రోడ్‌మ్యాప్ ప్రకటించేవరకు దీక్ష ఆగదు
-కాంగ్రెస్ కార్యకర్తగానే ఆమరణ నిరాహార దీక్ష
-తెలంగాణ రాష్ట్ర సాధనే నా లక్ష్యం
-ఇవ్వకపోతే పార్టీని వీడేందుకు సిద్ధం
-దీక్షకు 145 సంఘాల మద్దతు
-కోమటిడ్డి వెంకటడ్డి
నల్లగొండ, : ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చేవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిడ్డి వెంకట్‌డ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండలోవిలేకరులతో మాట్లాడారు. 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని, కేంద్రం తెలంగాణపై రోడ్‌మ్యాప్ ప్రకటించేంత వరకు దీక్ష ఆగదని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం చేస్తున్న పోరాటం చివరి అంకానికి చేరిందని, ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికీ తెలంగాణ రాదన్నారు. అందుకే ఆమరణ దీక్ష అనే కఠిన నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అన్ని పార్టీల ప్రజావూపతినిధులూ కలిసి రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిన అవసరముందన్నారు. పార్టీలకు అతీతంగా రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, ప్రజావూపతినిధులంతా ఇప్పటికైనా రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని, కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇవ్వనన్నప్పుడు మాత్రమే వేరే నిర్ణయం తీసుకుంటానన్నారు.
తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వెల్లడించారు. శాంతియుతంగా చేపట్టే దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలని కోరారు. దీక్షలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించకుంటే ఎంపీలతో కలిసి చర్చించి పార్టీని వీడేందుకు సైతం వెనకడుగు వేయబోమని కోమటిడ్డి ప్రకటించారు. దీక్షకు తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 145 సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న ప్రజావూపతినిధులకు, ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.