సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన సెహ్వాగ్
ఇండోర్ : ఇండోర్ వన్డేలో భారత కెప్టెన్ వీరెంద్ర సెహ్వాగ్ వీర వీహరం చేస్తున్నాడు. హోల్కర్ స్టేడియంలో వెస్టీండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఆటగాడు వీరెంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేశారు. సెహ్వాగ్ 140 బంతుల్లో 201 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 23 ఫోర్లు, 6 సిక్స్‌లతో సెహ్వాగ్ చెలరేగాడు. సచిన్ 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్స్‌లతో 200 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 24, 2010లో గ్వాలియర్‌లో సచిన్ డబుల్ సెంచరీ చేశాడు.
Tags: Hyderabad, News, Sport News, Virender Sehawag,
0 comments:
Post a Comment