టార్గెట్ చిదంబరం
- రాజీనామా చేసేవరకు మాట్లాడనివ్వం
- సభలోనూ బాయ్‌కాట్ చేస్తాం
- వామపక్షాలతో పరస్పర సహకారం
- ఎన్డీయే కూటమి నిర్ణయం
- పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై
- అద్వానీ నివాసంలో మిత్రపక్ష నేతల భేటీ
- సభను అడ్డుకోవడానికే బీజేపీ ఎత్తులు: కాంగ్రెస్
- నేటి నుంచి శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ, నవంబర్ 21:కేంద్ర హోంమంత్రి చిదంబరంను లక్ష్యంగా చేసుకొని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ముప్పేటదాడి చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నిర్ణయించింది. 2జీ కుంభకోణంలో చిదంబరాన్ని బాధ్యుణ్ని చేస్తూ, ఆయన రాజీనామాకు పట్టుబట్టనుంది. సభలో చిదంబరాన్ని మాట్లాడనివ్వవద్దని, ఆయనను బాయ్‌కాట్ చేయాలని నిశ్చయించింది. 2జీ కుంభకోణం జరిగినప్పుడు ఆర్థికమంవూతిగా ఉన్న చిదంబరం రాజీనామా చేయాల్సిందేనని, ఆయన రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించేవరకు ఆయనను బాయ్‌కాట్ చేస్తామని ఎన్డీయే స్పష్టం చేసింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతల భేటీ జరిగింది. శరద్‌యాదవ్, మనోహర్ జోషి, అనంత్ గీతే, నరేశ్ గుజ్రాల్, శివానంద తీవారి, బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితర నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2జీ కుంభకోణంలో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పు వాయిదా వేసిన నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించింది. ‘2జీ కుంభకోణంలో రాజాకు సమానంగా చిదంబరానికి బాధ్యత ఉంది. ప్రధాని రాజా రాజీనామాను ఆమోదించారు. కానీ చిదంబరం రాజీనామాను మాత్రం కోరడం లేదు.
చిదంబరం రాజీనామాను ఆమోదించేవరకు పార్లమెంటులో ఆయనను బాయ్‌కాట్ చేస్తాం. ఆయనను మాట్లాడనీవ్వం’ అని రాజ్యసభ ప్రతిపక్ష ఉప సభా నాయకుడు ఎస్‌ఎస్ అహ్లూవాలియా తెలిపారు. గతంలో జార్జ్ ఫెర్నాండెజ్ విషయంలో కాంగ్రెస్ ఇదే తరహాలో నిరసన తెలిపింది. తెహెల్కా వెలుగులోకి తెచ్చిన నకిలీ ఆయుధ ఒప్పందాలపై ఓ కమిషన్ విచారణ జరుపుతుండగానే, వాజ్‌పేయ్ కేబినెట్‌లోకి ఆయనను తిరిగి రక్షణ శాఖ మంత్రిగా తీసుకోవడాన్ని నిరసిస్తూ.. ఫెర్నాండెజ్ సభలో మాట్లాడటానికి లేచిన ప్రతీసారి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇప్పుడు అదే నిరసనన ఎన్డీయే పునరావృతం చేయనుంది. చిదంబరం మాట్లాడటప్పుడు వాకౌట్ చేయకుండా, ఆయననుమాట్లాడనివ్వమని అహ్లూవాలియా స్పష్టం చేశారు. నల్లధనం, ధరల పెరుగుదల అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాల విషయంలో వామపక్షాలు, ఎన్డీయే నేతలు పరస్పరం సహకరించుకుంటాయని బీజేపీ నేతలు తెలిపారు. ‘సభలో ప్రవేశపెట్టబోయే తీర్మానాల గురించి ఇరువురం చర్చించకొని, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాం. తీర్మానాలపై విపక్షాలు ఉమ్మడిగా తమ వాదాన్ని వినిపించనున్నాయి’ అని అహ్లూవాలియా స్పష్టం చేశారు. అయితే ఎన్డీయే-వామపక్షాల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం గురించి తమకు తెలియదని సీపీఎం చెబుతోంది. ఈ విషయంలో బీజేపీ నేతలకు సీపీఐ నేత గురుదాస్‌గుప్తా హామీ ఇచ్చారని, వామపక్షాలు పెట్టబోయే ధరల పెరుగుదల తీర్మానానికి బీజేపీ మద్దతివ్వడం సాధారణ విషయంగానే చూస్తున్నామని తెలిపింది. గ్రామీణ భారతానికి సంబంధించిన అంశాలను సభలో లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది.
ఆంధ్రవూపదేశ్, మహారాష్ట్రలలో పత్తి రైతుల ఆత్మహత్య, ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, ధాన్యం సేకరణ సరిగ్గా చేపట్టకపోవడంతో వరి రైతుల దుస్థితి తదితర అంశాలను ఎన్డీయే సభలో లేవనెత్తనుంది. పౌర అణు బాధ్య త చట్టంలో తెచ్చిన కొత్త నిబంధనల అంశాన్ని కూడా ప్రస్తావించనున్నామని, పార్లమెంటు విశ్వాసం తీసుకోకుండానే తెచ్చిన కొత్త నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల అంశాన్ని లేవనెత్తునున్నామని వెల్లడించింది. అంతుకుముందు అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక వర్గం భేటీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో అధికార యూపీఏ సర్కారును పలు అంశాలపై ఎండగ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
కాంగ్రెస్ ఎదురుదాడి
చిదంబరాన్ని లక్ష్యంగా చేసుకోవాలన్న ఎన్డీయే నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్డీయే ఈ ఎత్తులు వేస్తోందని ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అగ్ర నేతలు సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సభలో ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని, సభ సజావుగా సాగేందుకు, ముఖ్యమైన బిల్లులు ప్రభుత్వం ఆమోదించేలా సహకరించాలని సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్ బన్సల్ విపక్షాలను కోరారు.
0 comments:
Post a Comment