రోకో.. రైల్ రోకో పట్టాలు దిగని పోరు
- నేడు పట్టాలపైకి తెలంగాణం
- మూడు రోజులు నిరవధిక ఆందోళన
- ఉరుకుతున్న ఉద్యమ క్షిశేణులు
- టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమొక్షికసితోపాటు టీ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ టీ ఫోరం నేతలూ రెడీ
- పది జిల్లాల్లో 30 కీలక పాయింట్లు
- ఉత్తర, దక్షిణ భారతం మధ్య తెగనున్న లింక్
- రైల్‌రోకో విచ్ఛిన్నానికి సర్కారు కుట్ర
- భారీగా మోహరించిన పోలీసులు
- అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు
- కుట్రలు ఛేదిస్తాం: ప్రత్యేకవాదులు
- ముందు జాగ్రత్త చర్యల్లో రైల్వే శాఖ
- భారీగా రైళ్ల రద్దు.. మళ్లింపు
- విజయవంతంగా ఆర్టీసీ సమ్మె
- స్తంభించనున్న ప్రజా రవాణా
- కోటి మంది ప్రయాణికులపై ప్రభావం
- నేడు ఉద్యోగ జేఏసీ-ఉపసంఘం భేటీ
- నేతల మూడు కీలక డిమాండ్లు
- ప్రత్యామ్నాయాల్లో కిరణ్ సర్కార్
- తెలంగాణలో ఆటోల బంద్ వాయిదా
నాలుగు కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఒకవైపు.. తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర సర్కారు బలగాలు మరోవైపు! ఇప్పుడు ఉద్యమం పోరు కూడలిలో ఉంది! సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేసే క్రమంలో రైల్‌రోకో రూపంలో తెలంగాణ ఉద్యమం తన సత్తా చూపెట్టబోతున్నది. ఇప్పటికే బస్సు హారన్ బందైంది. ఇప్పుడు రైలు కూత మూగబోనుంది. దాని స్థానంలో నాలుగు దశాబ్దాల ఉద్యమం పొలికేకలు వేయనుంది! హస్తిన దాకా తన ఆకాంక్షను వినిపించనుంది. తెలంగాణ కొట్లాట పట్టాపూక్కనుంది! నేటి నుంచి మూడు రోజులు.. 15,16,17 తేదీల్లో నిరవధికంగా ఎక్కడి రైళ్లకు అక్కడే రెడ్‌సిగ్నల్ పడబోతున్నది! తెలంగాణ కేంద్ర బిందువుగా ఉత్తర దక్షిణ భారతాల మధ్య లింకు తెగిపోనుంది! తెలంగాణలో మరోసారి ప్రజా రవాణా పూర్తి స్థాయిలో స్తంభించనుంది!
మొన్నటి పట్టాలపైకి పల్లె.. నిన్నటి రెండు రోజుల రైల్‌రోకో.. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకూ జరిగిన ఈ రెండు ఆందోళనలూ విశేష స్థాయిలో విజయవంతమైన నేపథ్యంలో వాటి స్ఫూర్తి తో మూడో ఆందోళననూ దిగ్విజయం చేసేందుకు తెలంగాణ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమయ్యాయి. ఈసారి రైల్‌రోకో వ్యూహాన్ని మార్చేశారు. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే 30 పాయింట్లను ఎంపిక చేసి ధూంధాం నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజకీయ జేఏసీ మార్గదర్శకత్వంలో టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్షికసీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రైల్‌రోకోలో పాల్గొననున్నారు. రైల్‌రోకోలో మంత్రులు సైతం పాల్గొనాలని టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సీపీఐ కూడా రైల్‌రోకోకు సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ కేడర్ కూడా రైల్‌రోకోలో పాల్గొననుంది.
టీడీపీ టీ ఫోరం తమ శ్రేణులు సైతం రైల్‌రోకోలో పాల్గొంటాయని ప్రకటించింది. టీకాంక్షిగెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేశవరావు 15న నల్లగొండ, 16న వరంగల్, 17న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైల్‌రోకోలో పాల్గొంటారు. సకల జనుల సమ్మెలో భాగంగా సెప్టెంబర్ 24, 25వ తేదీల్లో చేపట్టిన మొదటి విడత రైల్‌రోకో, అంతకు ముందు నిర్వహించిన పట్టాలమీదికి పల్లెపల్లె కార్యక్షికమాలు భారీస్థాయిలో విజయవంతమయ్యాయి. పట్టాలన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. ఉత్తర దక్షిణ భారతాల మధ్య లింకూ పూర్తిగా తెగిపోయింది. పోలీసులు ఎంత అడ్డుకున్నా రెండురోజులు రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత అనుభవాల నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో తెలంగాణలో తిరిగే 124 ప్రధాన రైళ్లను పూర్తిగా, కొన్నింటిని తెలంగాణలోకి రాకుండా పాక్షికంగా రద్దుచేసింది.
కొన్నింటిని దారి మళ్లించింది. మరికొన్నింటి వేళల్లో మార్పులు చేసింది. రదె్దైన రైళ్లలో ప్రయాణానికిగాను ఇప్పటికే టికెట్లు తీసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. రైల్‌రోకోల తర్వాత ప్రయాణికుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడుపుతామని తెలిపింది. తెలంగాణ ప్రాంతం ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే రూట్ కావడంతో రైల్‌రోకోల ప్రభావం దేశవ్యాప్తంగా పడనుంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్ అయిన ఒక్క సికింవూదాబాద్ జంక్షన్ నుంచే 110 రైళ్ల ద్వారా రోజూ లక్షా 50వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తంగా ఈ రైల్‌రోకోల వల్ల 5లక్షల మంది రవాణాపై ప్రభావం పడనుందని అంచనా. కానీ.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలో భాగంగా సాగుతున్న ఉద్యమంపై పంతానికి పోతున్న రాష్ట్ర ప్రభుత్వం రైల్‌రోకోను విచ్ఛిన్నం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను దించుతున్నది.
అర్ధరాత్రి నుంచే అక్రమ అరెస్టులను మొదలు పెట్టింది. ఇప్పటికే వివిధ తెలంగాణ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు దిగాయి. ఈ సారి రైల్‌రోకోను జరగనిచ్చేది లేదని పోలీసులు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను, బెదిరింపులను పట్టించుకోని ఉద్యమకారులు.. దీటుగా రైల్‌రోకోను విజయవంతం చేసి తీరుతామని సవాలు విసురుతున్నారు. పట్టాలపై తెలంగాణ జెండా ఎగురవేసి తీరుతామని చెబుతున్నారు. ట్రాక్‌ల ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, 26రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణలోని బస్సులు తిరగడం లేదు. ఎన్‌ఎంయూ సమ్మె విరమణ ప్రకటన తర్వాత అక్కడక్కడా కొన్ని తిరుగుతున్నప్పటికీ అవి ప్రజల రవాణా అవసరాలను ఏ మాత్రం తీర్చడం లేదు. మొత్తం 8వేల బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో రోజుకు 80లక్షల మంది రవాణా నిలిచిపోతోంది. అంటే రైల్‌రోకో, ఆర్టీసీ సమ్మె వల్ల 15,16,17తేదీల్లో సుమారుగా రోజుకు కోటి మంది రవాణా పూర్తిగా స్తంభించిపోతుంది.
ఇదిలా ఉండగా.. సకల జనుల సమ్మె 32 రోజులు పూర్తి చేసుకుంది. ఉద్యోగ సంఘాలతో కేబినెట్ ఉపసంఘం చర్చలు జరిపేది లేదని భీష్మించుకున్నా.. చివరకు మెట్టు దిగింది. శనివారం చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు ఆహ్వానం పంపింది! నిజానికి శుక్రవారం చర్చలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆహ్వానం పంపించారు. అయితే తాము ఉపసంఘంతోనే చర్చలకు వస్తామని నేతలు స్పష్టం చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. శనివారం జరిగే చర్చల్లో కూడా తమ మూడు కీలక డిమాండ్లపైనే నేతలు పట్టుబట్టనున్నారు. సమ్మె విచ్ఛిన్నానికి తీసుకొచ్చిన 177, ఎస్మా జీవోలు రద్దు చేయాలని, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్‌పై పోలీసుల హత్యాయత్నంపై విచారణ జరిపించాలని, తెలంగాణకు అనుకూలంగా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగే చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆటోల బంద్ వాయిదా
రైల్‌రోకో మూడు రోజుల సందర్భంగా తలపెట్టిన ఆటోల బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ అమానుల్లాఖాన్ ప్రకటించారు. అన్ని ఆటో యూనియన్ల నాయకులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శుక్రవారం తెలిపారు.
ఎవక్కడ?
మౌలాలి రైల్వేస్టేషన్ : జేఏసీ చైర్మన్ కోదండరాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే కవిత, న్యూడెమొక్షికసీ నేతలు పీ సూర్యం, గోవర్ధన్.
సీతాఫల్‌మండీ : టీఆర్‌ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు, మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి, టీఆర్‌ఎస్ నేతలు టీ పద్మారావు, బొంతు రామ్మోహన్, పుటం పురుషోత్తం.
జమ్మికుంట రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్.
అక్కన్నపేట్ రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత టీ హరీష్‌రావు, స్థానిక జేఏసీ, పార్టీల నాయకులు.
రామగుండం రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ వివేక్ , టీఆర్‌ఎస్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు.
నిజామాబాద్ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ, బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆలూరు గంగాడ్డి, న్యూడెమొక్షికసీ నేతలు కే యాదగిరి, వీ ప్రభాకర్, బీ దేవరాం.
భువనగిరి రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి.
వరంగల్ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు సిరికొండ మధుసూదనాచారి, అచ్చ విద్యాసాగర్, న్యూడెమొక్షికసీ నాయకులు ఎన్ అప్పారావు.
నల్లగొండ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌డ్డి, టీఆర్‌ఎస్
పొలిట్‌బ్యూరో సభ్యులు జీ జగదీష్‌డ్డి, కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బండ నరేందర్‌డ్డి, నాయకులు చకిలం అనిల్, న్యూడెమొక్షికసీ నాయకులు జనార్ధన్, డేవిడ్‌కుమార్.
మహబూబాబాద్ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌డ్డి, టీ రవీందర్‌రావు, సంగులాల్, న్యూడెమొక్షికసీ నాయకులు ఎం వెంకన్న.
తెల్లాపూర్ రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ విజయశాంతి, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌డ్డి.
గద్వాల రైల్వేస్టేషన్: కాంగ్రెస్ నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు సింగిడ్డి నిరంజన్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, నేతలు గువ్వల బాలరాజ్, విష్ణువర్ధన్, ఠాకూర్ బాలాజీ సింగ్.
ఆదిలాబాద్ రైల్వేస్టేషన్: స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు లోక భూమాడ్డి, బాలూరి గోవర్ధన్‌డ్డి, జేఏసీ జిల్లా చైర్మన్ మహేంవూదనాథ్.
కామాడ్డి రైల్వేస్టేషన్: స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, టీఆర్‌ఎస్ ఎల్లాడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌డ్డి, నాయకులు ఎం వేణుగోపాల్‌గౌడ్, తిరుమల్‌డ్డి, బీజేపీ నాయకులు మురళీధర్‌గౌడ్, జేఏసీ చైర్మన్ జగన్నాథం.
మంచిర్యాల రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్ స్థానిక ఎమ్మెల్యే గడ్డం అరవిందడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బీజేపీ నాయకులు గోనే శ్యాంసుందర్‌రావు, న్యూడెమొక్షికసీ నాయకులు పీ శ్రీనివాస్, నైనాల వెంక
సిర్పూర్-కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్ స్థానిక ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, తూర్పు విభాగం అధ్యక్షుడు పురాణం సతీష్‌కుమార్.
కాజీపేట రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ మంత్రి జీ విజయరామారావు, మాజీ ఎంపీ అజ్మీరా చందులాల్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ టీ రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు.
వికారాబాద్ రైల్వేస్టేషన్: మాజీ మంత్రి చంద్రశేఖర్, రంగాడ్డి పశ్చిమ అధ్యక్షుడు నాగేంవూదగౌడ్, నర్సింలు, షరీఫ్.
మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్: మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే సి లక్ష్మాడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్యా, న్యూడెమొక్షికసీ నాయకులు కేజీ రాంచందర్.
డోర్నకల్ రైల్వేస్టేషన్: మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు భూక్యా కిషన్‌నాయక్, ఎన్ నరేష్‌డ్డి.
తాండూర్ రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు పర్యాద కృష్ణమూర్తి, నాయకులు బీ విజయకుమార్, ముజీబ్.
బాసర రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ అధ్యక్షుడు కే శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్, బీజేపీ జిల్లా పశ్చిమ అధ్యక్షుడు రావుల రాంనాథ్.
మిర్యాలగూడ రైల్వేస్టేషన్: టీఆర్‌ఎస్ నాయకులు అమరేందర్‌డ్డి, నాగార్జునచారి, బీ శ్రీనివాసరాజు, డీ ప్రవీణాడ్డి, న్యూడెమొక్షికసీ నాయకులు వీ కోటేశ్వర్‌రావు.
ఖమ్మం రైల్వేస్టేషన్: న్యూడెమొక్షికసీ నాయకులు పీ రంగారావు, రాయల చంద్రశేఖర్.
మధిర రైల్వేస్టేషన్: న్యూడెమొక్షికసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎస్ వెంక టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి.
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment