అసమ్మతి మధ్య.. లోక్‌పాల్ ముసాయిదా ఆమోదం
-స్థాయీ సంఘం నివేదికపై16 మంది సభ్యుల వ్యతిరేకత
-కాంగ్రెస్ ఎంపీల నుంచీ వ్యతిరేకత
-రేపు పార్లమెంటుకు లోక్‌పాల్ బిల్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సభ్యుల అభ్యంతరాల మధ్య పార్లమెంటరీ స్థాయీ సంఘం లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను బుధవారం ఆమోదించింది. స్థాయీ సంఘం రూపొందించిన లోక్‌పాల్ ముసాయిదాపై సభ్యుల్లో ఏకాభివూపాయం కొరవడింది. 30 మంది సభ్యుల స్థాయీ సంఘంలో 16 మంది సభ్యులు ముసాయిదాపై అసమ్మతి వ్యక్తం చేశారు. బిల్లు నివేదికతో పాటు వారు తమ అసమ్మతి పత్రాలను అందజేశారు. లోక్‌పాల్ ముసాయిదాను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సభ్యుల్లో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉండటం అధికార పార్టీకి ఝలక్ ఇచింది. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి సన్నిహితుడైన మధ్యవూపదేశ్ ఎంపీ మందసౌర్ మీనాక్షి నటరాజన్ లోక్‌పాల్ పరిధిలోకి గ్రూప్ సీ ఉద్యోగులు, కేంద్ర విజిపూన్స్ కమిషన్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. నటరాజన్ డిమాండ్‌కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పీటీ థామస్, దీపా దాస్‌మున్షి మద్దతు పలికారు. సభ్యుల అభ్యంతరాలపై స్థాయీ సంఘం చైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ ‘సభ్యులు వ్యక్తిగతంగా తమ అభివూపాయాలు వ్యక్తం చేయవచ్చు.
వారి అభివూపాయాలను పరిగణనలోకి తీసుకుంటాం’ అని అన్నారు. కొన్ని అంశాలపై మాత్రమే సభ్యుల్లో అభ్యంతరాలు ఉన్నాయి కానీ, మొత్తం నివేదిక మీద కాదని ఆయన స్పష్టం చేశారు. లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐను తీసుకురావాలని అన్నా హజారే బృందం గట్టిగా పట్టుబడుతున్నా, స్థాయీ సంఘం సీబీఐను బిల్లు పరిధికి ఆవల ఉంచినట్లు తెలుస్తోంది. లోక్‌పాల్ అదుపాజ్ఞల్లో పనిచేయడానికి సీబీఐ కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు.
ప్రస్తుత వ్యవస్థను దెబ్బతీసేలా.. సిఫారసులా?: అన్నా బృందం
పార్లమెంటరీ స్థాయీ సంఘం రూపొందించిన లోక్‌పాల్ ముసాయిదాపై సామాజిక ఉద్యమనేత అన్నా హజారే బృందం భగ్గుమంది. స్థాయీ సంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి పార్లమెంటు అంటే గౌరవం లేదని, అందుకే కిందిస్థాయీ పరిపాలన వ్యవస్థ, సిటిజన్ చార్టర్‌లను లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న పార్లమెంటు తీర్మానానికి వ్యతిరేకంగా ముసాయిదా రూపొందించారని మండిపడింది. అన్నా హజారే దీక్ష విరమణ సందర్భంగా పార్లమెంటు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Lokpal,
0 comments:
Post a Comment