.. నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో ఒక హీరో
అలా ఎదగడాన్ని కనీసం ఊహించలేం.
- T News
0 comments:
Post a Comment