ఇక ఉద్యోగ ఉద్యమం! పెన్‌డౌన్‌తో మొదలుపెట్టి.. సారత్రిక సమ్మె వరకు? సహాయ నిరాకరణకూ అవకాశం పార్టీలు,సేఏసీ మద్దతుపై అనుమానాలు దన్ను ఉంటుందని తెలశాకే తుది నిర్ణయం ముందుగా రాజకీయ జేఏసీకి ప్రతిపాదనలు నేడు ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ
హైదరాబాద్, జూలై 6 : తెలంగాణ ఉద్యోగులు మళ్లీ ఉద్యమించనున్నారా? పెన్‌డౌన్‌తో మొదలుపెట్టి.. సార్వత్రిక సమ్మె వరకు తమ ఉద్యమాన్ని తీసుకెళ్లే యోచనలో ఉన్నారా? లేదా మళ్లీ సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టబోతున్నారా? గురువారం జరిగే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ సమావేశం దీనిపై వాడివేడిగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
రెండు మూడు రోజులుగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కోసం తమవంతు కర్తవ్యంగా ఏం చేయాలన్న విషయం ఉద్యోగుల్లో చర్చకు వస్తోంది. ఇప్పటికే వందమందికి పైగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. ఉద్యోగులూ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలోనని ఉద్యోగసంఘాల నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
ముందు పెన్‌డౌన్‌తో మొదలుపెట్టి.. చివరకు సార్వత్రిక సమ్మె వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనలో కొందరు నేతలున్నారు. గతంలో విజయవంతమైన సహాయ నిరాకరణ అస్త్రాన్ని మళ్లీ సంధిస్తే ఎలా ఉంటుందని మరికొందరు అంటున్నారు. అయితే.. గతంలో తాము సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టినప్పుడు పార్టీల నుంచి ఆశించినంత మద్దతు రాలేదని, ఇప్పుడూ అదే పరిస్థితే ఉంటే విఫలమవుతామన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. అప్పట్లో సహాయ నిరాకరణ ముగింపుపైనా కొంత గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.
పాత అనుభవాల దృష్ట్యా.. అసలు తమకు తెలంగాణ రాజకీయ జేఏసీ నుంచి, వివిధ పార్టీల నుంచి ఎంతమేర మద్దతు వస్తుందన్న విషయాన్ని వాళ్లు ముందుగానే తేల్చుకోవాలనుకుంటున్నారు. అందుకోసం తమవైపు నుంచి కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసి.. వాటిని రాజకీయ జేఏసీకి అందజేస్తారు. రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులందరితోనూ జేఏసీ సమావేశం కానుంది.
ఆ భేటీలో కూడా ఈ ప్రతిపాదనలపై ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు చర్చిస్తారు. వాళ్ల నుంచి తగిన హామీ వచ్చిన తర్వాతే తమ ఉద్యమాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. గురువారం ఉద్యోగసంఘాల జేఏసీ భేటీలో అన్ని సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment