12 మంది కొత్త ముఖాలు
-మొత్తం ఏడుగురు మంత్రుల రాజీనామా
-ఎస్‌ఎం కృష్ణ బాటలో సోనీ, వాస్నిక్, సహాయ్, ఖండేలా, అగాథా, విన్సెంట్ పాలా..
-రాజీనామాలు ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్
-ఆనంద్ శర్మకు విదేశాంగ శాఖ!
-పెట్రోలియం నుంచి జైపాల్‌డ్డి ఔట్.. మానవ వనరుల శాఖకు మార్చే అవకాశం
-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్‌గాంధీ?
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. భారీస్థాయిలో మంత్రిమండలి ప్రక్షాళనకు తెరలేచింది. పాతవారి నిష్క్రమణ..కొత్తవారి ఆగమనంతో మన్మోహన్ కేబినెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. యూపీఏ కేబినెట్ నుంచి ఏడుగురు మంత్రులు తప్పుకోగా, మరో 12 మంది కొత్తవారు చేరనున్నారు. 12 మంది సహాయ మంత్రులకు పదోన్నతి లభించనుంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కేంద్ర మంత్రులైన అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సుబోధ్‌కాంత్ సహాయ్, సహాయ మంత్రులైన మహాదేవ్ ఖండేలా, అగాథా సంగ్మా, విన్సెంట్ పాలా శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య ఏడుకు చేరుకుంది.
తాజా మార్పులలో జైపాల్‌డ్డిని పెట్రోలియం శాఖ నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చవచ్చునని భావిస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ ఆనంద్‌శర్మ లేదా సల్మాన్‌ఖుర్షీద్‌కు దక్కవచ్చునని చెబుతున్నారు. రాష్ట్ర ఎంపీ పురంధేశ్వరికి పదోన్నతి కల్పించి వాణిజ్య శాఖను ఇవ్వనున్నారని, రాహుల్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించవచ్చునని చెబుతున్నారు.
0 comments:
Post a Comment