సీమాంధ్ర సర్కారు నిర్బంధకాండ ఇది చీకటి రోజు: కేసీఆర్
కోదండరాంతోపాటు జేఏసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుతంగా బస్సు యాత్రను నిర్వహిస్తున్న జేఏసీ నాయకులను అరెస్టు చేసిన ఈ రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు.
సింగరేణి నిషిద్ధ ప్రాంతమా?
జేఏసీ సింగరేణి ‘బస్సుయావూత’పై కత్తులు.. ఉద్యమ విచ్ఛిన్నానికి కుట్రలు
సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రల మీద కుట్రలు పన్నుతున్న సీమాంధ్ర సర్కారు.. సింగరేణి కార్మికులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న జేఏసీ నేతల బస్సుయావూతతో ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని భావించి దుస్సాహసానికి పూనుకుంది. వారిని అరెస్టు చేసి ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నించింది. ప్రజాబలం ముందు సర్కారు కుట్రలు సాగలేదు. తెలంగాణ కన్నెర్ర జేయడంలో తోకముడిచింది. ప్రజాందోళనలకు జడిసిన సర్కారు అరెస్టు చేసిన నేతలను సాయంవూతానికి సొంత పూచీకత్తుపై విడుదల చేసింది. సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి కార్మికులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం జేఏసీ నేతలు రెండు బృందాలుగా ‘బస్సుయావూత’గా బయలుదేరగా.. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా ఎమ్మెల్సీ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రావ్, న్యూడెమొక్షికసీ నేత సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ హెచ్‌ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్‌ను పెంబర్తి వద్ద పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, న్యూ డెమొక్షికసీ నేత గోవర్ధన్‌తో కూడిన మరొక బృందం గోదావరిఖని బయలుదేరగా సిరిసిల్లలో వారిని అరెస్టు చేశారు. వీరి అరెస్టులపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అరెస్టు చేసిన నేతలను సాయంవూతానికి విడుదల చేసింది.
ఆలేరు టౌన్/ రూరల్, సిరిసిల్ల, అక్టోబర్ 9 :కోదండరాం నేతృత్వంలోని బృందం వరంగల్ మీదుగా కొత్తగూడెం వెళ్తుండగా.. వరంగల్, నల్లగొండ జిల్లా సరిహద్దులోని పెంబర్తికి కిలోమీటరు దూరంలోని కందిగట్టతండా వద్ద మధ్యాహ్నం వారిని అడ్డగించిన డీఎస్పీ నాగరాజు నేతృత్వంలోని పోలీసులు నేతలను అరెస్టు చేసి ఆలేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రొఫెసర్ కోదండరాం సహా ఎమ్మెల్సీ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రావ్, న్యూడెమొక్షికసీ నేత సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ హెచ్‌ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులపై పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పెంబర్తి వద్ద జనగామ డీఎస్పీ నాగరాజు, చేర్యాల, సీఐ, జనగాం రూరల్ సీఐ, పాలకుర్తి ఎసై్స తమతమ బలగాలతో మోహరించారు.
రెండు డీసీఎంల నిండా కేం్ర బలగాలు, డిస్ట్రిక్ట్ గార్డ్సు వారితో ఉన్నారు. కోదండరాం వాహనం ఆలేరు దాటిందన్న సమాచారం తెలుసుకున్న జనగాం డీఎస్పీ కొంతమంది సిబ్బందిని గుట్టుచప్పుడు కాకుండా కందిగట్టతండాకు తీసుకు అక్కడ కోదండరాం బృందాన్ని అరెస్టు చేసి ఆలేరుకు తరలించారు. మరోవైపు, గోదావరి ఖని బయలుదేరిన నాయిని నర్సింహాడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, గోవర్ధన్ తదితరులను కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెళ్ల క్రాస్‌రోడ్డు వద్ద వేములవాడ సీఐ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సిరిసిల్ల మీదుగా ఎల్లాడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా.. తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. దీంతో నాయిని బృందాన్ని సిరిసిల్ల ఠాణాలోనే ఉంచారు. అరెస్టు సమాచారం తెలుసుకున్న తెలంగాణ వాదులు, న్యాయవాదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుని పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు.
దద్దరిల్లిన ఆలేరు
కోదండరాం బృందం అరెస్టు విషయం మీడియాకు తెలియకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అటు ఆలేరులో ఉన్నవాళ్లకు కానీ, ఇటు పెంబర్తి దగ్గర జేఏసీ నేతలకు స్వాగతం పలికేందుకు వేచి చూస్త్తున్నవారికిగానీ అరెస్టు వార్త తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతలో అరెస్టు వార్త క్షణాల్లో తెలిసిపోయింది. దీంతో పెంబర్తి దగ్గర ఉన్న జేఏసీ శ్రేణులు ఒక్కసారిగా ఆలేరు వైపు పరుగులు తీశాయి. అదేసమయంలో ఆలేరులో ఉన్న ఉద్యమకారులకు సమాచారం అందించాయి. అంతే మెరుపువేగంతో ఆలేరులో తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున రాస్తారోకోకు దిగారు. ఒకదశలో కోదండరాంను తాము అరెస్టు చేయలేదనీ, ఒకవేళ చేసినా వారిని భువనగిరికి తీసుకెళ్లారని రాస్తారోకో చేస్తున్న వారిని తప్పుదారి పట్టించేందుకు పోలీసులు యత్నించారు. పోలీసుల పాచిక పారలేదు. తెలంగాణవాదులు ఆలేరు రైల్వే గేటు దగ్గర నాలుగు గంటల పాటు రాస్తారోకోకు దిగారు. పోలీసు వాహనాలను అడ్డుకున్నారు.
వరంగల్‌లో నిరసనల హోరు
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను అరెస్టు చేశారని తెలుసుకున్న తెలంగాణ వాదులు వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోడ్లమీదకు వచ్చారు. జనగాం, లింగాలఘనపురం, హన్మకొండ చౌరస్తా, కాళోజీ సెంటర్, మహబూబాబాద్, ములుగు, నర్సంపేట ఇలా దాదాపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్షికమాలు చేపట్టారు. మహబూబాబాద్‌లో రాస్తారోకో చేస్తోన్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. ఒకదశలో పోలీస్‌స్టేషన్ ముట్టడికి యత్నించారు.
అట్టుడికిన సిరిసిల్ల
జేఏసీ నేతల అరెస్టు వార్తతో సిరిసిల్ల అట్టుడికింది. తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నాయకులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఠాణా ముందు బైఠాయించారు. అరెస్టులకు నిరసనగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ్మురాజు, పల్లం అర్జున్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఠాణా ఆవరణలోని సెల్ టవర్ ఎక్కగా, మరో ఇద్దరు ఠాణా సమీపంలోని దూరదర్శన్ కేంద్రంలోని సెల్ టవర్ ఎక్కారు. దీంతో 5 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాత్రి అయినా నేతలను విడుదల చేయలేదని ఆగ్రహిస్తూ ఠాణా గేటును తోసుకుని వెళ్లేందుకు ఉద్యమకారులు యత్నించారు. వెంటనే సీఐ సర్వర్, సీఆర్‌పీఎఫ్ దళాలు తెలంగాణవాదులను శాంతింపజేశారు.
మీడియాను కూడా ఠాణాలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. తెలంగాణవాదులు ఆగ్రహించడంతో వారికి లోనికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. వీరి అరెస్టు సమాచారంతో జిల్లా జేఏసీ చైర్మన్ బొత్త వెంకటమల్లయ్య, అధికార ప్రతినిధి మార్వాడి సుదర్శన్, అంజనేయులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వారితో సంప్రదించి సొంత పూచీకత్తుతో నాయిని నర్సింహాడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, న్యూ డెమెక్షికసీనాయకులు గోవర్ధన్‌లను పోలీసులు విడుదల చేశారు. విడుదలైన నేతలంతా నేరుగా ఠాణాలోని సెల్ టవక్కిన యువకులతో మాట్లాడి వారిని దిగిరావాలని విజ్ఞప్తి చేశారు.
కిరణ్‌ది ఆఖరి కిరణమే
- అది ఇంకా వెలగదు.. భయపెట్టి ఉద్యమాన్ని అణచలేరు: కోదండరాం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ఆఖరి కిరణమేనని, అది ఇంకా వెలిగేది లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పెంబర్తివద్ద పోలీసులు అడ్డుకొని ఆలేరు పోలీస్టేషన్‌కు తరలించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భయపెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసి పడుతుందన్నారు. ఢిల్లీలో ఒక వైపు చర్చలు జరుగుతూనే ఉండగా.. మరో వైపు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అరెస్టు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందనటానికి, ఉద్యమాన్ని బలవూపయోగంతో అణిచివేయిస్తోందనటానికి తమ అక్రమ అరెస్టులే నిదర్శమన్నారు. తెలంగాణ సాధించేవరకూ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీనే ప్రభుత్వం అరెస్టు చేయించిందంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.
అయ్యప్ప భక్తులు శబరికి వెళ్లి మకర జ్యోతిని చూడందే వెనుదిరుగరని, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండా తెలంగాణవాదులు వెనుకడుగు వేయకూడదని పిలుపునిచ్చారు. తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తరలిస్తున్న విషయాన్ని తెలుసుకొని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆలేరు జేఏసీ నాయకులకు, తెలంగాణ ఉద్యమ బిడ్డలకు ఈ సందర్భంగా కోదండరాం కోదండరాం అభినందనలు తెలిపారు. ఆలేరు ప్రజల ఉద్యమ స్పూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ముందు నిలవాలని ఆయన కోరారు.
తుపాకులకు బెదరం: సూర్యం
తుపాకులకు బెదరబోమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్షికసీ రాష్ట్ర నాయకులు పోటు సూర్యం హెచ్చరించారు. ప్రజలను, కార్మికులను భయపెట్టి బొగ్గును తవ్వలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆలేరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని తీవ్రంగా దుయ్యబట్టారు. తమ అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని, తెలంగాణ వచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు పోయేకాలం
- పోలీసులతో ఉద్యమాన్ని అణగదొక్కలేరు : నాయిని
సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న సింగరేణి కార్మికులకు సంఘీభావం తెలుపడానికి వెళ్తున్న తమను అరెస్టు చేయడం దుర్మార్గమని టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహాడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు పోయేకాలం వచ్చిందని హెచ్చరించారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం ఆయన ఠాణా ఎదుట బైఠాయించిన తెలంగాణ ఉద్దేశించి నాయిని మాట్లాడారు. ‘సీమాంవూధకు చెందిన లగడపాటి హైద్రాబాద్‌లో తిరుగొచ్చు. మాట్లాడొచ్చు. ఈ ప్రాంతానికే చెందిన మేం తెలంగాణలో పర్యటిస్తే తప్పా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచలేరని ఇకనైనా సీఎం కిరణ్‌కుమార్‌డ్డి గుర్తించాలని హితవు పలికారు. ‘ఖబడ్దార్ సీఎం కిరణ్.. ఖబడ్దార్ సీఎం కిరణ్’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. తమ అరెస్టు వార్తతో ఠాణాకు తరలివచ్చిన సిరిసిల్లలోని తెలంగాణవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు, టీఆర్‌ఎస్ నాయకులు, జేఏసీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తిని తెలంగాణ వచ్చేంతవరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
కోదండరాం సహా 70 మందిపై కేసులు
సింగరేణి కార్మికులకు మద్దతుగా కొత్తగూడెంకు బస్సుయావూతగా వెళ్తున్న రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులను అరెస్టు చేసి తరలిస్తుండగా ఆలేరులో అడ్డుకుని రాస్తారోకో చేసిన 70 మంది తెలంగాణవాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విధులను ఆటంకం కలిగించింనందుకు, రోడ్లను దిగ్బంధించినందుకు ఐపీసీ సెక్షన్ 147, 186, 341, 353 ఆర్/ బ్ల్యూ/34 కింద కోదండరాంతో పాటు మరో 69 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆలేరు డీఎస్పీ ఎం.యాదయ్య తెలిపారు.
కొత్తగూడెంలో టెన్షన్..టెన్షన్
నేడు కొత్తగూడెం, పాల్వంచ బంద్‌కు పిలుపు
కొత్తగూడెం, అక్టోబర్ 9 : తెలంగాణ జేఏసీ నాయకుడు పిట్టల రవీందర్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావులను ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయం(శేషగిరి భవన్)లో అరెస్టు చేసేందుకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు విఫలయత్నం చేశారు. రాత్రి 11గంటల సమయంలో వారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మాట్లాడుతుండగా ఎలాంటి అనుమతిలేకుండా ఏఐటీయూసీ కార్యాలయంలోకి ప్రవేశించిన కొత్తగూడెం సీఐలు రఘు, రవి, ముగ్గురు ఎసై్సలు తమ సిబ్బందితో వచ్చి రవీందర్, రాజేశ్వరరావును అరెస్టు చేసి, తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కూనంనేనితో పాటు సీపీఐ నాయకులు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా తమ కార్యాలయంలోకి ఎందుకు వచ్చారని కూనంనేని పోలీసులను నిలదీశారు. పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వాదించడంతో పోలీసులు కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం శేషగిరి భవన్ గేట్లకు సీపీఐ నాయకులు తాళాలు వేసినప్పటికీ, అక్కడ పోలీసులు భారీ బలగాలను మోహరించారు. కొత్తగూడెం డీఎస్పీ దేవదాస్ నాగుల్ అక్కడికి వచ్చి రవీందర్, రాజేశ్వర్‌రావును తమతో పంపించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి కూనంనేనితో సహౠ అక్కడ ఉన్న తెలంగాణవాదులంతా తిరస్కరించారు. సమాచారం అందుకున్న తెలంగాణవాదులు ఒక్కొక్కరుగా శేషగిరి భవన్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి పోలీసుల తీరు తెలంగాణవాదులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పోలీసుల చర్యలను నిరసిస్తూ సోమవారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల బంద్‌కు రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్షికసీ, సీపీఐ, టీడీపీలు పిలుపునిచ్చాయి.
0 comments:
Post a Comment