అయోమయం లో ఆజాద్ అండ్ కో !
గులాం నబి ఆజాద్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి ఇంచార్జ్, అయన అందరితో చర్చోప చర్చలు, టూర్ల మీద టూర్లు, నేతలకి డిల్లి దర్బార్ పిలుపులు, ఇక్కడున్న వాళ్లకి, అక్కడున్న వాళ్లకి ఒక్కటె ఉత్ఖంఠ, ఉక్కపోత..పాపం సోనియా అమ్మ దళం చూస్తె చానా జాలేస్తుంది. మల్లా ఎన్నికల్లో వచ్చే జాడ అయితే లేదు, ఇపుడు తెలంగాణా పై ప్రకటన చేయకపోతే/ ఇయ్యకపోతే తెలంగాణా నిప్పు అగేటట్టు లేదు, ఒకవేళ కుట్రలు, కుయుక్తులు పన్ని సమ్మెని ఆపినా, నిర్బంధం ఎక్కువ చేసినా , మరో రూపం లో ఈ లావా బయటికి రావలసిందే, అడ్డుపడిన అన్ని శక్తులు మాడి మసి కావలసిందే.
తెలంగాణా దెబ్బ రుచి చూడాలంటే, నిజాయితీ పోరాటాలు తెలుసుకోవాలంటే చరిత్ర చదవాల్సిందే. మచ్చుకు కొన్ని చదివినా చాలు, ప్రపంచమంతా ఒక కుగ్రామం అనే వాదుల గురించి నేను ఇక్కడ చెప్పదలచుకోలేదు, ఎందుకంటే అది అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల సంస్కృతిని చిన్న దేశాల మీద రుద్దడానికి పనికి వచ్చే వాదం కాని, అన్ని దేశాల వారికి సరి అయిన స్వతంత్రం ఇచ్చే వాదన కాదు, ఇదొక నయా వలస వాదం, సామ్రాజ్య వాదం అంతే. తెలంగాణా ఉద్యమాన్ని అన్ని పోరాట శక్తులు , ఉద్యమాలు ఇప్పటికే మద్దతును చాటాయి, ఒకళ్ళిద్దరు , కొద్ది మంది, ఈ ఉద్యమానికి విపరీతార్థాలు తీస్తే వచ్చే నష్టం లేదు.
కేంద్రం ఎం ఆలోచిస్తుంది ? ఏది ఆలోచించడానికి అయినా ఎవరితో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు అనేది ముఖ్యం. అక్కడ ఒక గవర్నర్ నరసింహన్ అనే నాన్ లోకల్, ప్రజా ఉద్యమాలని అణచి వేసే పోలీసు ఆఫీసర్ తోని మాట్లాడితే ఏమి జవాబు వస్తుంది, ఒక సి ఎం, అయన తెలంగాణా వాడు కాదు, కనీసం ఇక్కడ ఉదృతంగా సమ్మె నడుస్తుంది అని నివేదిక ఇవ్వలేదు, ఆయనతో చర్చ, అట్లనే ఇతర బృంద సభ్యులు.. ఎవరు తెలంగాణా ఉద్యమం పట్ల నాలుగు మంచి మాటలు చెప్తరు? కనీసం వాళ్ళెవరు ప్రజా ఉద్యమాలతో ఉన్న వారు కాదు, ప్రజలతో ఉన్నవారు అంత కన్న కాదు.. అయినా, కేంద్రానికి నిఘా నివేదికలు నిజంగా పని చేస్తే, ఇవన్ని అవసరమా?
ప్రణబ్, అజాదు, ఎవరు లొల్లి వాళ్ళదే, ఎవరు ఏమి మాట్లాడతారో ఎవరికీ తెలవదు? ఒక ప్రకటనకి , ఇంకొక ప్రకటనకి పొంతన ఉండదు, ప్రణబ్ గారు ఆర్థిక మంత్రి అంటే, ఈ దేశ భవిషత్తు ఏమిటో మనమందరం ఊహించుకోవచ్చు. సి ఎం గారు ఇంకా ఒక విచిత్ర మైన ముచ్చట చెప్తరు, అందరికి ఆమోదయోగ్య మైన ప్రకటన, ఇంత ఫూలిష్ స్టేట్ మెంట్ ఇంకొకటి ఉంటుందా ఎక్కడన్నా? పిల్లిని, ఎలుకని కూసో బెట్టి చర్చలు చేస్తే ఎవరికీ ఆమోదయోగ్యమైన సమాధానం చెప్తరు? కట్టే ఇరగొద్దు, పాము చావోద్దు..ఇదే వైఖరి తో కేంద్రం ఉండి, ఇదే వైఖరితో మన మేధావులు ఉన్నట్టు కనిపిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్ది, ఉద్యోగాస్తులలో గుబులు గుబులు అయితుంది అని చాల ఫోన్లు వస్తున్నాయి, గుబులు ఉద్యోగాలు పోతాయని కాదు, ఇపుడైనా కేంద్రం సరి ఐన ప్రకటన ఇవ్వదేమో అని, ఇన్ని ప్రాణాలు పోయినా కూడా, ఈ పాడు ప్రజాస్వామ్యం ఒక నిర్ణయం ప్రకటించ కుండా ఇంకా కాలయాపన చేస్తుందా?
సింగరేణి అగ్రనాయకత్వం మెల్లిగా పావులు కదుపుతుంది, కొంత మంది కార్మికులని మెల్లిగా మచ్చిక చేస్తుకుంటుంది, సమ్మె విరమిస్తారేమో అని నిరంతరం శ్రమించే ఉద్యమ కారులైన కార్మికులు వాపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు అట్టర్ కన్ఫ్యుసన్ లో ఉన్నట్టు వాళ్ళే చెపుతున్నారు. పేర్లు ఎందుకు లే కాని, కాంగ్రెస్ పెద్ద అయోమయం లో ఉంది అని వాళ్ళే చెపుతున్నారు. టీ ఆర్ ఎస్ కే క్రెడిట్ అంత పోతుందీ కదా అని కేంద్రం బాద పడుతున్నట్టు చెపుతున్నారు, వాళ్ల పార్టీ ఎంత చేసినా కూడా ఎవరు గుర్తించట్లేదు అని కూడా అన్నారు, ఎంత చేసిందో , ఎం చేసిందో నాకు అయితే తెలవదు కాని దీక్ష చేసినట్టే చేసి , ఇందిరా పార్క్ దగ్గర యమా జోరుగా డాన్స్ చేసింది మాత్రం అందరు కళ్ళార చూసారన్నది పచ్చి నిజం. అది కూడా ఉద్యమమే అంటే చేసేది కూడా ఏమి లేదు..చేసేది ఏమి లేక ఇంక భవిషత్తు లేదని రాజీనామాలు చేసే వాళ్ళు కూడా ఉద్యమ కారులె, ఇంట్లో ఉండి విశ్లేషణ చేసే వాళ్ళు కూడా అతి ఉద్యమ కారులు, ఒక్క పైసా ఖర్చు చేయకుండా, కుటుంబాలకి దూరం కాకుండా, ఏ విధమైన త్యాగాలు చేయకుండా ఉండేది కూడా ఉద్యమమే అంటరు మావోల్లు(కొందరు)అందులో రాజకీయ పార్టీ వాళ్ళు.
ఒక నాయకుడు తెలంగాణా ఇస్తే మాకేంది అని అమాయకంగా అడిగిండు, ఇస్తే మీకు కానీసం అడిగే హక్కు ఉంటుదేమో కాని , ఇయ్యక పొతే మాత్రం ఇంక భూస్తాపితం అవడం మాత్రం ఖాయం అని చెప్పాల్సి వచ్చింది. అసలు కేంద్రం చర్చలు ఎటు వైపు? ఏ ఒక్క నాయకుడికి తెలవదు, కనీసం కోర్ కమిటీ సభ్యులు కూడా ఆలోచిస్తున్నట్టు లేదు. ఎంత మంచి అబద్దం చెప్పి ఇన్ని కోట్ల మందిని మభ్య పెడదామా అని అనుకుంటున్నారా? లేకపోతె నెక్స్ట్ ఎన్నికల వరకు ఏదో ఒకటి చెప్పి కాలం వెల్ల బుచ్చుతారా? అసలు తెలంగాణా ఇచ్చేటట్టు ఉంటె నిన్నటికి నిన్న పోలీసు బలగాలని దింపి , కార్మికులను నిర్బందించి పనికి తీసుక పోవడం దేనికి చిహ్నం? గోదావరి ఖని లో ఇరవై మంది మీద కేసు పెట్టి అందులో ఏడుగురు మహిళలు, అందరిని అర్రెస్ట్ చేసి కరీంనగర్ జైలు కి పంపించడం తెలంగాణా ఇవ్వటానికేనా? కార్మిక సంఘ నాయకులని లొంగ దీసుకోవడానికి కేంద్రం ఇపుడే ఏమి ఇచ్చేటట్టు లేదు అని చెప్పి, ఏదో ఒకటి చెప్పి సమ్మె ని విరమించాలని చూడటం అబద్ధం కాదు కదా! అవును, సింగరేణి మీద నిర్బంధం చేస్తే, ఇవ్వాళ అంతే పవర్ఫుల్ ఉన్న ఎక్సైస్ శాక వాళ్ళు సమ్మె లోకి దిగారు. ఏ దెబ్బ మరి పెద్దగుంటది కేంద్రానికి.
ఉద్యమం కేంద్రికృతమైతే ఒక విధంగా మంచిదే కాని పనులు ముందుకు జరుగనపుడు,ఎప్పటికప్పుడు ప్రణాలికాలని, ఉద్యమ పందాలని మార్చడం తప్పని సరి, మార్చడం అంటే రైల్ రోకో తేదీలు మార్చడం కాదు..ముందు ఎటువంటి అవగాహన లేకుండా ఎందుకు తొందరపడి నిర్ణయిస్తారో ,మారుస్తారో ఇప్పటివరకు ఎవరికీ తెలవదు, తెలిసినా మాట్లాడే పరిస్తితి లేదు..అందరికి సౌకర్యంగా ఉండే ఉద్యమాల ద్వారా కేంద్రం లో కాని, మనల్ని జలగల్లా పట్టి పీడిస్తున్న మనుషులకి కాని ఏమి కాదు, ఇది వాస్తవం, ఇదే వాస్తవం. జాక్ ఒక రాజకీయ పార్టీ కనుసన్నలలో నడుస్తుందని వేరే పార్టీల వారు, సంఘాల వారు ఇప్పటికే ఒక ముద్ర వేసారు, దీని నుండి బయట పడాల్సిన అవసరం ఉంది, ఇది కూడా కేంద్రం ఆలస్యం చేయడానికి ఒక పెద్ద అడ్డంకి కూడా.
ఉద్యమం హింసా రూపం గా మారక ముందే మనం జాగ్రత్త పడాలి, మెడకాయ మీద తలకాయ ఉంటె కేంద్రం అదే పని చేయాలి, ఆజాద్ అండ్ కో బతికి బట్ట కట్టాలంటే ఇంకొక మార్గం లేదు అన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అమాయకులు నేటికి తమ విలువైన ప్రాణాలను బలి పెడతనే ఉన్నారు, ఏమి చేయ కుండా ఉన్న కాంగ్రెస్ ఇతర నాయకులని మల్లా తెలంగాణా ఉద్యమం లోకి కాని , అధికారం లోనికి కాని రానిచ్చే పరిస్తితి లేదు, ఉంటె అది ఉద్యమానికి అవమానం. ఇవే ఫైనల్ మాచ్ కావాలె, ట్వెంటీ ట్వెంటీ లతోని నిర్ణయాలు ఉండవు, పాక్షికంగా వ్యక్తుల గెలుపు వోటములు ఉంటాయి అంతే , ఎవడు పోయి ఏ టీం లో ఆడుతాడో నిర్ణయించేది కేవలం డబ్బు మాత్రమె..ఇపుడు ఆలస్యం చేస్తే లేని పోనీ అనుమానాలకి తావు ఇచ్చిన వాళ్ళం అవుతాం..సమ్మె విరమిస్తే వచ్చే లాభం ఏమో కాని , వచ్చే నష్టం మాత్రం ఊహించలేనిది.
అందరు కే సి ఆర్ వైపే ఆశగా చూస్తున్నారు, ఉన్న ఒకే ఒక్క నాయకుడు, కేంద్రం భావిస్తున్నట్టు, ప్రజలు అనుకుంటున్నట్టు, ఇయ్యల్నే చల్ల ముచ్చట చెప్పిన్రు..కేంద్రం మోసం చేస్తే మల్లా దీక్ష కి కూసుంటా అని, ఎం చేయాలే, ఇంకొక నాయకుడు ఎవరూ కూడా తెలంగాణా కోసం ఈ మాటలన్న మాట్లాడట లేరు..అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి దీక్షకు కూచుంటే వచ్చే నష్టం ఏంది? అన్ని పార్టీలు కలిసి ఎందుకు కూసోరు? యెహ్ హై తెలంగాణా లీడర్స్ ! వీళ్ళింతే మారరు, మా ప్రజలిన్తే మిమ్మల్ని మార్చిన్దాకా నిదుర పోరు, పోరు ఆగదు!
అవును ఎన్ని రోజులు? ఇపుడే ఏది చెప్పలేం అని ప్రణబ్ గారు అనడం చాల విడ్డూరం, ఇదేదో వంద రోజుల సినిమా లాగ చెపుతున్నాడు సారూ..అన్న! తరతరాలుగా చేస్తూన్న ఉద్యమం, ఇపుడే మీకళ్ళకి జర చూపోచ్చింది అదికూడా ఇన్ని ప్రాణాల త్యాగాల తర్వాత, అది కూడా మీ లేక్ఖలు లాభాలు దెబ్బ తినడం వల్ల..ఇప్పటికే చాల లెట్, ఇంకా లెట్ చేస్తే జీవిత కాలం లేటు..జర సోచో భైయ్యా! యెహ్ హై తెలంగాణా , ఇస్ సే పంగా నా లేనా..జై బోలో తెలంగాణా!
News take by : simplytelangana
0 comments:
Post a Comment