రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా -ప్రణబ్
నేనిప్పుడు కాంగ్రెస్ వ్యక్తిని కాదు.. అందరివాడిని
- రాష్ట్రపతి ఎన్నికలో ‘అద్భుతం’పై విశ్వాసం లేదు
- మజ్లిస్ నేతలు మా మిత్రులు.. వారిని సంప్రతిస్తా
- పదవికే వన్నె తెచ్చిన దక్షిణాది రాష్ట్రపతులు
- వారి అడుగు జాడల్లోనే నడుస్తా
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- అనంతరం విలేకరులతో భేటీ
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం
- ఆయన దృష్టిలో పడేందుకు నేతల తంటాలు
- దానం, బండ చంద్రాడ్డి మధ్య వాగ్వాదం
ప్రణబ్‌కు తప్పని తెలంగాణ సెగ ఓయూలో దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్, జూలై 1( రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు ఎవరికీ మద్దతునివ్వని పార్టీలు తనకు మద్దతు ప్రకటించి, గెలిపించాలని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు మిగతా పార్టీలు కూడా తనకు మద్దతు తెలియజేస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఎన్‌డీయే అభ్యర్థి పీఏ సంగ్మా చేసిన వ్యాఖ్యలపై ప్రణబ్ స్పందిస్తూ అలాంటి అద్భుతాలు జరుగుతాయని తాను విశ్వసించడం లేదని అన్నారు. ఆదివారం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశం అనంతరం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా గతంలో తాను చాలాసార్లు హైదరాబాద్‌కు వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడానని, తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని ప్రణబ్ చెప్పారు. ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించేందుకు గతంలో తాను ఇక్కడికి వచ్చానని, ఇప్పుడు ఆ పాలసీల గురించి చెప్పలేనని అన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాడని, పార్టీ, ప్రభుత్వ విధానాల గురించి తాను ఇప్పుడు మాట్లాడలేనని ఆయన స్పష్టంచేశారు. అయితే కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏవైనా తన వద్దకు వస్తే వాటిపై మాత్రం మాట్లాడగలనని ఆయన చెప్పారు.
ఈ నెల 15 వరకు ప్రచారం
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజ్ జాబితాలోని సభ్యులను కలిసేందుకు తాను శనివారం చెన్నై నుంచి తన ప్రచారం ప్రారంభించానని ప్రణబ్ తెలిపారు. అయితే దీన్ని తాను ప్రచారం అనుకోవడం లేదని అన్నారు. ఆంధ్రవూపదేశ్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు. తన ప్రచారం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తనకు మద్దతు ఇస్తున్న ఎలక్షిక్టోరల్ జాబితా సభ్యులను కలువనున్నట్లు ఆయన తెలిపారు. మజ్లిస్ నేతలను కలుస్తారా? అన్న ప్రశ్నకు వాళ్లు మా మిత్రులు, వాళ్ళతో కూడా సంప్రతింపులు జరుపుతానని ప్రణబ్ స్పష్టంచేశారు. మద్దతు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రంలోని టీఆర్‌స్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ అధ్యక్షులను కూడా కలుస్తారా? అని అడిగితే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయమై పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదని, పైగా తాను ఎలక్షిక్టోరల్ జాబితాలోని సభ్యులతో మాత్రమే మాట్లాడుతానని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఆయా పార్టీలే నిర్ణయం తీసుకుంటాయని, ఈ సంప్రదాయం 1952 నుంచి వస్తున్నదని ఆయన తెలియజేస్తూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇంకా తనకు మద్దతు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోలేదని అన్నారు. యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు యూపీయేతర పార్టీలు, అధికార కూటమికి వ్యతిరేక పార్టీలు ఇంకా మద్దతు విషయంలో తమ తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు.
సమన్వయపర్చేందుకు వచ్చా: ఆజాద్
అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలకు తాను పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నందునే పార్టీ సభ్యులను సమన్వయపర్చేందుకు ప్రణబ్‌తోకలిసి వచ్చినటు తెలిపారు.
కాంగ్రెస్‌లో ప్రతిభకు కొదవ లేదు: ప్రణబ్
బెంగళూరు: రాష్ట్రపతి పదవికి పోటీచేస్తూ.. తాను రాజకీయాల నుంచి తప్పుకోనుండటంవల్ల సంక్షోభ పరిష్కార విషయంలో అధికార యూపీఏ సర్కారుకు ఎలాంటి సమస్యా రాబోదని రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మెరుగైన ప్రతిభావంతులకు కొదవ లేదని, తన స్థానాన్ని వారు భర్తీ చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రజావూపతినిధులతో ఆయన ఆదివారమిక్కడ భేటీ అయ్యారు.
రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా: ప్రణబ్
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం
రాష్ట్రపతి ఎన్నికలో తనని గెలిపిస్తే.. ఆ పదవికి వన్నె తెస్తానని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌లో సంక్షోభ పరిష్కర్తగా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 46 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి, గౌరవాన్ని పొందినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యుడిగా కాకుండా రాష్ట్రపతి అభ్యర్థిగా నగరానికి వచ్చినట్లు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చెప్పారు. గతంలో తాను పార్టీ ప్రతినిధిగా ఇక్కడ సమస్యలు పరిష్కరించేందుకు వచ్చేవాడినని, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు కోసం మీ ముందుకు వచ్చానని ప్రణబ్ అన్నారు.
తాను ఇప్పుడు పార్టీ వ్యక్తిని కాదని, అందరి మనిషినని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న ప్రణబ్, గులాం నబీ ఆజాద్‌తో కలిసి ఆదివారం ఉదయం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్షం(సీఎల్పీ) సమావేశంలో పాల్గొన్నారు. తనను గెలిపించాలని ఆయన సీఎల్పీ సభ్యులను కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన సుమారు గంటకుపైగా జూబ్లీహాల్‌లో ఉండి సీఎల్పీ సభ్యులను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా ఆయన కోరారు. ఈ సందర్భంగా సీఎల్పీని ఉద్దేశించి 25 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కువసేపు భారత రాజ్యాంగం, విధానాల గురించే మాట్లాడటం గమనార్హం.
దక్షిణాది నుంచి నీలం సంజీవడ్డి, ఆర్ వెంకవూటామన్, వీవీ గిరి, రాజగోపాలచారి, సర్వేపల్లి రాధకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం.. ఇలా ఎంతోమంది రాష్ట్రపతులుగా పనిచేశారని, వీరంతా ఉన్నత సంప్రదాయాలు, పద్ధతులను పాటిస్తూ ఆ పదవికి, దేశానికి ఎంతో మంచిపేరు తీసుకొచ్చారని వివరించారు. వారి అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని ప్రణబ్ దక్షిణాది సెంటిమెంట్‌తో సభ్యుల మనసు దోచే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎన్నుకున్నందుకు యూపీఏకు, మరీ ముఖ్యంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. యూపీయేతర పార్టీలు కూడా తనకు మద్దతు ఇస్తున్నందుకు ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అలాంటి పార్టీలు కూడా తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని మద్దతు పలకాలని ఆయన తృణముల్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.
దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు ఎంతో కీలకమైనవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం కిరణ్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఓటు వేసి గెలిపించాలని సీఎల్పీ సభ్యులను కోరారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్షికమానికి అధ్యక్షత వహించగా, శాసన సభ వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో యూపీఏ ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు.
Take By: T News
0 comments:
Post a Comment