ఎఫ్‌డీఐలపై పీఛేముడ్
-మెట్టుదిగిన యూపీఏ ప్రభుత్వం-అందరి సమ్మతి వచ్చాకే నిర్ణయం
-లోక్‌సభలో ప్రణబ్‌ముఖర్జీ ప్రకటన
-స్వాగతించిన ప్రతిపక్షాలు
-ప్రజాభీష్ఠానికి తలొగ్గడం ఓటమికాదు
-ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్య
-పారిక్షిశామికవర్గాల్లో నిరుత్సాహం
-హర్షం వ్యక్తం చేసిన వ్యాపారులు
-ఇక సజావుగా పార్లమెంటు
ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం తోకముడించింది. పార్లమెంటులో ప్రతిపక్షాల పోరాటానికి ఫలితం దక్కింది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని కేంద్రం బుధవారం నాడు తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది. ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చేంతవరకూ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు తొలుత అఖిలపక్ష భేటీలో, అనంతరం లోక్‌సభలో ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ రాజ్యసభలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు ముక్తకం స్వాగతించాయి. ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గి ఉండాలన్న ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్.. అలా తలొగ్గడం ఓడిపోయినట్లు కాదని అన్నారు. ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎఫ్‌డీఐలను తీవ్రంగా వ్యతిరేకించిన యూపీఏ భాగస్వామ్య పక్షాలు తృణమూల్‌కాంక్షిగెస్, డీఎంకే హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంపై పారిక్షిశామికవర్గాలు నిరుత్సాహం ప్రకటించగా.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ , డిసెంబర్ 7:చిల్లర వర్తకంలోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనపై కేంద్రవూపభుత్వం తోకముడిచింది. స్వపక్ష, విపక్షాల వ్యతిరేకతకు తోడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు ప్రభుత్వం వెనక్కితగ్గింది. బుధవారం అఖిలపక్షభేటి అనంతరం...ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చే వరకూ నిలిపివేస్తున్నట్లుగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రణబ్‌ముఖర్జీ అధికారికంగా ప్రటించారు. రాజ్యసభలోనూ వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ ఇదే ప్రకటన చేశారు. బుధవారం ఉదయం జరిగిన అఖిలపక్షభేటిలో చిల్లర రంగంలో 51శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నట్టు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనిని ప్రతిపక్షాలు ముక్తకం స్వాగతించాయి. అనంతరం ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఈ విషయాన్ని లోక్‌సభలో అధికారికంగా ప్రకటించారు. ఎఫ్‌డీఐలను స్వాగతించాలన్న నిర్ణయాన్ని అమలుచేయడానికి ముందు ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంవూతులు, చిల్లరవర్తకులను, రైతులను కూడా సంప్రదించనున్నట్టు ప్రణబ్ వివరించారు.
ఆ విధంగా ఒక ఏకాభివూపాయం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో ఒక ముఖ్యమైన వివాదానికి తెరపడినటె్టైందని యూపిఏ భాగస్వామ్య పక్షాలైన తృణముల్, డీఎంకేలు హర్షం వ్యక్తం చేశాయి. ఇకనైనా సభ సజావుగా సాగుతుందని ఆశాభావన్ని వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా వాణిజ్యరాజధాని ముంబాయిలో రిటెలర్‌లు ప్రభుత్వ నిర్ణయంతో ఆనోందత్సవాలు జరుపుకున్నారు. పార్లమెంట్‌లో తొమ్మిదిరోజులుగా ఊపిరి సలుపవ్వని ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రభుత్వం, ఈ నిర్ణయంతో కొంత ఉపశమనం పొందినటె్టైంది. తదనంతరం ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఎస్పీ ,వామపక్షాలు పలు వాయిదాతీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, స్పీకర్ మీరాకుమార్ వాటిని తిరస్కరించడంతో బీఎస్పీకి చెందిన సభ్యులు అసంతృప్తితో సభనుండి వాకౌట్ చేశారు. ఈ విధంగా సభ శీతాకాల సమావేశాల్లో తొలిసారి ప్రశ్నోత్తరాల సమయంలోకి ప్రవేశించింది.
స్వాగతిస్తున్నాం: సుష్మ
ప్రభుత్వం తీసుకున్న ఎఫ్‌డీఐల నిలుపుదల నిర్ణయాన్ని పార్లమెంట్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మస్వరాజ్ స్వాగతించారు. ‘‘ప్రజాభీష్టానికి ప్రభుత్వం తలొగ్గి ఉండాలని.. అట్లా తలొగ్గడం ఓడిపోయినట్టు కాదని’’ ఆమె గుర్తుచేశారు. ప్రజాభివూపాయాన్ని విన్నందుకు ప్రభుత్వానికి, ముఖర్జీకి ఈ సందర్భంగా సుష్మా ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ప్రజాస్వామిక శక్తుల విజయంగా ఆమె అభివర్ణించారు. అన్ని పక్షాలను సంప్రదించి ఒక కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
పూర్తిగా వెనక్కి తీసుకోవాలి:సీతారాం ఏచూరి
ఎఫ్‌డీఐల ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సీపిఎం డిమాండ్ చేస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ఎఫ్‌డీఐల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి. వారి అభివూపాయాలను తప్పకుండా పరిగణించాలని అన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం తలొగ్గేలా ఒత్తిడి తీసుకురాగలిగాము. ఈ విషయంలో ఏకాభివూపాయం ఏ విధంగానూ కుదరదని తేల్చిచెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఈ ఘనత సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నదని, కానీ తమ పార్టీ 2004 నుండే ఈ పెట్టుబడులను అడ్డుకుంటున్నామన్నారు. అలాగే వ్యవసాయంలో ఫ్యూచర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. పెట్రోలు ధరలను తగ్గించడంతో పాటు గోదాముల్లో నిలువ ఉన్న ఆహారధాన్యాలను విడుదల చేసి, ధరలను అదుపు చేయాలన్నారు.
ఎఫ్‌డీఐలు కావాల్సిందే : కావూరి
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలను స్వాగతించాలని, దేశవూపజలు అదే కోరుకుంటున్నారని ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ పండ్లు కూరగాయల నిల్వకోసం కోల్ట్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలంటే లక్షకోట్లరూపాయలు అవసరమని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏ నిర్ణయమైన తీసుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఒక్క పార్టీకి చెందినది మాత్రమే కాదని, ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తృణముల్, డీఎంకెల అభివూపాయాన్ని కూడా పరిగ స్తుందని అన్నారు.
Take By: T News
Tags: Telangana News, Hyderabad, Telangana, Lok Sabha, News, FDI in retail, foreign investment, retail sector, Indian economy,
Tags: Telangana News, Hyderabad, Telangana, Lok Sabha, News, FDI in retail, foreign investment, retail sector, Indian economy,
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)

























0 comments:
Post a Comment