సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తూ చైతన్యం చేస్తున్న కంప్యూటర్ ఉపాధ్యాయులకు కనీస వేతనం కరువయిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి అన్నారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో కంప్యూటర్ టీచర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2008 నుంచి కంప్యూటర్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం రూ. 1500నుంచి 2వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారిందన్నారు.
ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా వేతనాల్లో వ్యత్యాసాలున్నాయన్నారు. ఉద్యోగ భద్రత, ఈఎఫ్, ఫిఎఫ్, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు లేవన్నారు. జిఓ నెం.3 ప్రకారం రూ.10,300 చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. మెదక్ డివిజన్ పరిధిలో ఉన్న కంప్యూటర్ టీచర్లందరూ 23న ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించే సమ్మెకు హాజరుకావాలన్నారు.
ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఆశోక్, కంప్యూటర్ టీచర్లు శాంతికుమార్, మధు, వెంకటకృష్ణ, ప్రసున్నలత, గీత తదితరులు పాల్గొన్నారు.
Take By: Prajasakti
Tags: Telangana News, Medak, Sangareddy, Computer Teachers, Teachers, NIIT, APTEC, G.O. No. 3
0 comments:
Post a Comment