హైదరాబాధే! రాజధానే పీటముడి..చర్చలకు అదే వేడి
భాగ్యనగరితో ముడిపడిన విభజన వివాదంఇది ఢిల్లీ పెద్దల మాట.. పరిష్కారానికి యత్నంచొరవ చూపనున్న కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానంఅందరితో సంప్రదింపులకు అతి త్వరలో రోడ్‌మ్యాప్వైఎస్ హయాంలో చేసిన అసెంబ్లీ తీర్మాణమే ప్రాతిపదిక
అవగాహన కుదిరితే పార్లమెంట్ వర్షాకాల భేటీలో స్పష్టత!
కాంగ్రెస్ కురు వృద్ధుడు, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణస్వామి తదితరులు ప్రస్తావించిన అంశాలివి. బుధవారం ఉదయం జరిగిన కోర్ కమిటీ భేటీలోనూ హైదరాబాదే కీలక అంశంగా మారింది. ఇదంతా చూస్తుంటే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో హైదరాబాద్ నగరమే కీలకమైన అంశంగా, అదే ప్రధానమైన అడ్డంకిగా మారినట్లు ఇట్టే అర్థమవుతుంది. హైదరాబాద్ చుట్టూ పీటముడి బిగుసుకున్నట్లు తెలిసిపోతుంది.
హైదరాబాద్ హోదా విషయంపై ఒక స్పష్టత ఏర్పడితే కానీ, తెలంగాణ విషయం తేలదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హోదా విషయంపై తెలంగాణ నేతలతోపాటు, సీమాంధ్ర నేతలతో కూడా మాట్లాడాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. 'అవతలి వారితో కూడా మాట్లాడాలి కదా!' అని ప్రణబ్, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్‌లు తెలంగాణ నేతలతో అన్నారు.
మూడు ప్రాంతాల వారిని ఒప్పించిన తర్వాతే తెలంగాణపై ఏ నిర్ణయమైనా తీసుకోగలమని అధిష్ఠానం ఇప్పటికే ఒక స్పష్టమైన అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... మూడు ప్రాంతాల వారితో చర్చల ప్రక్రియ ప్రారంభించేందుకు త్వరలో రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు.
ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు, జేసీ దివాకర్ రెడ్డి, శైలజానాథ్‌లతో ప్రణబ్ బుధవారం రాత్రి చర్చలు జరపడం గమనార్హం. సీమాంధ్ర నేతలతో భేటీకి ఈనెల 12 లేదా 13 తేదీల్లో సమయం కేటాయించేందుకు ప్రణబ్ అంగీకరించినట్లు కావూరి చెప్పారు. "అన్ని ప్రాంతాల నేతలతో చర్చలు జరుపుతున్నాం. ఈ విషయంలో గులాం నబీ ఆజాద్ చొరవ తీసుకుంటున్నారు'' అని ప్రణబ్ పేర్కొనడం విశేషం.
కోర్ కమిటీ భేటీలోనూ...
తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, పెరుగుతున్న ఒత్తిడి, ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తడంతో బుధవారం కోర్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ భేటీ అయ్యారు. తెలంగాణ సమస్యపై కీలక చర్చలు జరిపారు. ఇప్పటిదాకా తెలంగాణ నేతలతో జరిపిన చర్చల వివరాలను, రాష్ట్రంలో పరిస్థితులను ఆజాద్ కోర్ కమిటీకి వివరించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల గురించి చిదంబరం తెలిపారు. పరిసితి అదుపు తప్పితే రాష్ట్రపతి పాలన విధించే విషయం కూడా కోర్ కమిటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. "తెలంగాణకు సూత్రప్రాయంగా మేం వ్యతిరేకం కాదు. అయితే, దీనికి సంబంధించి అన్ని వర్గాల (స్టేక్ హోల్డర్స్) అభిప్రాయాలు తెలుసుకోవాలి'' అని వైఎస్ హయాంలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. దీనిపై రోశయ్యతో కమిటీ వేశారు.
తెలంగాణ నేతలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ తీర్మాన ప్రతిని ఫ్యాక్స్‌లో తెప్పించుకున్నానని ఆజాద్ చెప్పారు. అంతేగాక, తెలంగాణపై ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని కూడా అప్పటి పీసీసీ చీఫ్ డీఎస్ నుంచి ఫ్యాక్స్ ద్వారా తెప్పించుకున్నానని కోర్ కమిటీ భేటీలో తెలిపారు. "రాష్ట్ర విభజన చేయాలా; వద్దా? అనే అంశంపై చర్చ వద్దు. విభజన ఎలా చేయాలన్న దానిపైనే దృష్టి సారించండి'' అని తెలంగాణ నేతలు చెబుతున్నారని ఆజాద్ వివరించారు.
వైఎస్ హయాంలో చేసిన అసెంబ్లీ తీర్మానం కూడా ఇదే కోణంలో ఉందని... ఆ తీర్మానాన్ని చదివి వినిపించారు. ఈ తీర్మానం మేరకు సంబంధిత పక్షాలతో, నిర్ణీత తేదీల్లో చర్చల క్రమాన్ని పూర్తి చేసేందుకు రోడ్ మ్యాప్ ప్రకటిస్తే... తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు ఉపసంహరించుకోవచ్చునని ఆజాద్ పేర్కొన్నారు. ఈ సూచనకు కోర్ కమిటీ అంగీకరించినట్లు తెలిసింది.
చర్చల క్రమంలో హైదరాబాదే ప్రధానాంశంగా మారుతుందని అహ్మద్ పటేల్ కోర్ కమిటీలో అన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. గత అసెంబ్లీ తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ చర్చలకు రోడ్ మ్యాప్ ప్రకటించడం, హైదరాబాద్‌ను చర్చల్లో ప్రధానాంశంగా మార్చడం, జల వనరులు తదితర అంశాలను కూడా చర్చల్లో చేర్చడం కూడా చర్చల్లో వచ్చినట్లు తెలిసింది. ఆజాద్ ఫార్ములాపైనే కోర్ కమిటీ విస్తృత చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో చర్చలకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ గురించి ఒకటి రెండురోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. "కోర్‌కమిటీలో దీనిపై చర్చించాం. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని నిర్ణయించుకున్నాం'' అని అహ్మద్ పటేల్ మీడియాతో చెప్పారు.
పీఎంవో మంత్రి ఆరా
తెలంగాణ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కూడా దృష్టి సారించింది. బుధవారం రాత్రి పీఎంవో వ్యవహారాల మంత్రి నారాయణ స్వామితో పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ సమస్య పరిష్కార దిశలో చర్చలు ప్రారంభించాలని, ఈ క్రమంలో హైదరాబాదే ప్రధాన చర్చనీయాంశం అవుతుందని నారాయణ స్వామి పేర్కొన్నట్లు తెలిసింది.
పరిష్కార ఫార్ములాలో భాగంగా హైదరాబాద్‌ను కొద్ది సంవత్సరాల వరకైనా కేంద్ర పాలనలో ఉంచక తప్పదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. ఇందుకు మజ్లిస్‌ను విశ్వాసంలో తీసుకోవాలని పొన్నాల, ఉత్తమ్ చెప్పినట్లు తెలిసింది. "మజ్లిస్‌నే కాదు. సంబంధిత పార్టీలన్నిటితో చర్చిస్తాం'' అని నారాయణ స్వామి వారితో అన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు సంబంధించి పలు నివేదికలు, డాక్యుమెంట్లు అందించా

0 comments:
Post a Comment