ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు
- పారిక్షిశామికవేత్తల భేటీలో సీఎం కిరణ్
- వచ్చే నాలుగేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు
- డిసెంబర్‌లో ప్రధాని చేతుల మీదుగా
- లక్షమందికి నియామక పవూతాలు
హైదరాబాద్, నవంబర్ 21(): రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలిపారు. రాజీవ్ యువకిరణాల్లో భాగంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో 15లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం అమలుపై సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో సీఎం పలువురు పారిక్షిశామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు సచివాలయంలో రాజీవ్ విద్యా ఉపాధి కల్పనా మండలి (రీక్యాప్) మొదటి సమావేశం జరిగింది. చదువుకునే సమయంలోనే ఉపాధికల్పనకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. డిసెంబర్‌లో లక్ష మందికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేతులమీదుగా నియామకపవూతాలు అందజేస్తామని ప్రకటించారు. జనాభాలో 70 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పారిక్షిశామికవేత్తలను కోరారు.
రాజీవ్ యువకిరణాలు పథకాన్ని స్వాగతించిన పారిక్షిశామికవేత్తలు తమ పూర్తి సహకారాన్ని అందజేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనకు విభాగాల వారీగా ప్రభుత్వానికి, పారిక్షిశామికవేత్తలకు మధ్య సమావేశాలు జరిగితే కచ్చితమైన అవగాహన ఏర్పడుతుందని వారు అభివూపాయపడ్డారు. పరిక్షిశమ అవసరాలకు తగ్గట్లు అభ్యర్థులకు అవసరమైన శిక్షణను ఇచ్చేలా ఐటీఐ, పాలిటెక్నిక్‌లలలో మార్పులు జరగాలన్నారు. ఈ సమావేశంలో జీఎంఆర్, జీవీఆర్, ఇన్ఫోసిస్8లాంటి అగ్రసంస్థలతో పాటు వివిధ రంగాలకు చెందిన 50 కంపెనీల యజమానులు పాల్గొన్నారు. తమకు అత్యవసరంగా 20వేల మంది ఉద్యోగుల అవసరముందని వస్త్రవ్యాపారులు తెలుపగా, రాజీవ్ యువ కిరణాల కింద లక్షకుపైన ఉద్యోగాలిస్తామని ఫార్మా రంగం ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతాడ్డి, రఘువీరాడ్డి, సునీతాలక్ష్మాడ్డి, మహీధర్‌డ్డి, వట్టివసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, రాజీవ్ యువకిరణాలు సీఈఓ కేసీడ్డిలతో పాటు వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News ryk, ryk.cgg.gov.in
0 comments:
Post a Comment