బాబుకు తెలంగాణ సెగ
- కాన్వాయ్‌ని అడ్డుకున్న టీఆర్‌ఎస్ మహిళా నేతలు
- శివాపూత్తిన తెలుగు తమ్ముళ్లు
- పోలీసు లాఠీలతో దాడికి యత్నం
- మహిళా నేతలకు గాయాలు
దుండిగల్, అక్టోబర్ 9 : తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సెగ తగిలింది. నగర శివారులో సూరారంలోని నారాయణ హృదయాలయ ఆసుపవూతిలో చికిత్స పొందుతున్న కైకలూరు ఎమ్మెల్యే జే వెంకటరమణను ఆదివారం పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చారు. విషయం తెలిసిన తెలంగాణవాదులు అక్కడికి చేరుకొని ఆసుపత్రి బయటే బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. అనంతరం బాబు వెంకటరమణను పరామర్శించి వెళ్తుండగా టీఆర్‌ఎస్ మహిళా కార్యదర్శి శోభాకృష్ణగౌడ్, సర్కిల్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు పప్పిడ్డి సురేందర్‌డ్డి నాయకత్వంలో తెలంగాణవాదులు బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.
దీంతో కాన్వాయ్ అక్కడే నిలిచిపోవడంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు మహిళలని చూడకుండా తెలంగాణవాదులపై పోలీసు లాఠీలతో దాడికి యత్నించారు. ఓవైపు పోలీసులు తెలంగాణవాదులను అడ్డుకుంటుండగానే వీరు కూడా వారికి జతయ్యారు. మహిళలు కాబట్టి ఊరుకుంటున్నాం.. లేకుంటే ఇక్కడే చంపి పాతరేసేవాళ్లం అంటూ ఊగిపోయారు. తాము తలుచుకుంటే ఒక్క తెలంగాణవాది, టీఆర్‌ఎస్ నేతలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తిరగలేరని హెచ్చరించారు. ఇరువర్గాల ఘర్షణలో కొందరు మహిళా నాయకురాళ్లు గాయాలపాలయ్యారు. అనంతరం పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇంతటితో ఆగని తెలుగుతమ్ముళ్ళు బాబు కాన్వాయ్ వెళ్ళిపోయిన తరువాత రోడ్డుపై బైఠాయించి టీఆర్‌ఎస్ నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణవాదులు దుండిగల్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. మహిళా నేతలపై లాఠీలతో దాడికి యత్నించిన తెలుగుదేశం పార్టీనేతలపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన పేట్‌బషీరాబాద్ ఏసీపీ శివరామకృష్ణ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Keywords: Andhra Pradesh, Telangana issue, Political consulation, Political parties
Take By : T News
0 comments:
Post a Comment