డిప్యూటీ సీఎం ఇల్లు ముట్టడి
- విద్యార్థులపై విరిగిన లాఠీలు
- ఏబీవీపీ సాహసం
- మార్మోగిన తెలంగానం
- ఇంటి వద్ద బైఠాయింపు
- రాజీనామా చేయాలని డిమాండ్
- లాఠీలకు పనిచేప్పిన పోలీసులు
- విచక్షణారహితంగా ఈడ్చిపారేశారు
- ఏబీవీపీ నేతలకు గాయాలు
- బలవంతపు అరెస్టులు
సంగాడ్డి, అక్టోబరు 22 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా ఇంటిని ఏబీవీపీ నాయకులు శనివారం ముట్టడించారు. డీప్యూటీ సీఎం పదవికి వెంటనే రాజీనామ చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి వద్ద విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగవూపవేశం చేసి విచక్షణారహితంగా ఈడ్చుకుంటూ వెళ్లి బలవంతంగా అరెస్టు చేయబోగా, విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ జులిపించి అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. పోలీసుల చర్యలను తిప్పికొట్టిన ఆందోళనకారులు ఒకదశలో వారికి ఎదురుతిరిగారు. దీంతో ఉప ముఖ్యమం త్రి ఇంటి వద్ద కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిం ది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ ప్రజల ఓట్లచే అధికార పీటం ఎక్కిన డీప్యూటీ సీఎం దామోదర్‌రాజనర్సింహా అదే ప్రజల కోసం ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పోతిడ్డిపల్లి విద్యానగర్‌లోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ పెద్దఎత్తున ఈ ముట్టడి జరిగింది. విద్యార్థులు ఒక్కసారిగా ఏబీవీపీ జెండాలు చేతబూని ఉప ముఖ్యమంత్రి ఇంటివైపు పరుగులు తీసి తెలంగాణ నినాదాలిస్తూ ముట్టడించారు. తెలంగాణవాదులు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులు, ఏబీవీపీ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మొండికేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులపై పోలీసులు విచక్ష ణా రహితంగా ప్రవర్తిస్తూ చేతికి దొరికినకాడికి కాళ్లు, చే తులు, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై మండిపడిన ఆందోళనకారులు ఒకదశలో రెచ్చిపోయారు. పోలీసులపై ఎదురుదాడికి దిగి ప్రతిఘటించారు. ఈ క్ర మంలో ఏబీవీపీ నాయకులు జగన్, శ్రీనివాస్8డ్డి, శ్రీ కాంత్, సునీల్ తదితరులకు గాయాలయ్యాయి. మొత్తానికి పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితిని చక్కబెట్టారు.
డీప్యూటీకి పదవిపై మక్కువ
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా డీప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహాకు పదవిపై మక్కువ ఎక్కువైందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జగన్ వ్యాఖ్యానించారు. పదవులకు ఆశపడి తెలంగాణ ఆంశాన్ని పూర్తిగా మరిచిపోవడం ఆయన తీరును తప్పు పట్టేలా చేస్తున్నదన్నారు. తె లంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముగ్గురు మం త్రులు ఆ పదవులకు రాజీనామాలు చేయాలని, లేనిపక్షం లో వారి నియోజకవర్గాలలో గ్రామ సభలు నిర్వహించి మంత్రులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయిస్తామని ఆయ న హెచ్చరించారు. కార్యక్షికమంలో ఏబీవీపీ జోనల్ ఇన్‌చార్జి యాదగిరి, నాయకులు ఆంజనేయులు, రమేష్, పాం డు, వేణు, శ్రీను, సుధాకర్, శివరామకృష్ణ పాల్గొన్నారు.
Take By: T News
Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC, bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha
0 comments:
Post a Comment