మెడికల్ సీట్ల కుట్ర
- సీమాంవూధకు అదనంగా 150 సీట్లు.. తెలంగాణకు సున్నాయే
- 250 సీట్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కటీ తేలేదు
- అధికారుల నిర్లక్ష్యంతో రాని వరంగల్, గాంధీ సీట్లు
- కనీస సౌకర్యాలు లేవని ఉస్మానియా సీట్లు కట్
- అవిలేకున్నా సీమాంధ్ర కాలేజీలకు సీట్లు
- మెడికల్ సీట్ల విషయంలో కొనసాగుతున్న వివక్ష
హైదరాబాద్, జూలై 1 (): ఇది మరో దగా.. తెలంగాణ పట్ల సీమాంధ్ర అధికారులు, వారితో కలిసిపోయే ప్రభుత్వాల తీరును బట్టబయలు చేసే మరో సందర్భం. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఈ సంవత్సరం మెడికల్ సీట్ల విషయంలో కూడా తెలంగాణకు వివక్షే ఎదురైంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్ల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తులు పంపిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీమాంవూధకే సీట్లు తెప్పించే బాధ్యతను తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గుంటూరు, అనంతపురం కాలేజీల నివేదికలను ఎంసీఐకి పంపలేదు. ఎనిమిది కాలేజీల నివేదికలనే పంపారు. వాటిల్లో తెలంగాణ నుంచి గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీల నివేదికలు కూడా ఉన్నాయి. ఎంసీఐ పరిశీలన బృందం ఇన్‌స్పెక్షన్‌కు వచ్చినప్పుడు దాదాపు ఏ కాలేజీలోనూ కనీస మౌలిక సదుపాయాలు లేవని, భవనాలు, ల్యాబ్‌లు, రేడియాలజీ యూనిట్లు, తాగునీరు, బాత్‌రూంలు సరిగ్గా లేవని రాష్ట్రానికి లేఖ రాసింది.
ఆ లేఖలో విశాఖపట్నం కాలేజీకి సీట్లు ఇచ్చేందుకు ఓకే కానీ, ఈ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను మెడికల్ అండ్ హెల్త్ సెక్రెటరీ బాధ్యత తీసుకుంటే ఇస్తామని మెలి క పెట్టింది. ఇందుకు ప్రతి లేఖ ఇవ్వడంతో విశాఖపట్నం కాలేజీకి సీట్లు దక్కాయి. ఇక విజయవాడ, కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలకు కూడా 50సీట్ల చొప్పున దక్కాయి. మొత్తంగా సీమాంవూధలోని మూడు కాలేజీలకు అదనంగా 150 సీట్లుదక్కాయి. అదే తెలంగాణ విషయానికొస్తే ఉస్మానియా కాలేజీలో తాగునీరు, కరెంటువైర్లు బయటకు కనిపిస్తున్నాయనే సాకును చూపి సీట్లు ఇవ్వలేదు. ఇక గాంధీలో ఓపీ తక్కువ ఉందనే కారణంతో అసలు ఇన్‌స్పెక్షనే చేయలేదు. ఇక వరంగల్ కాలేజీ విషయానికొస్తే ఇక్కడ పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ కాలేజీ రిపోర్టునే సరైన సమయానికి డీఎంఈకి ఇవ్వలేకపోయారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ కాలేజీకి కూడా ఎంసీఐ బృందం పరిశీలనకు వెళ్లలేదు. అంటే తెలంగాణలోని మూడు కాలేజీలకు సీట్లు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం, సీమాంధ్ర అధికారుల కుట్ర ఉందని తెలుస్తోంది.
నిజామాబాద్ కాలేజీకి స్టాఫ్‌ను కేటాయించి, భవనాలు త్వరగా పూర్తిచేసి ఉంటే ఈ ఏడాది వంద సీట్లతో కాలేజీ ప్రారంభమయ్యేది. కానీ అధికారులు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఈ కాలేజీ 2010లో ప్రారంభమైన ఇప్పటికీ సీట్లు తెచ్చుకోలేకపోతోంది. ఇలా తెలంగాణకు రావాల్సిన 250సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి వైద్య రంగంలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలొస్తున్నాయి.
సౌకర్యాలు లేకున్నా సీమాంవూధకు సీట్లు
తెలంగాణలో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో తాగునీరు, బాత్‌రూం, ల్యాబ్‌లలో రిపేర్లు సాకుగా చూపి 50సీట్లు రాకుండా పోయాయి. అదే సీమాంవూధలోని విజయవాడ మెడికల్ కాలేజీలో రేడియాలజీ, రూరల్ హెల్త్ సెంటర్ భవనం, మరికొన్ని సౌకర్యాలు లేకపోయానా ఎంసీఐ సీట్లు మంజూరు చేసింది. దీని వెనుక సీమాంధ్ర అధికారులు కుట్ర ఉందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియాలో చిన్నచిన్న సమస్యలుంటే సీట్లు ఇవ్వరుగానీ, సీమాంవూధలో మాత్రం భవనాలు, డిపార్ట్‌మెంట్లు లేకపోయినా సీట్లు ఎలా ఇస్తారనే మౌలిక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ఇది స్టేట్‌వైడ్ కాలేజీ కనుక సీట్లు మూడు ప్రాంతాలకు సమానంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ కాలేజీలో లేని సౌకర్యాలు బయటకు చెబితే ఉన్న సీట్లు పోతాయని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రాంతానికి నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన సీట్లను పక్కన పెట్టి 30సీట్లు మాత్రమే ఇందులో ఇస్తున్నారు.

Take By: T News
0 comments:
Post a Comment